Asianet News TeluguAsianet News Telugu

తుఫానుకు ‘‘పెథాయ్’’ అన్న పేరు వెనుక..?

హుధుద్, నీలం, తిత్లీ, గజ, ఏంటీ ఇవన్నీ.. తుఫాను తుఫాను అని పిలవొచ్చు కదా.. మళ్లీ పేర్లే ఎందుకు పెట్టారు అని చాలా మందికి సందేహం. అయితే దీని వెనుక చాలా కారణాలున్నాయి. వాతావరణం గురించిన సమాచారంపై వాతావరణ కేంద్రాలు వెల్లడించే సమాచారం ఎలాంటి అయోమయం లేకుండా ప్రజలకు సవ్యంగా చేరేందుకు తుఫానులకు పేర్లు పెడతారు. 

Why cyclone Phethai is named
Author
Amaravathi, First Published Dec 17, 2018, 9:31 AM IST

హుధుద్, నీలం, తిత్లీ, గజ, ఏంటీ ఇవన్నీ.. తుఫాను తుఫాను అని పిలవొచ్చు కదా.. మళ్లీ పేర్లే ఎందుకు పెట్టారు అని చాలా మందికి సందేహం. అయితే దీని వెనుక చాలా కారణాలున్నాయి. వాతావరణం గురించిన సమాచారంపై వాతావరణ కేంద్రాలు వెల్లడించే సమాచారం ఎలాంటి అయోమయం లేకుండా ప్రజలకు సవ్యంగా చేరేందుకు తుఫానులకు పేర్లు పెడతారు.

ఒకే ప్రాంతంలో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ తుఫానులు సంభవిస్తే వాటి మధ్య తేడా, ప్రభావాల్ని గుర్తించేందుకు ఈ పేర్లు ఉపయోగపడతాయి. ఆగ్నేయాసియాలో దేశాలే తుఫానులకు పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. తిత్లీ పేరును పాకిస్తాన్, గజను శ్రీలంక పెట్టాయి.

తాజాగా ఏపీని వణికిస్తోన్న తుఫానుకు ‘‘పెథాయ్‌’’ అని పేరు పెట్టింది థాయ్‌లాండ్. పెథాయ్ అంటే ధాయిలాండ్ భాషలో ‘‘గింజ’’ అని అర్థం. కనీసం గంటకు 61 కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడిన తుఫాను సంభవించినప్పుడే పేర్లు పెట్టడం సాంప్రదాయంగా వస్తోంది.

ఉత్తర హిందూ మహాసముద్రంలో సంభవించే తుఫాన్లకు పేర్లు పెట్టడం 2004లో ప్రారంభమైంది. అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల్లో వచ్చే తుఫానులకు వాడిన పేర్లను మళ్లీ ఆరు సంవత్సరాల తర్వాత వాడుతారు. దీని కోసం కొన్ని దేశాలు సూచించిన పేర్లతో ఒక జాబితాను ముందుగానే సిద్ధం చేసుకున్నారు.

భవిష్యత్తులో సంభవించే తుఫాను ఊహించిన దానికన్నా ఎక్కువగా వచ్చినా.. ఆ పేరు సముచితంకాదని భావించినా దానిని జాబితా నుంచి తొలగించి కొత్త పేరు చేర్చుతారు. అయితే ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒకసారి వాడిన పేరును మళ్లీ వాడతారు.

ఆగ్నేయాసియా దేశాలైన భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, మాల్దీవులు, మయాన్మార్, ఒహన్, థాయిలాండ్ దేశాలు తుఫాన్లకు పేర్లు సూచిస్తూ పెద్ద జాబితా తయారు చేశాయి. తుఫాన్లకు వరుస క్రమంలో ఒక్కో దేశం పేర్లను పెడతాయి. రాబోయే రోజుల్లో వచ్చే సంభవించే తుఫాన్లకు ఫణి, వాయు, మహా, బుల్ బుల్‌లలో ఏదో ఒక పేరు పెట్టనున్నారు.

పెథాయ్ తుఫాన్: సముద్రంలో అల్లకల్లోలం

ఏపీలో ‘‘పెథాయ్’’ విలయ తాండవం

పెథాయ్ తుఫాన్: తెలంగాణ‌పై ఎఫెక్ట్

పెథాయ్‌ తుఫాన్: అధికారులను అలెర్ట్ చేసిన బాబు

దిశ మార్చుకొంటున్న పెథాయ్: భారీ వర్షాలు

ఏపీపై మొదలైన పెథాయ్ ప్రభావం... తీరంలో హై అలర్ట్

 

 

Follow Us:
Download App:
  • android
  • ios