48 గంటల పాటు ఏపీని వణికించిన పెథాయ్ తుఫాన్ తీరాన్ని దాటింది. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన దగ్గర మధ్యాహ్నం 12.15 గంటలకి పెథాయ్ తుఫాను తీరం దాటినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ సమయంలో తూర్పుగోదావరి జిల్లా చిగురుటాకులా వణికిపోయింది.

సుమారు 90 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులు వీయడంతో చెట్లు భారీగా విరిగిపోయాయి.. కరెంట్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
రాజోలు, సఖినేటిపల్లి, అమలాపురం, మలికిపురం, అంబాజీపపేట, అల్లవరం, మామిడికుదురు, కాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలను చేపట్టాయి. అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి మంత్రులు నారా లోకేశ్, కళా వెంకట్రావ్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
పెథాయ్ తుఫాన్: సముద్రంలో అల్లకల్లోలం
పెథాయ్ తుఫాన్: తెలంగాణపై ఎఫెక్ట్
పెథాయ్ తుఫాన్: అధికారులను అలెర్ట్ చేసిన బాబు
దిశ మార్చుకొంటున్న పెథాయ్: భారీ వర్షాలు
ఏపీపై మొదలైన పెథాయ్ ప్రభావం... తీరంలో హై అలర్ట్