హైదరాబాద్:పెథాయ్ తుఫాన్ తీరం వైపు  19 కి.మీ వేగంతో దూసుకొస్తోంది.  పెథాయ్ తుఫాన్ తీరం దాటే సమయంలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని  వాతావరణ నిపుణులు హెచ్చరించారు. దీని ప్రభావంతో ఏపీలోని ఆరు జిల్లాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనికి తోడు తెలంగాణ రాష్ట్రంపై కూడ ప్రభావం చూపే ఛాన్స్ ఉందని అధికారులు ప్రకటించారు.

పెథాయ్ తుఫాన్  తీరం వైపుకు వస్తోంది. పెథాయ్ తుఫాన్  చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 410 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.  మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 530 కి.మీ దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

పెథాయ్ తుఫాన్ ఉత్తర వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందంటున్నారు. ఈ తుఫాన్  డిసెంబర్ 17వ తేదీన కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ తుఫాన్ ప్రభావంతో  గుంటూరు,కృష్ణా, , విశాఖ, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. పెథాయ్ తుఫాన్ ఏపీ రాష్ట్రంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంపై కూడ ప్రభావం చూపే అవకాశం ఉదని అధికారులు చెబుతున్నారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

పెథాయ్‌ తుఫాన్: అధికారులను అలెర్ట్ చేసిన బాబు

దిశ మార్చుకొంటున్న పెథాయ్: భారీ వర్షాలు

ఏపీపై మొదలైన పెథాయ్ ప్రభావం... తీరంలో హై అలర్ట్