కృష్ణా జిల్లా విజయవాడ-అవనిగడ్డ కరకట్టపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరకట్టపై నుండి వెళుతున్న ఓ కారు అదుపుతప్పి కరకట్టపై నుండి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లీ బిడ్డలు మృత్యువాతపడ్డారు. 

అవనిగడ్డకు చెందిన ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారు అర్ధరాత్రి 2 గంటల సమయంలో ప్రమాదానికి గురయ్యింది. అదుపుతప్పి కరకట్టపై నుండి కాలువలోకి దూసుకెళ్లడంతో కారులో వున్న తల్లి, పెద్ద కుమారుడు అందులోనే చిక్కుకుని మృతిచెందారు. తండ్రి, చిన్న కుమారుడు ఈ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడ్డారు. 

అర్థరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరగడంతో కారులో చిక్కుకున్నవారిని ఎవ్వరూ కాపాడలేకపోయారు. దీంతో కారుతో సహా తల్లి కొడుకులు నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు.