ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై గత నెల విశాఖ ఎయిర్ పోర్టులో దాడి జరిగిన సంగతి తెలిసిందే. కాగా... ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రిమాండ్ నేటితో(శుక్రవారం) ముగియనుంది. దీంతో  నేడు విశాఖ మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో శ్రీనివాస్ ని  పోలీసులు హాజరుపర్చనున్నారు

గతంలోనూ శ్రీనివాస్ రిమాండ్ పూర్తి కాగా.. పోలీసులు కోర్టులో పర్మిషన్ తీసుకొని మరీ.. ఇన్ని రోజులు వారి రిమాండ్ లో ఉంచుకున్నారు. ఇప్పటి  వరకు శ్రీనివాస్ ని రకరకాలుగా  ప్రశ్నించినట్లు సమాచారం.  

read more news

విశాఖపట్టణం: వైసీపీ చీఫ్ వైఎస్‌ జగన్‌పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావు తరపున  సలీం అనే న్యాయవాది సోమవారం నాడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. శ్రీనివాసరావు మానసిక స్థితి బాగా లేదని  సలీం చెబుతున్నారు.ఇదే కారణాన్ని చెబుతూ బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్టు ఆయన తెలిపారు.

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్ జగన్‌పై  అక్టోబర్ 25వ తేదీన శ్రీనివాసరావు కత్తితో దాడికి దిగాడు. ఈ కేసులో  శ్రీనివాసరావు ప్రస్తుతం విశాఖ జైలులో ఉన్నాడు. వారం రోజుల పాటు శ్రీనివాసరావును  పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని విచారించారు.  

 ఈ విచారణలో అసలు విషయాలు తెలియలేదని పోలీసులు భావిస్తున్నారు. మరోసారి కస్టడీ కోసం పోలీసులు పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తున్నారు.
శ్రీనివాసరావు నుండి ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించేందుకు గాను   పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించాలని కూడ  సిట్ భావిస్తోంది. 

ఈ  తరుణంలోనే శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది సలీం సోమవారం నాడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.శ్రీనివాసరావు మానసికస్థితి సరిగా లేదని ఆయన తరపు న్యాయవాది సలీం చెబుతున్నారు.ఇదే కారణాన్ని చూపుతూ బెయిల్ మంజూరు చేయాలని  కోరుతూ  పిటిషన్ దాఖలు చేసినట్టుగా ఆయన చెబుతున్నారు.
 

సంబంధిత వార్తలు

జగన్ మీద దాడిపై జేసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడి: శ్రీనివాస్‌ కత్తి ఎలా తీసుకెళ్లాడంటే?

జగన్‌కేసు దర్యాప్తు: శ్రీనివాస్ దుబాయ్‌లో వెల్డర్, హైద్రాబాద్‌లో కుక్

జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్: ఆ యువతులే కీలకం

జగన్‌పై దాడి కేసు...శ్రీనివాస్‌ మళ్లీ జైలుకే

జగన్‌పై దాడి: శ్రీనివాసరావుకు లైడిటెక్టర్ పరీక్ష..?

జగన్‌పై దాడి: ఆ నలుగురితో శ్రీనివాసరావు సంభాషణ

జగన్‌పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ

శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడికి ముందు శ్రీనివాస్ నుంచి ఆ మహిళకే ఎక్కువ ఫోన్ కాల్స్

శ్రీనివాస్ విచారణకు సహకరించడం లేదు, కొన్ని విషయాలు దాస్తున్నాడు:సీపీ లడ్డా

జగన్‌పై దాడి కేసు నిందితుడి హెల్త్ ఓకే: కేజీహెచ్ సీఎంఓ

జగన్‌పై దాడి: అందుకే శ్రీనివాస్‌ను కేజీహెచ్‌కు తెచ్చామని సీఐ

అందుకే జగన్‌పై దాడి చేశా: నిందితుడు శ్రీనివాస్