అవినీతి నిరోధక చట్టం దుర్వినియోగం కాకుండా చూడడమే 17 ఏ ఉద్దేశం: రాఫెల్ కేసును ప్రస్తావించిన సాల్వే
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీపై మూడో రోజూ సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే వాదనలను ఇవాళ కూడ కొనసాగించారు.
న్యూఢిల్లీ:అవినీతి నిరోధక చట్టం దుర్వినియోగం కాకుండా చూడడమే 17ఏ ఉద్దేశమని చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే చెప్పారు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై మంగళవారంనాడు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. మూడు రోజులుగా ఈ పిటిషన్ పై విచారణ సాగుతుంది. నిన్న సాయంత్రం వరకు చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే తన వాదనలు వినిపించారు. ఇవాళ తన వాదలను విన్పిస్తానని సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ నిన్ననే సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమతించింది. ఇవాళ కోర్టు ప్రారంభం కాగానే చంద్రబాబు తరపు న్యాయవాది వాదనలు ప్రారంభించారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్పించేందుకు ఎంత సమయం కావాలని సుప్రీంకోర్టు ధర్మాసనం హరీష్ సాల్వేను ప్రశ్నించింది. మరో గంట సమయం కావాలని హరీష్ సాల్వే సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.
17ఏ పైనే హరీష్ సాల్వే వాదనలు కొనసాగించారు. యశ్వంత్ సిన్హా కేసును హరీష్ సాల్వే ప్రస్తావించారు.
17ఏ ప్రోసీజర్ అంటున్నప్పుడు ఇది హక్కుగా వర్తిస్తుందా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అవినీతి నిరోధక చట్టాన్ని బలోపేతం చేయడంతో పాటు క్రిమినల్ కేసులో కౌంటర్ అఫిడవిట్ అక్కర్లేదన్న సాల్వే వాదించారు. నోటీసులు జారీ చేయాలన్న రోహత్గీ వాదనలను సాల్వే తోసిపుచ్చారు. నోటీసులు ఇస్తారా అనే విషయాన్ని బెంచ్ తేల్చాలని కోరిన రోహత్గీ. కొత్తగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని సాల్వే వాదించారు.హైకోర్టులో దాఖలు చేసిన పత్రాల ఆధారంగానే వాదనలు జరుగుతున్నప్పుడు కొత్త డాక్యుమెంట్లు అవసరం ఉండదని జస్టిస్ త్రివేది వ్యాఖ్యానించారు. నోటీసులు ఇవ్వడం కోర్టు విధానాల్లో భాగమని.. అలా కాకపోతే మళ్లీ మొదటికొస్తుందని రోహత్గీ వాదించారు.నోటీసులు అవసరం లేదన్న విధి విధానాలపై మీ వద్ద ఏమైనా ఆధారాలున్నాయని అని జస్టిస్ త్రివేది సాల్వేను ప్రశ్నించారు.గతంలో వచ్చిన తీర్పును బెంచ్ ముందు ఉంచుతానని సాల్వే సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు.
రాఫెల్ కేసు జడ్జిమెంట్ ను కూడా సాల్వే తన వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు.చట్టం, సవరణలను అన్వయించడానికి అనేక ఉదహరణలను బెంచ్ ముందుంచారు సాల్వే.రాఫెల్ కొనుగోళ్లపై యశ్వంత్ సిన్హా దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసిన విషయాన్ని సాల్వే ప్రస్తావించారు.
1988 అవినీతి నిరోధక చట్టం ప్రకారంగా పోలీసులకు ఇన్వేస్టిగేషన్ జరిపే హక్కు ఉండదు, ఇన్వేస్టిగేషన్ అనేది పోలీసుల బాధ్యత మాత్రమేనని సాల్వే వాదించారు.అన్ని రకాల విధుల్లోని ప్రభుత్వ అధికారులకు సెక్షన్ 17 ఏ తో రక్షణ లభించిందని సాల్వే గుర్తు చేశారు.పలు హైకోర్టుల తీర్పులను సాల్వే ప్రస్తావించారు. అయితే సుప్రీంకోర్టు తీర్పులున్నప్పుడు హైకోర్టు తీర్పుల ప్రస్తావన అవసరం లేదని జస్టిస్ బోస్ చెప్పారు.ఈ పరిణామాలన్నింటి ప్రకారం కేసు నమోదుకు గవర్నర్ ముందస్తు అనుమతి తప్పనిసరని సాల్వే వాదించారు.ఈ కేసులో ప్రజా ప్రతినిధి భాగస్వామ్యం ఏంటని విచారణకు ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాలని సాల్వే వాదించారు.2011 దేవిందర్ పాల్ సింగ్ బుల్లర్ కేసును హరీష్ సాల్వే ప్రస్తావించారు.కేసు మూలంలోనే దోషం ఉన్నందున బుల్లర్ కేసును పరిగణనలోకి తీసుకోవాలని సాల్వే కోరారు. చంద్రబాబుపై నమోదైన ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తున్నట్టుగా సాల్వే చెప్పారు. చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ చట్టబద్దం కాదని సాల్వే వాదించారు.
మరోవైపు ఈ కేసులో 17 ఏ వర్తించదని సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు.హరీష్ సాల్వే వాదనలు ముగించిన తర్వాత రోహత్గీ వాదనలు ప్రారంభించారు. ఇవాళ లంచ్ బ్రేక్ వరకే వాదనలు వింటామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. దీంతో మధ్యాహ్నం వరకు వాదనలు పూర్తి చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.
also read:ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు: చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా వేసిన సుప్రీం
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఏపీ సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయడంతో పాటు రిమాండ్ ను రద్దు చేయాలని హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. దీంతో చంద్రబాబు తరపు లాయర్లు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేశారు.