Asianet News TeluguAsianet News Telugu

సిట్ అధికారులను శ్రీనివాస్ తల్లిదండ్రులు ఏం కోరారంటే...

ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడి కేసులో విచారణను సిట్ అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే అతడి నుండి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ల, సిమ్ ల ద్వారా కాల్ డేటాను పోలీసులు సేకరించారు. దీని ఆధారంగా పలువురు అనుమానితులను విచారించారు. తాజాగా ఈ కేసులో శ్రీనివాస్ తల్లిదండ్రులను సిట్ అధికారులు విచారించారు. 

ap police investigated sriniva parents
Author
Visakhapatnam, First Published Oct 31, 2018, 5:41 PM IST

ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడి కేసులో విచారణను సిట్ అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే అతడి నుండి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ల, సిమ్ ల ద్వారా కాల్ డేటాను పోలీసులు సేకరించారు. దీని ఆధారంగా పలువురు అనుమానితులను విచారించారు. తాజాగా ఈ కేసులో శ్రీనివాస్ తల్లిదండ్రులను సిట్ అధికారులు విచారించారు. 

తూర్పు గోదావరి జిల్లాలోని శ్రీనివాస్ స్వగ్రామమైన ఠానెలంకకు వెళ్లిన అధికారులు అక్కడే విచారణ చేపట్టారు.  శ్రీనివాస్ తల్లిదండ్రులను అధికారులు విచారించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ కు సంబంధించిన పలు విషయాలపై వారిని ప్రశ్నించారు. వారి నుండి కీలక సమాచారాన్ని సేకరించినట్లు సమాచారం.

ఇక ఈ విచారణ చేపట్టిన అధికారుల ముందు శ్రీనివాస్ తల్లిదండ్రులు తమ ఆవేధన వ్యక్తం చేశారు. తమ కొడుకు ఆరోగ్య  పరిస్థితి బాగోలేదని తెలిసి చాలా బాధపడుతున్నామని వారికి తెలిపారు. ఒక్కసారి తమ కొడుకును చూపించాలని అధికారులను శ్రీనివాస్ తల్లిదండ్రులు కోరారు. దీంతో వారిని అధికారులు తమవెంటే విశాఖకు తీసుకువెళుతున్నట్లు సమాచారం.

గత మూడ్రోజులుగా సిట్ అధికారులు శ్రీనివాస్‌ను విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే నిన్న అతడు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరాడు. తనకు ప్రాణ హాని  ఉందంటూ శ్రీనివాస్ ఆస్పత్రిలోకి వెళుతూ  మీడియాకు వెల్లడించాడు. అతడి వ్యాఖ్యలపై  మంగళవారం తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలతో శ్రీసివాస్ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు లోనై కొడుకును చూడాలని సిట్ అధికారులను కోరారు. 

మరిన్ని వార్తలు

దాడి కేసు విచారణపై హైకోర్టులో జగన్ పిటిషన్....ప్రతివాదిగా చంద్రబాబు 

జగన్‌పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ

శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడికి ముందు శ్రీనివాస్ నుంచి ఆ మహిళకే ఎక్కువ ఫోన్ కాల్స్

శ్రీనివాస్ విచారణకు సహకరించడం లేదు, కొన్ని విషయాలు దాస్తున్నాడు:సీపీ లడ్డా

జగన్‌పై దాడి కేసు నిందితుడి హెల్త్ ఓకే: కేజీహెచ్ సీఎంఓ

జగన్‌పై దాడి: అందుకే శ్రీనివాస్‌ను కేజీహెచ్‌కు తెచ్చామని సీఐ

అందుకే జగన్‌పై దాడి చేశా: నిందితుడు శ్రీనివాస్

జగన్‌పై దాడి కేసు: పచ్చి మంచినీళ్లు కూడ ముట్టని శ్రీనివాస్

జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు: స్వంత పార్టీ నేత కౌంటర్

జగన్‌పై దాడి: స్నేహితులకు భారీ విందిచ్చిన శ్రీనివాస్, యువతితో పార్టీకి

ప్రజల మంచి కోసమే జగన్ పై దాడి చేశా: శ్రీనివాస్ కు అస్వస్థత, కెజీహెచ్ కు తరలింపు

అభిమానంతోనే పిల్లోడు దాడి, జగన్ కు లవ్ లెటర్ రాసిన నిందితుడు: సోమిరెడ్డి

అలిపిరిలో చంద్రబాబుపై దాడి భువనేశ్వరి చేయించారా..:టీడీపీకి వైసీపీ కౌంటర్

 

Follow Us:
Download App:
  • android
  • ios