అమరావతి:  ప్రతిపక్ష పార్టీకే ఎందుకు షరతులు విధిస్తున్నారని  ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పోలీసులు అనుసరించిన తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

విశాఖలో చంద్రబాబునాయుడు ప్రజా చైతన్య యాత్రకు గురువారం నాడు వైసీపీ అడ్డుపడింది. చంద్రబాబునాయుడు కాన్వాయ్  బయలకు వెళ్లకుండా వైసీపీ నిరసనకు దిగడంతో  నాలుగు గంటలపాటు చంద్రబాబునాయుడు కారులోనే కూర్చొన్నారు.  ఆ తర్వాత ఆయనను  అరెస్ట్ చేశారు. ప్రజా చైతన్య యాత్రలో పాల్గొనకుండా బాబు హైద్రాబాద్‌కు తిరిగి వచ్చారు.

Also read:విశాఖలో బాబు వెనక్కి: హైకోర్టులో టీడీపీ లంచ్ మోషన్ పిటిషన్

విశాఖపట్టణంలో పోలీసులు తీరును నిరసిస్తూ ఏపీ హైకోర్టులో టీడీపీ శుక్రవారం నాడు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది హైకోర్టు.

శుక్రవారం నాడు మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటిషన్‌పై  హైకోర్టు విచారణ చేసింది.  151 సీఆర్‌పీసీ నోటీసును చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన విషయాన్ని టీడీపీ తరపు న్యాయవాది గుర్తు చేశారు.

అందుకే చెప్పులు పడ్డాయి: బాబుపై లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు

నేరం చేసేవారికి, నేరం చేసే ఆలోచన ఉన్నవారికే 151 సీఆర్‌పీసీ నోటీసులు ఇస్తారని హైకోర్టు న్యాయమూర్తి ఈ సందర్భంగా ప్రస్తావించారు.

పోలీసులు అనుమతి తీసుకొని   ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తున్న విషయాన్ని  టీడీపీ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అనుమతి లేకుండా ఆందోళనలు నిర్వహిస్తున్నవారికి ఎలా అనుమతి ఇచ్చారని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. 

ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయాలని  విశాఖ పోలీసు కమిషనర్‌కు, డీజీపీకి హైకోర్టు ఆదేశించింది. ప్రతిపక్ష నాయకుడికే ఎందుకు షరతులు విధిస్తున్నారని కూడ హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసు విచారణను ఈ ఏడాది మార్చి 2 వ తేదీకి వాయిదా వేసింది.