అమరావతి: విశాఖలో  చోటు చేసుకొన్న పరిణామాలపై  శుక్రవారం నాడు  ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది టీడీపీ,.ఈ పిటిషన్‌ను విచారణకు  హైకోర్టు స్వీకరించింది.

విశాఖలో ప్రజా చైతన్య యాత్రకు తాము పోలీసుల నుండి అనుమతి తీసుకొన్నప్పటికీ  ఉద్దేశ్యపూర్వకంగానే తమ పర్యటనను అడ్డుకొన్నారని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఎయిర్ పోర్టులోనే నాలుగు గంటలపాటు  చంద్రబాబునాయుడును నిలువరించడంతో పాటు  వైసీపీ కార్యకర్తలను పోలీసులు  అడ్డుకోవడంలో విఫలం కావడంపై  టీడీపీ మండిపడుతోంది. విశాఖలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఏపీ హైకోర్టులో శుక్రవారం నాడు మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

Aslo read:విశాఖలో పర్యటిస్తా, ఎన్నిసార్లు ఆపుతారో చూస్తా: చంద్రబాబు

ఈ లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అంతేకాదు విశాఖలో ప్రజా చైతన్య యాత్రకు కూడ అనుమతి ఇవ్వాలని కూడ మరోసారి ఈ పిటిషన్ లో కోరారు శ్రవణ్ కుమార్.

ఈ పిటిషన్‌పై శుక్రవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు హైకోర్టు విచారణ చేయనుంది.