కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ ప్రాణాలకు తెగించి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న పోలీస్ అధికారులతో హీరో విజయ దేవరకొండ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. హైదరాబాద్ కమిషనరేట్ లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ లు అడిగిన పలు ప్రశ్నలకు విజయ్ దేవరకొండ వారిని ఉత్సాహ పరుస్తూ సమాధానాలు చెప్పారు.