Jan 18, 2021, 11:53 AM IST
సమంత అక్కినేని ఏం మాయ చేసావేతో సినీ కెరీర్ ఆరంభించి చాలా తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగినారు..దాదాపు సౌత్ సూపర్ స్టార్స్ అందరితోనూ నటించారు..కేవలం కమర్షియల్ పాత్రలు మాత్రమే కాకుండా నటిగా కూడా తనని ప్రూవ్ చేసుకున్నారు..రంగస్థలం లాంటి చిత్రాల్లో... డీ గ్లామర్ రోల్ లో సమంత ఇచ్చిన పెర్ఫార్మన్స్ అద్భుతం అని చెప్పాలి..అత్తారింటికి దారేది..రంగస్థలం..దూకుడు లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఆమె నటించి గోల్డెన్ లెగ్ అనిపించుకున్నారు..కెరీర్ పీక్స్ లో ఉండగానే నాగ చైతన్య ను పెళ్లి చేసుకున్న ఆమె ఆ తర్వాత నుండి చాలా సెలెక్టివ్ గా మూవీస్ చేస్తున్నారు..నటనకు ఆస్కారం ఉండే పాత్రలు ఎంచుకుంటున్నారు..