హాజీపూర్‌లో సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి ప్రేమించిన యువతి సురక్షితంగా ఉందని... ఈ కేసును దర్యాప్తు చేసిన భుజంగరావు చెప్పారు. శ్రీనివాస్ రెడ్డిని కస్టడీ కోరుతూ భువనగిరి కోర్టులో సోమవారం నాడు పిటిషన్ దాఖలు చేయనున్నారు.
భువనగిరి: హాజీపూర్‌లో సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి ప్రేమించిన యువతి సురక్షితంగా ఉందని... ఈ కేసును దర్యాప్తు చేసిన భుజంగరావు చెప్పారు. శ్రీనివాస్ రెడ్డిని కస్టడీ కోరుతూ భువనగిరి కోర్టులో సోమవారం నాడు పిటిషన్ దాఖలు చేయనున్నారు.
ఆదివారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు శ్రీనివాస్ రెడ్డి కేసును దర్యాప్తు చేస్తున్న సీఐ భుజంగరావు పలు విషయాలను చెప్పారు. సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి వేములవాడకు చెందిన యువతితో ప్రేమాయణం కొనసాగించినట్టుగా తమ దర్యాప్తులో ఒప్పుకొన్నాడని చెప్పారు.
అయితే ఆ యువతి ప్రస్తుతం వేములవాడలో సురక్షితంగానే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇదే ప్రాంతంలోని అగ్రహారంలో ఓ మహిళ మృతదేహం లభించిన విషయాన్ని సిరిసిల్ల పోలీసులు కూడ తమ దృష్టికి తీసుకొచ్చినట్టుగా ఆయన తెలిపారు.
అయితే శ్రీనివాస్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొన్న తర్వాత ఈ విషయమై కూడ విచారణ చేయనున్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం శ్రావణి కేసులోనే శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేశామన్నారు. మనీషా, కల్పన కేసుకు సంబంధించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు రావాల్సి ఉందన్నారు.
ఎఫ్ఎస్ఎల్ కు మనీషా, కల్పన శరీరానికి చెందిన ఎముకలను పంపినట్టు ఆయన తెలిపారు. వారం రోజుల తర్వాత ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు వచ్చిన తర్వాత ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకొంటామన్నారు.
ఐదు రోజుల పాటు శ్రీనివాస్ రెడ్డిని కస్టడీకి తీసుకోవాలని సోమవారం నాడు భువనగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని భుజంగరావు చెప్పారు. ఈ కేసును పూర్తి చేసేలా చర్యలు తీసుకొంటామని ఆయన చెప్పారు.
సంబంధిత వార్తలు
హాజీపూర్ సీరియల్ కిల్లర్: శ్రీనివాస్ రెడ్డి ప్రియురాలు ఎవరు?
సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిలో మరో కోణం: వేములవాడ యువతితో లవ్
హాజీపూర్ సీరియల్ కిల్లర్: ఆదిలాబాద్‌లో దెబ్బలు తిన్న శ్రీనివాస్ రెడ్డి
హాజీపూర్ సీరియల్ రేపిస్ట్: శ్రీనివాస్ రెడ్డి లైఫ్‌లో మరో కోణం (వీడియో)
సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి 14 రోజుల రిమాండ్, వరంగల్ జైలుకు తరలింపు
చెట్టుకు కట్టేసి కొట్టారు: ఆ కక్షతోనే శ్రీనివాస్ రెడ్డి ఘాతుకాలు
వెలుగులోకి విస్తుపోయే విషయాలు: శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో కండోమ్ ప్యాకెట్లు
హాజీపూర్ దారుణాలు: శ్రీనివాస్ రెడ్డి బావిలో దొరికిన ఎముకలు ఎవరివి?
హజీపూర్ సీరియల్ మర్డర్స్: విచారణకు ప్రత్యేక బృందం
కల్పన డెడ్‌బాడీ కోసం శ్రీనివాస్ రెడ్డి బావిలో పోలీసుల గాలింపు
శ్రావణి హత్య కేసు: గ్రామస్తులతో కలిసి బావి వద్దే శ్రీనివాస్ రెడ్డి
హాజీపూర్ సీరియల్ రేపిస్ట్: శ్రీనివాస్ రెడ్డి చరిత్ర ఇదీ...
శ్రీనివాస్ రెడ్డి మరో బావిలో కల్పన మృతదేహం లభ్యం
బైక్‌పై శ్రావణితో: శ్రీనివాస్ రెడ్డిని పట్టించిన సీసీటీవీ పుటేజీ
శ్రీనివాస్ రెడ్డిపై కర్నూల్ లో మహిళను హత్య చేసిన కేసు
హాజీపూర్ దారుణాలు: కల్పనను మింగేసిందీ వాడే