తలనొప్పి వస్తోందంటే.. మహిళ జుట్టు కట్, మెడకు మసాజ్ చేసిన డాక్టర్

Siva Kodati |  
Published : May 05, 2019, 12:28 PM IST
తలనొప్పి వస్తోందంటే.. మహిళ జుట్టు కట్, మెడకు మసాజ్ చేసిన డాక్టర్

సారాంశం

మనకు తలనొప్పి వస్తుందని వైద్యుని వద్దకు వెళితే.. అతను ఇంజెక్షన్ చేయడమో, మందులు రాసివ్వడమో చేస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తలనొప్పిగా ఉందన్న మహిళ జుట్టు కోశాడు. 

మనకు తలనొప్పి వస్తుందని వైద్యుని వద్దకు వెళితే.. అతను ఇంజెక్షన్ చేయడమో, మందులు రాసివ్వడమో చేస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తలనొప్పిగా ఉందన్న మహిళ జుట్టు కోశాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ ఉప్పల్‌ చిలుకానగర్‌కు చెందిన ఓ వివాహితకు తరచుగా తలనొప్పి వస్తుండటంతో ఆమె ఈ నెల 2న ఇంటికి దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లింది.

ఇక్కడ వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ బాలరాజు అనే వ్యక్తి.. మందులకు బదులుగా ఆ మహిళ జుట్టును కత్తెరతో కట్ చేశాడు. అక్కడితో ఆగకుండా తలకు, మెడకు మసాజ్ చేయడంతో పాటు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

నొప్పి తగ్గకకపోతే మరోసారి ఆసుపత్రికి రావాలని సూచించాడు. ఈ విషయాన్ని ఆమె ఇంట్లో చెప్పగా... శనివారం ఆమె తల్లి, బంధుమిత్రులు ఆసుపత్రికి వెళ్లి డాక్టర్‌ను ప్రశ్నించారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించి బాలరాజును వారు చితకబాది, పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్