చిలకాగోరింకల్లా ఉండేవారు, ఉసురు తగులుతుంది: ప్రణయ్ తల్లి

Published : Sep 16, 2018, 10:39 AM ISTUpdated : Sep 19, 2018, 09:27 AM IST
చిలకాగోరింకల్లా ఉండేవారు, ఉసురు తగులుతుంది: ప్రణయ్ తల్లి

సారాంశం

తన కుమారుడు ప్రణయ్, కోడలు అమృతలను చూసి చిలకాగోరింకల్లా ఉన్నారని అనేవారని ప్రణయ్ తల్లి ప్రేమలత అన్నారు. తన కుమారుడి హత్యకు ఆమె కన్నీరుమున్నీరవుతోంది.

మిర్యాలగుడా: తన కుమారుడు ప్రణయ్, కోడలు అమృతలను చూసి చిలకాగోరింకల్లా ఉన్నారని అనేవారని ప్రణయ్ తల్లి ప్రేమలత అన్నారు. తన కుమారుడి హత్యకు ఆమె కన్నీరుమున్నీరవుతోంది. ప్రధాన నిందితుడు మారుతీ రావు వెనక చాలా మంది రాజకీయ నాయకులున్నారని ఆమె ఆరోపిస్తోంది. 

హత్యకు కోటి రూపాయలు ఇచ్చానని మారుతీరావే చెబుతున్నాడని, అతనికి అండగా చాలా మంది ఉన్నారని ఆమె అన్నారు. రౌడీలను పోషిస్తూ రాజకీయ నాయకులు డబ్బులు ఇస్తాడని ఆమె ఆరోపిస్తోంది. బిడ్డ ఎవరినీ ప్రేమించవద్దని డబ్బులు ధారపోస్తున్నాడని అన్నారు. 

మారుతీరావు కూతురికి తన కుమారుడి కన్నా మంచి భర్త దొరుకుతాడా, వాళ్ల కులంలో ఇంత మంచి వరుడు దొరుకుతాడా అని ఆమె ప్రశ్నించారు. మారుతీరావుకు తన కుమారుడి ఉసురు తగులుతుందని అన్నారు. మారుతీరావు కుటుంబం సర్వ నాశనం అవుతుందని అన్నాడు.

మిర్యాలగుడాలో తిరిగే హక్కు కూడా మారుతీరావుకు లేదని, సిగ్గంతా పోయిందని, తన పిల్లల కాలిగోటికి కూడా సరిపోరని అన్నారు. కిరసనాయిల్ అమ్ముకునే మారుతీరావు భూములు కబ్జా చేసి సంపాదించాడని ఆమె ఆరోపించింది. తన కుమారుడి ఉసురు తప్పకుండా తగులుతుందని, మారుతీరావును ఉరి తీయాలని ఆమె అన్నారు.

బతకడానికి ఇక్కడికి వచ్చి కబ్జాలు చేసి ఘోరంగా సంపాదించాడని ఆమె అన్నారు. మారుతీ రావుకు రాజకీయ నాయకులు మద్దతు ఇవ్వకూడదని అన్నారు. మారుతీరావు వెనక ఎవరున్నారో తన కోడలు అమృతకు తెలుసునని అన్నారు. తన కుమారుడి హత్య వెనక కాంగ్రెసు నాయకుడు కరీం ఉన్నాడని, అంతకు ముందు రోజు కరీం కుమారుడు తమ ఇంటికి వచ్చాడని, నమ్మించి మోసం చేశారని ప్రేమలత అన్నారు.

ఈ వార్తాకథనాలు చదవండి

ప్రణయ్ హత్య: పోలీసుల అదుపులో కాంగ్రెసు నేత

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ మృతదేహాన్ని చూసి కుప్పకూలిన అమృత

ప్రణయ్ హత్య: డీల్ కోటి రూపాయలపైనే, గతంలో రెండు సార్లు...

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బోరున విలపిస్తున్న అమృత

ఫాలో అవుతున్నారని తెలుసు కానీ ఇలా అవుతుందని ఊహించలేదు: అమృత

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

PREV
click me!

Recommended Stories

శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu
Vijay Deverakonda Superb Speech: విజయ్ దేవరకొండ స్పీచ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu