తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
11:59 PM (IST) Jul 09
Revanth Reddy: కృష్ణా, గోదావరి జల వివాదాలపై ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లోనైనా చర్చించేందుకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్, జగన్ బంధంతోనే తెలంగాణకు తీరని నష్టం జరిగిందని విమర్శించారు.
11:00 PM (IST) Jul 09
SRH HCA controversy: ఐపీఎల్ టికెట్ల కుంభకోణంలో హెచ్ఎస్ఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావును సీఐడి అరెస్ట్ చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేసిన ఫిర్యాదు ఆధారంగా విచారణ ప్రారంభంతో ఇది జరిగింది. అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
10:10 PM (IST) Jul 09
అతడు కూలీయే కావచ్చు... సంపాదన తక్కువే ఉండవచ్చు. కానీ పెద్ద మనసున్నవాడు. చదువుకునేందుకు పిల్లలు పడుతున్న కష్టాన్ని చూసి కూలీచేసి సంపాదించిన డబ్బులతో సైకిళ్లు కొనిచ్చాడు. మనసుకు హత్తుకునే ఈ కథనాన్ని ఇక్కడ చదవండి.
09:47 PM (IST) Jul 09
Gold price: బంగారం ధరలు మళ్లీ పడిపోతున్నాయి. ట్రంప్ టారిఫ్ హెచ్చరికల మధ్య అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. మరి రానున్న రోజుల్లో బంగారం ధరలు ఎలా ఉండనున్నాయి?
08:46 PM (IST) Jul 09
PM Modi Namibia award: ప్రధాని నరేంద్ర మోడీకి నమీబియా అత్యున్నత పౌర పురస్కారం లభించింది. భారత్-నమీబియా సంబంధాల్లో ఇది కీలక ముందడుగుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
07:52 PM (IST) Jul 09
Amazon Prime Day 2025: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2025లో ఐఫోన్ 16ఈ (iPhone 16e) రూ.49,600కే లభిస్తోంది. ఐఫోన్ 16 సిరీస్ పై ఈ సేల్ లో బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్లతో భారీ తగ్గింపులు ఉన్నాయి.
07:20 PM (IST) Jul 09
గురు పౌర్ణమికి మీ టీచర్లకు గిప్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే బడ్జెట్ తక్కువలో అంటే కేవలం రూ.200 లోపు మంచి గిప్ట్ ఐడియాలేంటో తెలుసుకోండి. పెన్నుల నుంచి మొక్కల దాకా మీ టీచర్లకు ఖుషీ చేయండి!
06:26 PM (IST) Jul 09
most valuable IPL team: విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తొలి టైటిల్ గెలిచిన తర్వాత $269 మిలియన్ల బ్రాండ్ విలువతో ఐపీఎల్‌లో టాప్ ప్లేస్ కు చేరింది. ముంబై, చెన్నై టీమ్ లను వెనక్కినెట్టింది.
05:06 PM (IST) Jul 09
కేవలం తెలంగాణ స్టూడెంట్స్, ఉద్యోగులకు మాత్రమే ప్రతిఏటా మూడ్రోజులు ప్రత్యేకంగా సెలవులు వస్తాయి. ఈ సెలవులు దేశంలో మరెక్కడా లేవు. ఇలా తెలంగాణోళ్లకే వచ్చే ఆ సెలవులేంటి? ఎప్పుడెప్పుడు వస్తాయి? ఇక్కడ తెలుసుకుందాం.
04:45 PM (IST) Jul 09
ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ మహీంద్ర మార్కెట్లోకి కొత్త కారును తీసుకొచ్చింది. మహీంద్ర ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో రెవెక్స్ సిరీస్‌లో భాగంగా ఈ కారును లాంచ్ చేశారు. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
04:32 PM (IST) Jul 09
Shubman Gill net worth: ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఆటతో ఇంగ్లాండ్ లో దుమ్మురేపుతున్నాడు. ఆటలోనే కాదు సంపాదనలోనూ ప్రిన్స్ గా ముందుకు సాగుతున్నాడు. శుభ్‌మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?
04:04 PM (IST) Jul 09
ప్రస్తుతం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది దగ్గర ఫోన్ ఉండడం సాధారణం అయిపోయింది. అయితే ప్రతినెలా అందరికీ రీఛార్జ్ చేయడం కాస్త కష్టమైన పనే. అయితే జియో, ఎయిర్‌టెల్, BSNL వంటి టెలికాం సంస్థలు తమ ఫ్యామిలీ రీఛార్జ్ ప్లాన్స్‌ని అప్‌డేట్ చేశాయి. అవేంటో చూద్దాం.
02:55 PM (IST) Jul 09
ప్రముఖ హోటల్ చైన్ సంస్థ ఓయోకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఎత్తుగడలతో ముందుకెళ్తున్న ఓయో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
02:02 PM (IST) Jul 09
మొన్నటి వరకు చుక్కలు చూపించిన బంగారం ధర ప్రస్తుతం క్రమంగా తగ్గుతోంది. ఆకాశమే హద్దుగా పెరిగిన గోల్డ్ ధరలు తాజాగా నేలచూపులు చూస్తున్నాయి. తాజాగా తులం బంగారంపై రూ. 660 తగ్గడం విశేషం.
01:51 PM (IST) Jul 09
వయసు మీదపడ్డా జీవితంతో ఇంకా పోరాడుతూ ఆత్మగౌరవమే ఆస్తిగా జీవిస్తున్న ఈ హైదరాబాద్ తాత కథ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోంది. ఈ స్టోరీ చదివాక ఈయనకదా నిజమైన తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అనిపించడం ఖాయం.
12:58 PM (IST) Jul 09
కష్టపడి సంపాదించిన డబ్బును పొదుపు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. ఇందుకోసం ఎన్నో రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. పోస్టాఫీస్ అందిస్తోన్న అలాంటి ఒక బెస్ట్ సేవింగ్ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
12:12 PM (IST) Jul 09
ప్రకృతి అందాలను చూసేందుకు వెళ్లిన తెలుగు పర్యాటకులు ప్రమాదానికి గురయ్యారు. మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు తెలగోళ్లు తీవ్రంగా గాయపడ్డారు.
11:56 AM (IST) Jul 09
ఆదివారం వచ్చిందంటే చాలు ముక్క లేనిది ముద్ద దిగని వారు మనలో చాలా మంది ఉంటారు. అయితే ఇటీవల ఆదివారం నాన్ వెజ్ తీసుకుంటున్న వారి సంఖ్య తగ్గుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ గ్రామంలో ఏకంగా నాన్‌వెజ్, మద్యాన్ని నిషేధిస్తూ తీర్మానం చేశారు.
11:14 AM (IST) Jul 09
భారతదేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పాటుకానుంది. ఇందుకోసం ప్రముఖ సంస్థ ఒకటి భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చింది. ఆ సంస్థ ఏది? ఎక్కడ ప్లాంట్ రానుంది? తదితర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
10:35 AM (IST) Jul 09
కలలు రావడం సర్వసాధారణం. అయితే వీటిలో కొన్ని సంతోషాన్ని కలిగిస్తే మరికొన్ని ఆందోళనను రేకెత్తిస్తాయి. అయితే మనకు వచ్చే కలలు మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా.?
09:43 AM (IST) Jul 09
తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకోవడానికి ప్రతీ రోజూ వేలాది మంది వస్తుంటారు. ఏడు కొండల ప్రాముఖ్యతను కాపాడేందుకు టీటీడీ ఎన్నో చర్యలు చేపడతూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా అధికారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.
08:57 AM (IST) Jul 09
జులై 9 బుధవారం అంటే నేడు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఓ మూడు జిల్లాల్లో కుండపోత వానలకు ఛాన్స్ ఉందంటూ ఆరెంజ్ అలర్ట్ చేశారు. కాబట్టి ఆ జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..