Gold Price: భారీగా తగ్గిన బంగారం ధర.. బుధవారం ఒక్క రోజే ఎంత తగ్గిందంటే
మొన్నటి వరకు చుక్కలు చూపించిన బంగారం ధర ప్రస్తుతం క్రమంగా తగ్గుతోంది. ఆకాశమే హద్దుగా పెరిగిన గోల్డ్ ధరలు తాజాగా నేలచూపులు చూస్తున్నాయి. తాజాగా తులం బంగారంపై రూ. 660 తగ్గడం విశేషం.

పతనమవుతోన్న బంగారం
మారుతోన్న గ్లోబల్ పరిస్థితులు, తగ్గిన యుద్ధ వాతావరణం ఇలా రకరకాల కారణాలు బంగారం ధరపై ప్రభావం చూపుతున్నాయి. పెట్టుబడి దారులు ఇతర మార్గాలవైపు మొగ్గుచూపుతుండడంతో బంగారం ధరలో క్షీణత కనిపిస్తోంది.
బుధవారం ఒక్కరోజే తులం బంగారంపై ఏకంగా రూ. 660 తగ్గడం విశేషం. దీంతో చాలా రోజుల తర్వాత 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98 వేల మార్కుకు దిగొచ్చింది. ఈ నేపథ్యంలోనే దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.?
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,330కాగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 90,150 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98,180కాగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 90,000గా ఉంది.
* చెన్నై విషయానికొస్తే ఇక్కడ కూడా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,180కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90,000 వద్ద కొనసాగుతోంది.
* సౌత్ ఇండియాలో మరో ప్రధాన నగరమైన బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,180కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90,000 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.?
* హైదరాబాద్‌లో బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,180గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 90,000 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 98,180 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90 వేలుగా ఉంది.
* విశాఖలో కూడా 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 98,180 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90 వేలుగా ఉంది.
బంగారం ధర ఎందుకు తగ్గుతోంది.?
అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం ప్రస్తుతం కాస్త శాంతిస్తున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య ఉక్రెయిన్, రష్యాల మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు క్రమంగా దూరమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పెట్టుబడి దారులు తిరిగి స్టాక్‌మార్కెట్ల వైపు మోగ్గు చూపుతున్నారు.
ఈ నేపథ్యంలోనే బంగారంపై పెట్టబడి పెడుతోన్న వారి సంఖ్య తగ్గుతున్నట్లు స్పష్టమవుతోంది. గోల్డ్ ధరలు తగ్గుతుండడానికి దీనిని ఒక కారణంగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.?
బంగారం ధరలు తగ్గుముఖం పడితే వెండి ధరల్లో మాత్రం మార్పు కనిపించలేదు. బుధవారం దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు ముంబై, చెన్నై, బెంగళూరు కోల్‌కతా వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 1,10,000గా ఉంది. కాగా హైదరాబాద్, కేరళ, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర అత్యధికంగా రూ. 1,20,000 వద్ద కొనసాగుతోంది.