- Home
- Automobile
- Cars
- Mahindra XUV 3XO: బడ్జెట్ ధరలో కళ్లు చెదిరే ఫీచర్లు.. మహీంద్ర నుంచి కొత్త కారు
Mahindra XUV 3XO: బడ్జెట్ ధరలో కళ్లు చెదిరే ఫీచర్లు.. మహీంద్ర నుంచి కొత్త కారు
ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ మహీంద్ర మార్కెట్లోకి కొత్త కారును తీసుకొచ్చింది. మహీంద్ర ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో రెవెక్స్ సిరీస్‌లో భాగంగా ఈ కారును లాంచ్ చేశారు. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్త REVX సిరీస్
మహీంద్రా సంస్థ 2025 జూలై 8న తన తాజా SUV వెర్షన్ అయిన XUV 3XO REVX సిరీస్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 8.94 లక్షలు (ఎక్స్-షోరూమ్). తక్కువ బడ్జెట్‌లో స్టైల్, సేఫ్టీ, టెక్నాలజీ కలిపిన ఫీచర్లతో ఇది C-SUV సెగ్మెంట్‌లో అత్యుత్తమ ఎంపికగా నిలుస్తోంది.
REVX సిరీస్‌లో మూడు వేరియంట్లు
ఈ సిరీస్‌లో మొత్తం మూడు వేరియంట్లు ఉన్నాయి. వీటి ధర విషయానికొస్తే REVX M రూ. 8.94 లక్షలు, REVX M(O) రూ. ₹9.44 లక్షలు, REVX A రూ. 11.79 లక్షలు (MT), రూ. 12.99 లక్షలు (AT)గా ఉంది. ఈ కారును రెండు వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. 1.2 లీటర్ TCMPFi ఇంజిన్ (82 kW పవర్, 200 Nm టార్క్) కాగా, 1.2 లీటర్ TGDi టర్బో ఇంజిన్ (96 kW పవర్, 230 Nm టార్క్) ఇంజన్‌లను అందించారు.
భద్రత, టెక్నాలజీ
REVX M వేరియంట్‌లో బ్లాక్ లెదరెట్ సీట్స్, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 4 స్పీకర్లు, 6 ఎయిర్‌బ్యాగ్స్, ESC, హిల్ హోల్డ్, డ్యుయల్ టోన్ రూఫ్, LED డీఆర్ఎల్స్, LED టెయిల్ లాంప్స్ వంటి ఫీచర్లను అందించారు.
అలాగే REVX M(O)లో దీన్నీ తో పాటు సింగిల్ పేన్ సన్‌రూఫ్ ఉంటుంది. REVX Aలో ప్యానోరామిక్ సన్‌రూఫ్, ట్విన్ HD స్క్రీన్స్, వాయర్‌లెస్ చార్జర్, అడ్రెనాక్స్ కనెక్ట్, అలెక్సా సపోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.
ఫోన్ కనెక్టివిటీ, డిజిటల్ టెక్నాలజీకి సపోర్ట్
REVX A వేరియంట్‌లో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ ప్లే, అడ్రెనాక్స్ కనెక్ట్, బిల్ట్-ఇన్ అలెక్సా, ఆన్‌లైన్ నావిగేషన్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ప్యానోరామిక్ సన్‌రూఫ్, పుష్ బటన్ స్టార్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటో హెడ్‌లాంప్స్ & వైపర్స్, బ్యాక్ కేమరా వంటి ఫీచర్లను ఇచ్చారు.
ఆకట్టుకునే రంగులు స్టైలిష్ డిజైన్
REVX సిరీస్ మొత్తం 5 రంగుల్లో లభిస్తుంది. వీటిలో గెలాక్సీ గ్రే, టాంగో రెడ్, నెబులా బ్లూ, ఎవరెస్ట్ వైట్, స్టెల్త్ బ్లాక్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక స్టైలిష్ లుక్ కోసం బాడీ కలర్ గ్రిల్, బ్లాక్ అలాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ రూఫ్ వంటి డిజైన్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
మొత్తం మీద రూ. 8.94 లక్షల ప్రారంభ ధరతో సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, టెక్ ఫీచర్లు, స్టైలిష్ డిజైన్ కలిపి మహీంద్ర మహీంద్ర XUV 3XO REVX సిరీస్ మార్కెట్‌లో హాట్ ఆప్షన్‌గా నిలుస్తోంది.