Shubman Gill net worth: శుభ్‌మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?
Shubman Gill net worth: ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఆటతో ఇంగ్లాండ్ లో దుమ్మురేపుతున్నాడు. ఆటలోనే కాదు సంపాదనలోనూ ప్రిన్స్ గా ముందుకు సాగుతున్నాడు. శుభ్‌మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?

ఇంగ్లాండ్ లో కెప్టెన్ గా, ప్లేయర్ గా మెరుపులు మెరిపిస్తున్న శుభ్‌మన్ గిల్
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ తో ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ను ఆడుతోంది. రెండు టెస్టు మ్యాచ్ లు పూర్తయ్యాయి. మూడో టెస్టు లీడ్స్ లో జరగనుంది. ఈ పర్యటన క్రమంలో భారత జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన గిల్ అద్భుతమైన ఆటతో అదరగొడుతున్నారు.
తనదైన కెప్టెన్సీతో అందర్నీ ఆకట్టుకుంటున్నారు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సెంచరీల మోత మోగించాడు. ప్రస్తుతం అద్భుత ఫామ్ లో ఉన్న శుభ్ మన్ గిల్.. రాబోయే మ్యాచ్ లో కూడా అదిరిపోయే ఇన్నింగ్స్ ను ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రస్తుతం 25 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో అసాధారణ ప్రదర్శనలు చేస్తున్న గిల్.. రాబోయే కాలంలో టీమిండియాకు మూడు ఫార్మాట్లకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.
శుభ్‌మన్ గిల్ సంపద ఎంతుందో తెలుసా?
శుభ్‌మన్ గిల్ యంగ్ క్రికెటర్ అయినా, తక్కువ కాలంలోనే బాగానే సంపాదించారు. ప్రస్తుతం స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న గిల్ సంపాదన వివరాలు గమనిస్తే.. ఈటీ నౌ నివేదిక ప్రకారం, ఆయన మొత్తం నికర సంపద ప్రస్తుతం రూ.32 కోట్లుగా అంచనా. ఈ మొత్తం ఆయన క్రికెట్ ఆటతో పాటు, బ్రాండ్ ప్రమోషన్లు, పెట్టుబడుల ద్వారా సంపాదించారు.
శుభ్‌మన్ గిల్ ఆదాయ మార్గాలు ఏమిటి?
ఐపీఎల్ జీతం:
గిల్ ఐపీఎల్ లో గుజరాత్ టైటన్స్ జట్టుకు ఆడుతున్నారు. గిల్ ప్రతిసీజన్‌కు రూ.16.5 కోట్లు పొందుతున్నారు. 2022లో గిల్ గుజరాత్ టైటన్స్ జట్టులోకి వచ్చారు. జట్టు ప్రధాన బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆ జట్టు కెప్టెన్ కూడా అతనే.
బీసీసీఐ వేతనం:
గిల్ ప్రస్తుతం బీసీసీఐ గ్రేడ్ ఏ (Grade-A) కాంట్రాక్ట్ లో ఉన్నారు. దీని ద్వారా ఆయనకు ఏడాదికి రూ.7 కోట్లు లభిస్తున్నాయి. బీసీసీఐ కాంట్రాక్ట్‌లు ఆటగాళ్లను వారి ప్రదర్శన ఆధారంగా Grade A+, A, B, C లుగా విభజిస్తుంది. గిల్ స్థిరమైన ప్రదర్శనతో గ్రేడ్ ఏకు ప్రమోట్ అయ్యారు.
శుభ్‌మన్ గిల్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు
శుభ్‌మన్ గిల్ వివిధ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. నైక్, ప్యూమా, CEAT, My11Circle, Boat వంటి ప్రముఖ బ్రాండ్లతో ఆయన ఒప్పందాలు చేసుకున్నారు. ఈ యాడ్స్ ద్వారా భారీగా ఆదాయం పొందుతున్నారు. బ్రాండ్ల ప్రకారం, ఒక్కో యాడ్ క్యాంపెయిన్‌కు ఆయన రూ. 30 నుంచి 40 లక్షల వరకు తీసుకుంటున్నారు.
శుభ్‌మన్ గిల్ పర్సనల్ లైఫ్.. బాలీవుడ్, టీవీ సెలబ్రిటీలతో డేటింగ్ రూమర్లు
శుభ్‌మన్ గిల్ పర్సనల్ లైఫ్ కూడా తరచూ వార్తల్లోకి వస్తోంది. ఆయనకు పలువురు బాలీవుడ్ హీరోయిన్లతో సంబంధం ఉందన్న వార్తలు ఇటీవలు చాలా సార్లు వైరల్ గా మారాయి.
అయితే దీనిని అతను అధికారికంగా నిర్ధారించలేదు. గిల్ బాలీవుడ్ నటి సారా అలీఖాన్, టీవీ నటి రిధిమా పండిట్, అలాగే అవ్నీత్ కౌర్లతో డేటింగ్ చేశారంటూ రూమర్లు వచ్చాయి.
అలాగే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తో గిల్ ప్రేమాయణం రూమర్లు కూడా వినిపించాయి. వీరిద్దరూ కలిసి కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ, వీటిపై గిల్ ఎలాంటి స్పందన ఇవ్వలేదు.
మూడు ఫార్మాట్ లకు భారత భవిష్యత్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్
ఇంగ్లాండ్ పర్యటనలో గిల్ ప్రదర్శనను పరిశీలిస్తే, భారత్ క్రికెట్ బృందం భవిష్యత్తులో ఆయన నాయకత్వాన్ని చూసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. 25 సంవత్సరాల వయసులోనే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా అదిరిపోయే ప్రదర్శనలు చేస్తున్నాడు.
వ్యక్తిగతంగా ఆటతోనే కాకుండా కెప్టెన్ గా కూడా తనను నిరూపించుకుంటున్నాడు. త్వరలోనే అతను మూడు ఫార్మాట్ లకు కెప్టెన్ గా అయ్యే అవకాశాలను క్రికెట్ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీతో పాటు తన సంపాదనలో కూడా భారత క్రికెట్‌లో టాప్ స్థాయికి చేరుకుంటున్నారు.