Dreams: పీడ కలలు వస్తున్నాయా.? పడుకునే ముందు మీరు ఈ ఫుడ్ తింటున్నారని అర్థం.
కలలు రావడం సర్వసాధారణం. అయితే వీటిలో కొన్ని సంతోషాన్ని కలిగిస్తే మరికొన్ని ఆందోళనను రేకెత్తిస్తాయి. అయితే మనకు వచ్చే కలలు మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా.?

ఆహారం వల్ల కలలు మారుతాయా?
మీరు రాత్రిపూట ఏమి తింటున్నారు అన్నదాని మీద మీ కలల స్వభావం కూడా ఆధారపడవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కెనడాలోని మాంట్రియాల్ విశ్వవిద్యాలయంలోని "డ్రీమ్స్ అండ్ నైట్మేర్ లాబొరేటరీ" డైరెక్టర్ టోర్ నీల్సన్ తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. జూన్ 30న 'ఫ్రంటియర్స్ ఇన్ సైకాలజీ' అనే జర్నల్‌లో ఈ పరిశోధనను పబ్లిష్ చేశారు.
స్వీట్లు, మసాలా భోజనం కలల మీద ప్రభావం
అధ్యయనంలో భాగంగా రాత్రిపూట స్వీట్లు, మసాలా ఫుడ్, పాలు ఎక్కువగా తీసుకున్నవారిలో నెగటివ్ కలలు వచ్చినట్టు తేలింది.
* 23% మంది స్వీట్లు తిన్న తర్వాత చెడు కలలు చూశారు.
* 19.5% మంది మసాలా ఫుడ్ తినడం వల్ల పీడ కలలు అనుభవించారు.
* 15.7% మంది పాలను తీసుకున్న తర్వాత నెగటివ్ కలలు కనిపించినట్లు చెప్పారు.
ఇవి మాత్రమే కాకుండా మాంసాహారం కూడా కొంతమందిలో కలలు విషయంలో ప్రతికూల ప్రభావం చూపిందని టోర్ నీల్సన్ తెలిపారు.
మంచి నిద్రకు చిట్కాలు
టోర్ నీల్సన్ పరిశోధనలో భాగంగా, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నవారిలో నిద్ర నాణ్యత మెరుగుగా ఉన్నట్టు తేలింది.
* 18% మంది పండ్లు తినడం వల్ల మంచి నిద్రపోయారని చెప్పారు.
* 13.4% మంది హెర్బల్ టీ వల్ల నిద్ర మెరుగుపడిందన్నారు.
* 12% మంది కూరగాయల వల్ల మంచి ప్రభావం ఉందన్నారు.
ఈ డేటా ఆధారంగా శరీరానికి తేలికగా ఉండే ఆహారం వల్ల మంచి నిద్రను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పీడ కలలకు అసలు కారణం ఇదే
కలలు అన్ని ఒకేలా ఉండవు. టోర్ నీల్సన్ పరిశోధనలో 'డిస్టర్బింగ్ డ్రీమ్స్' అంటే భయంకరమైన కలలు, 'బిజార్ డ్రీమ్స్' అంటే వింతగా ఉండే కలలు అని వర్గీకరించారు.
బిజార్ కలలకు ఎక్కువ కారణాలు:
స్వీట్లు – 38%
పాలు – 27%
డిస్టర్బింగ్ కలలకు:
స్వీట్లు – 31%
పాలు – 22%
మాంసం – 16%
రాత్రి తీసుకునే ఆహారం నిద్రపై దుష్ప్రభావం
నీల్సన్ పరిశోధనలో కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. వీటి ప్రకారం లాక్టోస్ అలర్జీ ఉన్నవారు పాలు తాగడం, ఆహారం తీసుకున్న వెంటనే పడుకోవడం. వంటివి కూడా నిద్రకు, కలలకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.
అలాగే మందులు, మాదకద్రవ్యాలు, మద్యం వంటివి కూడా పీడకలలకు కారణం కావొచ్చు. కొంతమందిలో గంజాయి వాడకం ఆపిన తర్వాత కొన్ని వారాలపాటు భయంకరమైన కలలు రావచ్చని పరిశోధకుడు తెలిపారు.