MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Revanth Reddy: కేసీఆర్‌, జగన్‌ బంధంతోనే తెలంగాణకు నష్టం జరిగింది : సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy: కేసీఆర్‌, జగన్‌ బంధంతోనే తెలంగాణకు నష్టం జరిగింది : సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy: కృష్ణా, గోదావరి జల వివాదాలపై ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లోనైనా చర్చించేందుకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌, జగన్‌ బంధంతోనే తెలంగాణకు తీరని నష్టం జరిగిందని విమర్శించారు.

2 Min read
Mahesh Rajamoni
Published : Jul 10 2025, 12:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కేసీఆర్‌ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
Image Credit : X/Revanth Reddy

కేసీఆర్‌ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తో కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాలపై చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు. బుధవారం ప్రజా భవన్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుబంధంతో తెలంగాణకు తీవ్రంగా నష్టం జరిగిందని ఆరోపణలు చేశారు. కేసీఆర్ గతంలో తీసుకున్న నిర్ణయాలతోనే నీళ్ల విషయంలో రాష్ట్రానికి నష్టం జరిగిందని తెలిపారు.

25
అసెంబ్లీలోనైనా, ఫామ్ హౌస్‌లోనైనా చర్చకు సిద్ధమన్న సీఎం
Image Credit : ANI

అసెంబ్లీలోనైనా, ఫామ్ హౌస్‌లోనైనా చర్చకు సిద్ధమన్న సీఎం

ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ అధికారులతో కూడిన సమావేశంలో కృష్ణా నదీజలాల పంపకంపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. దీని తర్వాత సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తనను క్లబ్బులు, పబ్బులకు పిలవొద్దని అన్నారు. ప్రజాస్వామ్య చర్చను క్లబ్బులు, పబ్బుల్లో కాకుండా సభలో విలువైన చర్చలు జరగాలన్నారు.

"మీ ఆరోగ్యం సహకరించపోతే.. అసెంబ్లీకి రాలేకపోతే.. ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లోనైనా చర్చకు సిద్ధం. నేను స్వయంగా హాజరై చర్చలో పాల్గొంటా" అని రేవంత్ రెడ్డి అన్నారు.

ప్లీజ్ దయచేసి నన్ను క్లబ్బులకు పబ్బులకు పిలవకండి – సీఎం రేవంత్ రెడ్డి https://t.co/Iq88gncKFvpic.twitter.com/ZhUrhzZPMw

— Telugu Scribe (@TeluguScribe) July 9, 2025

Related Articles

Related image1
SRH HCA controversy: ఎస్ఆర్హెచ్ టికెట్ల వివాదం..హెచ్‌సీఏ హెడ్ జగన్ మోహన్ రావు అరెస్ట్‌.. అసలు ఏం జరిగింది?
Related image2
IND vs ENG: లార్డ్స్ పిచ్‌పై పేస్ వార్.. బుమ్రా, ఆర్చర్ రీ ఎంట్రీతో రగడకు రెడీ
35
తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాటం చేస్తాం
Image Credit : ANI

తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాటం చేస్తాం

రాష్ట్రానికి కృష్ణా-గోదావరి నదీ జలాల్లో ఉన్న హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకట్టు పెట్టమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. "దేవుడే ఎదిరించినా రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాడతాం. ప్రజలు మాకు పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం" అని స్పష్టం చేశారు.

ఈ అంశాలపై శాసనసభలో అర్థవంతమైన చర్చ జరగాలని సీఎం కోరారు. నీటి కేటాయింపుల్లో తెలంగాణకు జరిగే అన్యాయంపై స్పష్టమైన పాలసీ డాక్యుమెంట్‌ను సభ ముందు ఉంచుతామని చెప్పారు. నిపుణులతో చర్చ జరిపే యోచనను వెల్లడించారు.

"తెలంగాణకు శాశ్వత హక్కులు లభించాలంటే స్పష్టమైన విధానంతో ముందుకు సాగాలి. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం" అని సీఎం పేర్కొన్నారు.

45
ఆంధ్రప్రదేశ్ వాదనలను తిప్పికొట్టిన సీఎం రేవంత్
Image Credit : Asianet News

ఆంధ్రప్రదేశ్ వాదనలను తిప్పికొట్టిన సీఎం రేవంత్

ఆంధ్రప్రదేశ్ వరద జలాలను వినియోగించుకోవచ్చనే వాదనను సీఎం తోసిపుచ్చారు. ముందుగా నికర జలాల్లో తెలంగాణ వాటా తేలాలన్నారు. అనంతరం ప్రొరేటా పద్ధతిలో మిగిలిన జలాల పంపిణీ జరగాలన్నారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పలు ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందని సీఎం పేర్కొన్నారు. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, ఎస్ఎల్‌బీసీ వంటి ప్రాజెక్టులు పూర్తవకపోవడం, ప్రాణహిత-చెవెళ్ల ప్రాజెక్టు మార్పులు రాష్ట్రాన్ని నష్టానికి గురి చేశాయని వివరించారు.

55
విద్యుత్ ఉత్పత్తిలోనూ నష్టమే
Image Credit : ANI

విద్యుత్ ఉత్పత్తిలోనూ నష్టమే

తెలంగాణ నీటిని రాయలసీమకు తరలించడం వల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల పరిధిలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పనికిరాకుండా పోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. తక్కువ ధరకు విద్యుత్ పొందే అవకాశాలను కోల్పోయామని ఆయన చెప్పారు.

ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నీటి ప్రణాళికలు, ఖర్చుల వివరాలు, నియోజకవర్గాల అన్యాయాలపై సీఎం స్పష్టంగా విమర్శించారు. ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలన్న దృక్పథంతో తమ చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

కృష్ణా నది జల వివాదాలు, కాళేశ్వరం ప్రాజెక్టు సమస్యలపై ప్రజా భవన్ ల మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు హాజరయ్యాను. 

తెలంగాణ ప్రజల హక్కుల కోసం దేవుడితోనైనా నిటారుగా నిలబడి కొట్లాడుతా. వ్యక్తుల కోసం ప్రజల హక్కులు తాకట్టు పెట్టే సమస్యే లేదు. 

జూరాల… pic.twitter.com/shnfTLPQJ9

— Revanth Reddy (@revanth_anumula) July 9, 2025

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
అనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved