most valuable IPL team: ఐపీఎల్‌లో అత్యంత విలువైన జట్టుగా ఆర్సీబీ ఎలా ఎదిగింది?
most valuable IPL team: విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తొలి టైటిల్ గెలిచిన తర్వాత $269 మిలియన్ల బ్రాండ్ విలువతో ఐపీఎల్‌లో టాప్ ప్లేస్ కు చేరింది. ముంబై, చెన్నై టీమ్ లను వెనక్కినెట్టింది.
- FB
- TW
- Linkdin
Follow Us

ఐపీఎల్ 2025లో బిజినెస్, బ్రాండ్ విలువలు భారీగా పెరిగాయి : హౌలిహాన్ నివేదిక
ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ హౌలిహాన్ తాజా నివేదిక ప్రకారం, 2025లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యాపార విలువ భారీగా పెరిగింది. 13 శాతం పెరిగి $18.5 బిలియన్లకు (సుమారు రూ.1.6 లక్షల కోట్లు) చేరింది. అదే సమయంలో లీగ్ బ్రాండ్ విలువ కూడా 14 శాతం పెరిగి $3.9 బిలియన్లు (సుమారు రూ.33,000 కోట్లు)కు చేరింది.
ఐపీఎల్ బ్రాండ్ ర్యాంకింగ్‌లో టాప్ లో ఆర్సీబీ
ఈ నివేదిక ప్రకారం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలిసారిగా అత్యంత విలువైన ఐపీఎల్ జట్టుగా గుర్తింపు పొందింది. 2025లో మొదటిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన తరువాత విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీ బ్రాండ్ విలువ $269 మిలియన్లకు చేరింది. ఇది గతేడాది $227 మిలియన్లుగా ఉంది. ఐపీఎల్ లో అత్యధిక టైటిల్స్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK, ముంబై ఇండియన్స్ (MI) లను దాటి ఆర్సీబీ మొదటి స్థానానికి చేరింది.
ఆర్సీబీ తర్వాత ముంబై, చెన్నై, కేకేఆర్
ముంబై ఇండియన్స్ $242 మిలియన్ల బ్రాండ్ విలువతో ప్రస్తుతం రెండో స్థానంలో నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ $235 మిలియన్లతో మూడవ స్థానానికి పడిపోయింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) $227 మిలియన్ల బ్రాండ్ విలువతో నాలుగో స్థానంలో ఉంది.
సీఎస్కే ఈ సీజన్‌లో చెత్త ప్రదర్శనలు చేసినా.. మహేంద్ర సింగ్ ధోనీ టీమ్ లో ఉండటం, ఆ జట్టుకున్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా బ్రాండ్ విలువ బలంగా నిలిచినట్లు నివేదిక పేర్కొంది.
ఇతర జట్ల బ్రాండ్ విలువలు గమనిస్తే.. పంజాబ్ కింగ్స్ (PBKS) ఏడాదిలో అత్యధిక వృద్ధి 39.6% నమోదుతో $141 మిలియన్ల బ్రాండ్ విలువ కలిగివుంది. పంజాబ్ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ 34% పెరుగుదలతో రెండో స్థానంలో నిలిచింది.
ఆర్సీబీ టాప్ లో నిలవడానికి కారణమేంటి?
ఆర్సీబీ టాప్ లో నిలవడంలో పలు కీలక విషయాలు ప్రధాన పాత్ర పోషించాయి. మైదానంలో మెరుగైన ప్రదర్శనతో పాటు, విశ్వసనీయమైన ఫ్యాన్ బేస్ కలిగి ఉంది. అలాగే, స్టార్ ఆటగాళ్లు, కెప్టెన్ రాజత్ పటిదార్ నాయకత్వం, విరాట్ కోహ్లీ, నథింగ్ వంటి టెక్ బ్రాండ్‌లతో భాగస్వామ్యాలు చేయడం వంటి విషయాలు ప్రధాన కారకాలుగా ఉన్నాయని నివేదిక పేర్కొంది.
కర్ణాటకలో స్థానిక ప్రజలతో జట్టు నిర్వహించడం బలమైన కమ్యూనిటీ అవుట్రీచ్, డిజిటల్ ప్లాట్‌ఫాంలలో భారీ ఎంగేజ్మెంట్ కూడా ఆర్సీబీ టీమ్ బ్రాండ్ విలువ పెరుగుదలకు కారణాలుగా ఉన్నాయి.
ఐపీఎల్ క్రీడా లీగ్ మాత్రమే కాదు.. గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ బ్రాండ్ గా గుర్తింపు
హౌలిహాన్ లోకి నివేదిక ప్రకారం, ఐపీఎల్ కేవలం క్రీడా లీగ్ మాత్రమే కాదు, ఇది ఇప్పుడు ప్రపంచస్థాయి వినోద బ్రాండ్‌గా ఎదిగింది. స్థిరమైన జట్టు బడ్జెట్లు, బలమైన మీడియా ఒప్పందాలు, $600 మిలియన్లకు పైగా అంచనా వేసిన ప్రకటన ఆదాయంతో ఐపీఎల్ ప్రోత్సాహితమైన వ్యాపార మోడల్‌తో కొనసాగుతోందని తెలిపింది.
ఈ లీగ్ లాభాలతో ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్, ఎన్బీయే వంటి ప్రపంచ క్రీడా లీగ్‌లను దాటిపోయిందని తెలిపింది.
ఆర్సీబీ విజయంతో ఐపీఎల్‌లో కొత్త మార్పులు
హౌలిహాన్ డైరెక్టర్ హర్ష్ మాట్లాడుతూ.. "ఆర్సీబీ టైటిల్ విజయం ఐపీఎల్ శక్తి గమనాన్ని మార్చిన ఘట్టం. ఇది క్రికెట్‌ను వాణిజ్య, వినోద పరంగా మరింత విస్తరించేలా చేసింది" అని అన్నారు.