MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Amazon Prime Day 2025: iPhone 16 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు

Amazon Prime Day 2025: iPhone 16 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు

Amazon Prime Day 2025: అమెజాన్ ప్రైమ్ డే సేల్‌ 2025లో ఐఫోన్ 16ఈ (iPhone 16e) రూ.49,600కే లభిస్తోంది. ఐఫోన్ 16 సిరీస్ పై ఈ సేల్ లో బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్లతో భారీ తగ్గింపులు ఉన్నాయి.

3 Min read
Mahesh Rajamoni
Published : Jul 09 2025, 07:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
అమెజాన్ ప్రైమ్ డే 2025లో ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్
Image Credit : Getty

అమెజాన్ ప్రైమ్ డే 2025లో ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్

అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ ఈసారి జూలై 12 నుండి 14వ తేదీ వరకు మూడు రోజులపాటు జరగనుంది. ఈ సేల్ సందర్భంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఆపిల్ (Apple) నుండి ఇటీవల విడుదలైన ఐఫోన్ 16 (iPhone 16) సిరీస్‌పై భారీ తగ్గింపులు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా iPhone 16e, iPhone 16 Pro వేరియంట్లపై అందిస్తున్న డిస్కౌంట్లు మధ్యతరగతి, ప్రీమియం సెగ్మెంట్ వినియోగదారులకు మంచి డీల్స్ గా మారాయి.

27
ఐఫోన్ 16ఈ (iPhone 16e): మధ్య తరగతి వినియోగదారులకు బెస్ట్ డీల్
Image Credit : Getty

ఐఫోన్ 16ఈ (iPhone 16e): మధ్య తరగతి వినియోగదారులకు బెస్ట్ డీల్

2024 సెప్టెంబర్‌లో విడుదలైన ఐఫోన్ 16 (iPhone 16) సిరీస్‌లో అత్యంత చౌక ధరకు లభించే మోడల్ ఐఫోన్ 16ఈ (iPhone 16e). అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ సందర్భంగా దీని ప్రారంభ ధరను రూ.53,600గా నిర్ణయించారు. అయితే ఎస్బీఐ, ఐసీఐసీఐ కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు ఉపయోగించి కొనుగోలు చేసిన వినియోగదారులకు తక్షణంగా రూ. 4,000 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో మీకు ఈ ఫోన్ రూ. 49,600లకే లభిస్తుంది.

ఈ ధరకు వినియోగదారులు Apple Intelligence వంటి కొత్త ఫీచర్లు, ఆధునిక ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్‌ప్లే, యూఎస్బీ టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్ వంటి సదుపాయాలతో కూడిన ఫోన్‌ను పొందవచ్చు. ఇది గతంలో వచ్చిన iPhone SE మోడళ్ల కంటే ఆధునికమైన డిజైన్‌ను కలిగి ఉంది.

Related Articles

Related image1
Amazon Prime Day 2025: అమెజాన్ ప్రైమ్ డే లో iPhone 15, Galaxy S24 Ultra, OnePlus 13S పై బిగ్ డిస్కౌంట్లు
Related image2
RCB: ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ కు షాక్.. ఐపీఎల్ తోపు టీమ్ గా కోహ్లీ ఆర్సీబీ జట్టు
37
ఎక్స్చేంజ్ డీల్స్‌తో ఐఫోన్ 16 సిరీస్ పై అదనపు తగ్గింపులు
Image Credit : Getty

ఎక్స్చేంజ్ డీల్స్‌తో ఐఫోన్ 16 సిరీస్ పై అదనపు తగ్గింపులు

ఐఫోన్ 16ఈ (iPhone 16e) పై ఇంకా ఎక్కువ తగ్గింపు కోరేవారికి అమెజాన్ ఎక్స్చేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. పాత ఐఫోన్ మంచి కండిషన్‌లో ఉన్నట్లయితే గరిష్ఠంగా రూ.15,000 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. అయితే ఈ ఎక్స్చేంజ్ విలువ పాత ఫోన్ మోడల్, ప్రస్తుత కండిషన్ పై ఆధారపడి ఉంటుంది.

47
ఐఫోన్ 16ఈ ఫీచర్లు ఏమిటి? ఇప్పుడే ఎందుకు కొనాలి?
Image Credit : Getty

ఐఫోన్ 16ఈ ఫీచర్లు ఏమిటి? ఇప్పుడే ఎందుకు కొనాలి?

ఐఫోన్ బిగ్ బ్రాండ్ ఆపిల్ కు చెందినవి. ఐఫోన్ 16ఈ అమెజాన్ ప్రైమ్ సేల్ లో తక్కువ ధరకు లభిస్తోంది. శక్తివంతమైన హార్డ్‌వేర్, కొత్త ఫీచర్లు కలిగిన iPhone కోసం చూస్తున్నవారికి iPhone 16e మంచి ఎంపిక. దీని డిజైన్ పాత iPhone 14 మాదిరిగానే ఉన్నా, ఇది కొత్త A18 చిప్‌తో 8GB ర్యామ్ కలిగి ఉంది. 

Apple Intelligence ఫీచర్లను సమర్థవంతంగా డీల్ చేస్తుంది. 48MP ఒక్కటే అయినా.. అది శక్తివంతమైన బ్యాక్ కెమెరాగా కంపెనీ పేర్కొంది. అలాగే, మంచి బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. USB-C పోర్టుతో వస్తోంది. మొత్తంగా ఇది బడ్జెట్ ఐఫోన్ వినియోగదారులకు సరైన ఎంపికగా నిలుస్తోంది. 

57
ఐఫోన్ 16 ప్రో (iPhone 16 Pro) పై భారీ తగ్గింపు
Image Credit : Apple

ఐఫోన్ 16 ప్రో (iPhone 16 Pro) పై భారీ తగ్గింపు

అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఇంకా మొదలుకాకముందే, అమెజాన్ ఇప్పటికే iPhone 16 Proపై ఆకర్షణీయమైన డిస్కౌంట్ అందిస్తోంది. అసలు ధర రూ.1,19,900గా ఉన్న 128GB వేరియంట్, ప్రస్తుతం రూ. 1,11,900కి అందుబాటులో ఉంది. అంటే ఫోన్ అసలు ధరపై 7 శాతం తగ్గింపును అందిస్తోంది.

అలాగే, ఐసీఐసీఐ, ఎస్బీఐ, కోటక్ బ్యాంకులు, అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై రూ.3,000 తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. కనీస ధర రూ. 71,940 ఉన్న అన్ని ఐఫోన్ కోనుగోలు పై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది.

67
ఎక్స్చేంజ్‌తో ఐఫోన్లపై భారీ తగ్గింపు
Image Credit : Apple

ఎక్స్చేంజ్‌తో ఐఫోన్లపై భారీ తగ్గింపు

అంతేకాకుండా, పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్‌ చేస్తే గరిష్ఠంగా రూ.47,150 వరకూ తగ్గింపు లభిస్తుంది. ఉదాహరణకు, మీరు 256GB iPhone 14 Plus ను ఎక్స్చేంజ్‌ చేస్తే దానిపై రూ.27,600 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ లభించవచ్చు. అలా అయితే iPhone 16 Pro ధర కేవలం రూ. 81,300కి తగ్గుతుంది.

77
ఐఫోన్ 16 ప్రో (iPhone 16 Pro): ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో గేమ్‌ఛేంజర్ ఫోన్
Image Credit : Apple YouTube

ఐఫోన్ 16 ప్రో (iPhone 16 Pro): ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో గేమ్‌ఛేంజర్ ఫోన్

iPhone 16 Proలో ఉన్న A18 Pro చిప్, శక్తివంతమైన AI పనితీరు కనబరుస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ (48MP మెయిన్, 48MP అల్ట్రావైడ్, 5x టెలిఫోటో జూమ్) అదిరిపోయింది. గరిష్ఠంగా 27 గంటల వీడియో ప్లేబ్యాక్ సామర్థ్యం దీన్ని ప్రీమియం సెగ్మెంట్‌లో అత్యుత్తమ ఎంపికగా టాప్ లో ఉంచుతోంది.

ఈ ప్రైమ్ డే సేల్‌లో Apple iPhone 16 సిరీస్‌పై అందిస్తున్న తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు చూసి తగిన ప్లాన్‌తో ముందస్తుగా కొనుగోలు చేయడం ఉత్తమమని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రత్యేకించి iPhone 16e మధ్యతరగతి వినియోగదారుల కోసం, iPhone 16 Pro ఫ్లాగ్‌షిప్ ప్రీమియం సెగ్మెంట్ కోసం ఉత్తమ ఎంపికలు అవుతున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved