తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..

11:55 PM (IST) Jul 29
BSNL 5G లాంచ్ కి సిద్ధమవుతున్న తరుణంలో కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది. ఈ ప్లాన్లు ఎక్కువ వ్యాలిడిటీ, డేటా, అపరిమిత కాల్స్ తో వస్తున్నాయి.
11:38 PM (IST) Jul 29
ఆపరేషన్ సింధూర్‌పై లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటనలు చేశారు. పహల్గాం ఉగ్రదాడికి కేవలం 22 నిమిషాల్లో భారత సైన్యం ఖచ్చితంగా ప్రతీకారం తీసుకుందని తెలిపారు.
10:52 PM (IST) Jul 29
1971లో భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న సమయంలో ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ ధైర్యంగా వ్యవహరించారంటూ తాజాగా రాహుల్ గాంధీ లోక్ సభలో వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఆమె అమెరికా అధ్యక్షుడు నిక్సన్ కు రాసిన లేఖ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
10:02 PM (IST) Jul 29
Gautam Gambhir: ఓవల్ మైదానంలో భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, పిచ్ క్యురేటర్ లీ ఫోర్టిస్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
08:58 PM (IST) Jul 29
గూగుల్ పే, ఫోన్ పే లాంటి యూపీఐ యాప్‌లు వినియోగదారులకు ఉచితంగా సేవలు అందిస్తూనే గతేడాది రూ.5,065 కోట్లు ఆదాయం పొందాయి. ఇదెలా సాధ్యమయ్యిందో ఇక్కడ తెలుసుకుందాం.
08:55 PM (IST) Jul 29
Local Body elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల అంశంతో కొలిక్కి రావడం లేదు. అయితే ఇది నిజంగా రిజర్వేషన్ల కారణమా? లేక కాంగ్రెస్ ఓటమి భయమా అన్న ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది.
07:46 PM (IST) Jul 29
భారతదేశం ప్రపంచంలో కండోమ్‌ల తయారీ, ఎగుమతుల్లో ప్రముఖ స్థానాన్ని సంపాదించింది. దేశంలోని పలు నగరాల్లో కండోమ్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. కండోమ్‌ల తయారీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
07:14 PM (IST) Jul 29
వ్యాపారం చేయాలని చాలా మందికి ఉంటుంది. అయితే పెట్టబడికి భయపడో, లాభాలు రావాన్న ఉద్దేశంతోనో వెనుకడుగు వేస్తుంటారు. అయితే తక్కువ రిస్క్, పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం.
06:53 PM (IST) Jul 29
కేవలం నాలుగైదు వందల ఖర్చుతో రూ.40,000 నుండి రూ.50,000 విలువైన కంప్యూటర్స్ చేసే పనిని మన టీవీలోనే చేయవచ్చు. ఇందుకోసమే టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోపిసి తీసుకువస్తోంది. టీవిలో కంప్యూటర్ సేవలు ఎలా సాధ్యమో ఇక్కడ తెలుసుకుందాం.
04:46 PM (IST) Jul 29
ప్రపంచవ్యాప్తంగా డేటింగ్ యాప్స్‌కు ప్రాధాన్యత పెరుగుతోంది. పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా డేటింగ్ యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఓ సంఘటన డేటింగ్ యాప్ గోప్యతను ప్రశ్నార్థకంగా మార్చేసింది.
04:34 PM (IST) Jul 29
వయనాడ్ ప్రకృతి విపత్తుకు ఏడాది పూర్తవుతోంది. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడి ఏకంగా రెండు గ్రామాలు మాయమైపోయాయి… ఏకంగా 300 వరకు మరణించారు. ఏడాది తర్వాత ఇప్పుడు ఆ ప్రాంతం ఎలా ఉందో, అక్కడి పరిస్థితులేంటి తెలుసుకుందాం.
03:51 PM (IST) Jul 29
ప్రతీ రోజూ దేశ వ్యాప్తంగా వేలాది కొత్త వాహనాలు రోడెక్కుతున్నాయి. దీంతో నగరాల్లో ట్రాఫిక్ సమస్య ఓ రేంజ్‌లో పెరిగిపోతోంది. తాజాగా జరిగిన ఓ సంఘటన బెంగళూరులో ట్రాఫిక్ సమస్య ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పేందుకు సాక్ష్యంగా నిలుస్తోంది.
03:27 PM (IST) Jul 29
Amazon great indian festival: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ పేరుతో సేల్‌ను ప్రారంభించనుంది. ఇంతకీ సేల్ ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది.? ఎలాంటి ఆఫర్లు ఉండనున్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
02:29 PM (IST) Jul 29
తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ఒక కుటుంబానికి ఎంత మొత్తం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
01:48 PM (IST) Jul 29
Most WTC Centuries: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు కొట్టిన టాప్ 5 బ్యాటర్లలో రోహిత్ శర్మను శుభ్‌మన్ గిల్ సమం చేశాడు.
11:48 AM (IST) Jul 29
Amazon Echo Show: అమెజాన్ భారత్‌లో థర్డ్ జెనరేషన్ ఎకో షో 5 విడుదల చేసింది. ఇందులో 5.5" డిస్‌ప్లే, బిల్ట్-ఇన్ కెమెరా, 2X బాస్, స్పష్టమైన ఆడియో సెటప్ ఉన్నాయి.
09:10 AM (IST) Jul 29
Nimisha Priya: కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో ఉరిశిక్ష రద్దు అయిందనే వార్తలు వైరల్ గా మారాయి. అయితే, ఈ వార్తలను భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చింది.
08:34 AM (IST) Jul 29
AP Local Body Elections: ఆగస్ట్ 10న ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఖాళీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది.
07:45 AM (IST) Jul 29
Weather Update: ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలంగాణలో కూడా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.