- Home
- Telangana
- Telangana schemes: మీరు తెలంగాణలో ఉంటారా.? అయితే మీ ఖాతాలో రూ. 6 లక్షలు ఉన్నట్లే, ఎంత డ్రా చేశారు.?
Telangana schemes: మీరు తెలంగాణలో ఉంటారా.? అయితే మీ ఖాతాలో రూ. 6 లక్షలు ఉన్నట్లే, ఎంత డ్రా చేశారు.?
తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ఒక కుటుంబానికి ఎంత మొత్తం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

చేయూత పింఛన్లు
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో చేయూత ఒకటి. ఈ పథకం కింద వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, చేనేత, గీత, ఫైలేరియా, హెచ్‌ఐవీ, డయాలసిస్ బాధితులకు పింఛన్ అందిస్తున్నారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు ప్రతీ నెల ప్రభుత్వం రూ. 2,016 అందిస్తోంది. నెలనెలా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతుంది. ఈ పథకం ద్వారా ఏటా రూ. 24,192 లభిస్తోంది.
రైతు భరోసా పథకం
తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చింది. రైతులకు మెరుగైన విత్తనాలు, ఎరువులకు ఆర్థిక సాయం కింద ఏటా ఎకరానికి రూ. 12,000 ఆర్థిక సహాయం అందిస్తోంది. తెలంగాణ రైతు భరోసా పథకం కింద, అర్హత కలిగిన రైతులు ఎకరానికి సీజన్‌కు రూ. 6,000 చొప్పున, రబీతో పాటు ఖరీఫ్ పంట సీజన్లలో ఏటా ఎకరానికి రూ. 12,000 చొప్పున అందిస్తారు.
భూమిలేని వారికి కూడా
ఇదిలా ఉంటే భూమి లేని రైతు కూలీలకు కూడా ఆర్థిక సహాయాన్ని ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12,000 రెండు విడతల్లో ఇస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా ఒక్కో విడతలో రూ.6,000 చొప్పున అకౌంట్లలో జమ చేయనున్నారు. త్వరలోనే ఈ పథకం అమల్లోకి రానుంది.
గృహ జ్యోతి పథకం
పేదలకు విద్యుత్ భారాన్ని తగ్గించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మరో పథకం గృహజ్యోతి. ఈ పథకం కింద తెలంగాణలోని అన్ని అర్హత కలిగిన కుటుంబాలు గృహావసరాల కోసం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను పొందవచ్చు. ఈ పథకం ద్వారా దాదాపు ఒక్కో కుటుంబానికి నెలకు రూ. 500 వరకు ఆదా అవుతోంది. ఈ లెక్కన ఏడాదికి ప్రతీ కుటుంబానికి రూ. 6000 వరకు ఆదా అవుతోంది.
ఉచిత బస్సు ప్రయాణం
మహాలక్ష్మీ పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మరో పథకం ఉచిత బస్సు సదుపాయం. ఈ పథకం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకం ద్వారా సగటున ఒక మహిళకు నెలకు రూ. 1500 చొప్పున ఆదా అవుతుంది. ఈ లెక్కన ఈ పథకం ద్వారా ఏడాదికి సుమారు రూ. 20 వేల వరకు మహిళలు లబ్ధిపొందుతున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం
పేదల సొంతింటి కల నిజం చేసే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నారు. అయితే ముందు లబ్ధిదారులు ఖర్చు పెట్టుకుంటే ఇంటి నిర్మాణం జరిగే వివిధ దశల్లో మెుత్తం 4 విడతలుగా రూ.5 లక్షల సాయం అందిస్తుంది ప్రభుత్వం. ఇలా తెలంగాణలో సగటున ఒక పేద కుటుంబానికి ఏడాదికి మొత్తం రూ. 6 లక్షల వరకు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుంది.