- Home
- Business
- గూగుల్ పే, ఫోన్ పే సేవలు ఉచితమే... మరి ఏడాదిలో రూ.50650000000 కోట్లు ఎలా సంపాదించాయబ్బా..! ఇన్కమ్ సీక్రెట్ ఇదే
గూగుల్ పే, ఫోన్ పే సేవలు ఉచితమే... మరి ఏడాదిలో రూ.50650000000 కోట్లు ఎలా సంపాదించాయబ్బా..! ఇన్కమ్ సీక్రెట్ ఇదే
గూగుల్ పే, ఫోన్ పే లాంటి యూపీఐ యాప్‌లు వినియోగదారులకు ఉచితంగా సేవలు అందిస్తూనే గతేడాది రూ.5,065 కోట్లు ఆదాయం పొందాయి. ఇదెలా సాధ్యమయ్యిందో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్ పే, ఫోన్ పే సేవలు ఉచితమే... మరి ఆదాయం ఎలా?
గూగుల్ పే, ఫోన్ పే... భారతీయులకు పరిచయం అక్కర్లేని పేర్లివి. ఈ డిజిటల్ జమానాలో ఆర్థిక లావాదేవీలకు ఇవే ఆధారంగా మాారాయి. బ్యాంక్ అకౌంట్ కలిగిన ప్రతిఒక్కరి స్మార్ట్ ఫోన్ లో ఈ యాప్స్ ఉంటాయి... ఖరీదైన వస్తువుల నుండి కాయగూరల కొనుగోలు వరకు వీటినుండే పేమెంట్స్ జరిగిపోతున్నాయి. డిజిటల్ పేమెంట్స్ లో యూపిఐ (Unified Payment Interface) గేమ్ ఛేంజర్ అయితే... ఇందులో గూగుల్ పే, ఫోన్ పే లదే కీలకపాత్ర.
ఈ యూపిఐ సేవలు పూర్తిగా ఉచితం... ఆర్థిక లావాదేవీలు జరిపే వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే బ్యాంక్ అకౌంట్లో బ్యాలన్స్ చెక్ చేసుకోవడం వంటి సేవలు కూడా ఉచితమే. రీచార్జ్, కరెంట్ బిల్లు, ట్యూషన్ ఫీజు, ఈఎంఐ చెల్లింపులను కూడా ఈ గూగుల్ పే, ఫోన్ పే ద్వారా చేయవచ్చు… ఇవీ ఫ్రీనే. ఇలా అన్నిసేవలు ఉచితంగా అందిస్తున్నా ఈ యూపిఐ యాప్స్ వేలకోట్లు సంపాదిస్తున్నాయి. మరి వాటి ఇన్కమ్ సీక్రెట్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
KNOW
గతేడాది ఫోన్ పే, గూగుల్ పే ఆదాయమెంతో తెలుసా?
ప్రముఖ యూపిఐ పేమెంట్ యాప్స్ గూగుల్ పే, ఫోన్ పే గతేడాది భారీ లాభాలను ఆర్జించాయి. ఈ రెండు యాప్స్ నిర్వహణ సంస్థలు ఒక్క సంవత్సరంలో ఏకంగా రూ.5,065 కోట్లను సంపాదించాయి. ప్రతి ఏటా వీటి ఆదాయం పెరుగుతూనే ఉంది.
వినియోగదారుల నుండి ఎలాంటి ఛార్జీలు వసూలుచేయడంలేదు? ఆర్థిక లావాదేవీలన్నీ ఉచితమే... మరి గూగుల్ పే, ఫోన్ పే ఇన్నివేల కోట్లు ఎలా సంపాదిస్తున్నాయి? ఇదేగా మీ డౌట్. అయితే ఈ యూపిఐ యాప్స్ బిజినెస్ సీక్రెట్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. వినియోగదారులకు అందించే ఉచిత సర్వీసులే ఈ యాప్స్ కు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి.
గూగుల్ పే, ఫోన్ పే ఆదాయ మార్గాలివే
1. వాయిస్ స్పీకర్ల ద్వారా ఆదాయం :
ప్రస్తుతం ప్రతి షాప్ లో ఈ గూగుల్ పే, ఫోన్ ఫే స్పీకర్లు కనిపిస్తున్నాయి. వీటిద్వారానే ఈ యాప్స్ కు అత్యధిక ఆదాయం వస్తుందట. ఈ స్పీకర్స్ ను కిరాణా షాపులకు నెలవారి అద్దె రూపంలో అందిస్తుంటాయి ... నెలకు రూ.100 చార్జ్ చేస్తాయి . ఇలా దేశవ్యాప్తంగా 3 మిలియన్స్ స్టోర్స్ లో వీటిని ఉపయోగిస్తున్నారు.. అంటే నెలకు రూ.30 కోట్లు... ఏడాదికి రూ.360 కోట్ల ఆదాయం వీటిద్వారానే వస్తుంది.
2. స్క్రాచ్ కార్డ్స్ ద్వారా ఆదాయం
గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపిఐ యాప్స్ కు మరో ప్రధాన ఆదాయవనరు స్క్రాచ్ కార్డ్స్. వినియోగదారులు ఆర్థిక లావాదేవీలు జరిపినందుకు స్క్రాచ్ కార్డ్స్ అందిస్తారు... అయితే వీటిని ఉపయోగించి కొన్ని వస్తువులను, సేవలను తక్కువధరకు పొందవచ్చు. అంటే ఆయా వ్యాపారసంస్థలు ఈ యాప్స్ ద్వారా ప్రచారాన్ని, బిజినెస్ ను పొందుతున్నాయి... కాబట్టి ఇవి డబ్బులు చెల్లిస్తాయి. ఇలా స్క్రాచ్ కార్డ్స ద్వారా ఇటు యూపిఐ యాప్స్, అటు వ్యాపార సంస్థలు లాభం పొందుతాయి.
3. వ్యాపారుల నుండి కమీషన్లు
గూగుల్ పే, ఫోన్ పే యాప్స్ లో వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు ఉండవు... కానీ చెల్లింపుల సమయంలో వ్యాపారుల నుండి మాత్రం కొంత కమీషన్ వసూలుచేస్తాచయి. ఇది కూడా వీటికి ఆదాయమార్గమే.
4. కొన్ని సేవలకు ఛార్జీలు
కొన్ని సేవలు అందించేందుకు వినియోగదారుల నుండి కూడా మినిమం ఛార్జీలు వసూలు చేస్తాయి ఈ యూపిఐ యాప్స్. ఉదాహరణకు ఎక్కువమొత్తంతో రీచార్జ్ చేసుకుంటే కొంత చార్జీ వసూలు చేస్తాయి. దీనిద్వారా కూడా ఆదాయ వస్తుంది.
5. ప్రకటనలు, మార్కెటింగ్
గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపిఐ యాప్స్ ప్రకటన ద్వారా కూడా ఆదాయాన్ని పొందుతాయి. ఇలా వినియోగదారులకు ఉచితంగానే ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు అవకాశం కల్పిస్తున్నా ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతున్నాయి ఈ గూగుల్ పే, ఫోన్ పే యాప్స్. అందుకే వేల కోట్లు అర్జిస్తున్నాయి.