BSNL : 252GB డాటాతో 84 రోజుల వ్యాలిడిటీ .. బిఎస్ఎన్ఎల్ సరికొత్త రీచార్జ్ ప్లాన్
BSNL 5G లాంచ్ కి సిద్ధమవుతున్న తరుణంలో కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది. ఈ ప్లాన్లు ఎక్కువ వ్యాలిడిటీ, డేటా, అపరిమిత కాల్స్ తో వస్తున్నాయి.

BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్లు
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన 5G లాంచ్ కి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే యూజర్లకు మరింత ప్రయోజనం చేకూర్చేలా కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది. కస్టమర్ల సౌలభ్యం కోసం ఈ కొత్త ప్రీపెయిడ్ ప్యాక్ లు ఎక్కువ వ్యాలిడిటీ, డేటా, అపరిమిత కాల్స్ తో వస్తున్నాయి.
రూ.897 ప్లాన్
BSNL రూ.897 ప్రీపెయిడ్ ప్యాక్ ఎక్కువ కాలం వ్యాలిడిటీ కోరుకునే వారి కోసం. ఇది 180 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అన్ని నెట్ వర్క్ లకు అపరిమిత కాల్స్, రోజుకి 100 SMSలు, మొత్తం 90GB డేటా లభిస్తుంది. తరచుగా రీఛార్జ్ చేసుకోవడం ఇష్టం లేని వారికి ఇది మంచిది.
రూ.599 ఆల్-రౌండర్ ప్లాన్
BSNL రూ.599 "ఆల్-రౌండర్" ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకి 3GB డేటా (మొత్తం 252GB), అపరిమిత కాల్స్, రోజుకి 100 SMSలు లభిస్తాయి. ఇది BSNL వెబ్సైట్, యాప్ లో మాత్రమే లభిస్తుంది. ఎక్కువ డేటా వాడేవారికి ఇది సరిపోతుంది.
రూ.249 బడ్జెట్ ప్లాన్
బడ్జెట్ ప్లాన్ కోరుకునేవారికి రూ.249 ప్లాన్ బాగుంటుంది. 45 రోజుల వ్యాలిడిటీ, రోజుకి 2GB డేటా (మొత్తం 90GB), అపరిమిత కాల్స్, రోజుకి 100 SMSలు, BSNL BiTV OTT యాక్సెస్ లభిస్తుంది.
తక్కువ ధర ప్లాన్
BSNL ఈ మూడు కొత్త ప్లాన్లు అన్ని రకాల యూజర్ల కోసం. 5G లాంచ్ కి ముందు ఈ ప్లాన్లు కొత్త కస్టమర్లను ఆకర్షిస్తాయి.