Nimisha Priya: నిమిష ప్రియకు ఉరిశిక్ష అంశంపై కేంద్రం కీలక అప్డేట్
Nimisha Priya: కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో ఉరిశిక్ష రద్దు చేశారనే వార్తలు వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం దీనిపై స్పందిస్తూ కీలక అప్డేట్ ఇచ్చింది.

నిమిష ప్రియ కేసులో కీలక మలుపు
కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ ప్రస్తుతం యెమెన్‌లో జైలులో ఉన్నారు. 37 ఏళ్ల నిమిష ప్రియపై స్థానిక వ్యక్తి తలాల్ అబ్దుల మహదీని హత్య చేశారన్న ఆరోపణలతో యెమెన్ కోర్టు మరణ శిక్ష విధించింది.
అయితే, భారత గ్రాండ్ ముఫ్తీ కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం సూచనలతో ప్రారంభమైన చర్చలు ఫలవంతమయ్యాయనీ, సనాలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆమెపై విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలని యెమెన్ ప్రభుత్వం అంగీకరించిందనే వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై తాజాగా భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఇంకా చర్చలు జరుతున్నాయని తెలిపింది.
The reported revocation of Nimisha Priya's death sentence stems from diplomatic interventions by Indian officials and religious leaders, including Grand Mufti Kanthapuram AP Abubakker Musliyar, who mediated with Yemeni authorities. This facilitated high-level talks in Sanaa,…
— Grok (@grok) July 29, 2025
ఇంకా రద్దు కాలేదు.. చర్చలు జరుతున్నాయన్న భారత విదేశాంగ శాఖ
భారత ముఫ్తీ విజ్ఞప్తి మేరకు యెమెన్ సూఫీ పండితుడు షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ నేతృత్వంలో ఒక బృందం చర్చల కోసం నియమించారు. ఈ బృందం ఉత్తర యెమెన్ అధికారులతో సమావేశమై నిమిష ప్రియపై ఉన్న శిక్షను పునరాలోచించాలంటూ విజ్ఞప్తి చేసింది. ఆపరేషన్‌లో ప్రముఖ ముస్లిం మత నేతలు కూడా మద్దతు తెలపడం ద్వారా, చర్చలు జరిగాయి. సానుకూలంగా సాగాయనే రిపోర్టులు పేర్కొన్నాయి.
అయితే, యెమెన్‌లో మరణశిక్ష పడిన మలయాళీ నర్సు నిమిష ప్రియ శిక్షను తగ్గించినట్లు వచ్చిన వార్తలను విదేశాంగ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. నిమిషప్రియ కేసుకు సంబంధించి కొంతమంది వ్యక్తులు పంచుకున్న సమాచారం తప్పుదారి పట్టించేదిగా ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ వర్గాలు స్పష్టం చేసినట్లు ఇండియా టుడే నివేదించింది.
నిమిష ప్రియ కేసు నేపథ్యం ఏమిటి?
నిమిష ప్రియ 2012లో భర్త టామీ, కూతురుతో కలిసి యెమెన్ వెళ్లింది. అక్కడ తలాల్ మహదీ అనే స్థానికుడితో కలిసి క్లినిక్ ప్రారంభించింది. కానీ సంబంధాలు చెడిపోయిన తర్వాత, తలాల్ ఆమె పాస్‌పోర్టును లాక్కున్నాడు. అలాగే, వారి వద్దవున్న బంగారాన్ని అమ్మేశాడు.
ఆమెను బలవంతంగా తన భార్యగా పేర్కొంటూ నకిలీ వివాహ ధృవీకరణ పత్రం సృష్టించాడు. ఆ సమయంలో నిమిష ప్రియ అతని నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా, అతనికి మత్తుమందు ఇచ్చింది. మోతాదు అధికంగా ఉండటంతో మహదీ మరణించాడు. అప్పటినుంచి నిమిష జైల్లో ఉన్నారు.
నిమిష ప్రియ శిక్ష అమలు చివరి నిమిషంలో మార్పులు
నిమిష ప్రియకు జూలై 16న ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. కానీ భారత ప్రభుత్వం, ముఫ్తీ చర్యలతో చివరి నిమిషంలో దాన్ని వాయిదా వేశారు. ఆ తర్వాత శిక్షను శాశ్వతంగా రద్దు చేయాలనే చర్చలు కొనసాగుతన్నాయి.
నిమిష ప్రియ కేసు: చర్చల ద్వారానే పరిష్కారం
తలాల్ కుటుంబంతో న్యాయ పరిహారం, శాంతి చర్చలు ఇంకా కొనసాగనున్నాయి. నిమిష ప్రియ పూర్తిగా విముక్తి పొందేందుకు కొన్ని మతపరమైన, న్యాయపరమైన ప్రక్రియలు మిగిలి ఉన్నాయని తెలుస్తోంది.