MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Viral News: ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లే లోపు దుబాయ్ వెళ్లింది.. అక్క‌డ అలాగే ఉంట‌ది మ‌రి.

Viral News: ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లే లోపు దుబాయ్ వెళ్లింది.. అక్క‌డ అలాగే ఉంట‌ది మ‌రి.

ప్ర‌తీ రోజూ దేశ వ్యాప్తంగా వేలాది కొత్త వాహ‌నాలు రోడెక్కుతున్నాయి. దీంతో న‌గ‌రాల్లో ట్రాఫిక్ స‌మ‌స్య ఓ రేంజ్‌లో పెరిగిపోతోంది. తాజాగా జ‌రిగిన ఓ సంఘ‌ట‌న బెంగ‌ళూరులో ట్రాఫిక్ స‌మ‌స్య ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పేందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 29 2025, 03:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెర‌పైకి బెంగ‌ళూరు ట్రాఫిక్ స‌మ‌స్య
Image Credit : Gemini AI

తెర‌పైకి బెంగ‌ళూరు ట్రాఫిక్ స‌మ‌స్య

ప్రతి ఏడాది వాహనాల సంఖ్య పెరగడం వల్ల బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారుతున్నాయి. ఐటీ బూమ్‌కి తోడు, జనాభా పెరుగుదల రహదారులపై మరింత భారం మోపుతోంది. తాజాగా జరిగిన ఓ వాస్తవ సంఘటన బెంగ‌ళూరు ట్రాఫిక్ స‌మ‌స్య‌ను మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చేలా చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇన్‌స్టాలో వైర‌ల్ అవుతోన్న పోస్ట్
Image Credit : Asianet News

ఇన్‌స్టాలో వైర‌ల్ అవుతోన్న పోస్ట్

ఓ యువతి దుబాయ్‌కి వెళ్తున్న త‌న స్నేహితురాలిని డ్రాప్ చేయ‌డానికి బెంగ‌ళూరు విమానాశ్ర‌యానికి వెళ్లింది. స్నేహితురాలిని ఫ్లైట్ ఎక్కించి ఎయిర్‌పోర్ట్ నుంచి తిరిగి త‌న ఇంటికి బ‌య‌లుదేరింది. అయితే ఫ్లైట్‌లో ప్రయాణం మొదలుపెట్టిన కొద్ది గంటల్లోనే దుబాయ్ చేరుకుంది. కానీ, సెండాఫ్ ఇవ్వ‌డానికి వ‌చ్చిన‌ యువతి మాత్రం బెంగళూరు ట్రాఫిక్‌లోనే ఇరుక్కుపోయింది. ఈ అనుభవాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో అది వైరల్‌గా మారింది.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TRAVEL_FOODIE_GALS | Priyanka & Indrayani ❤️ (@travel_foodie_gals)

35
వైరల్ అయిన సోషల్ మీడియా పోస్ట్
Image Credit : Asianet News

వైరల్ అయిన సోషల్ మీడియా పోస్ట్

కంటెంట్ క్రియేటర్లు ప్రియాంక, ఇంద్రయాణి తమ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఈ అనుభవాన్ని పంచుకున్నారు. "స్నేహితురాలను ఎయిర్‌పోర్ట్‌కి డ్రాప్ చేసి కొద్దిసేపటికే ఆమె దుబాయ్ చేరినట్లు మెసేజ్ పంపింది. కానీ నేను ఇంకా ట్రాఫిక్‌లోనే చిక్కుకుపోయాను" అని పోస్ట్ చేశారు. "యదార్థ సంఘటనల ఆధారంగా" అనే హెడ్డింగ్‌తో పెట్టిన ఈ పోస్ట్‌కిల‌క్ష‌ల్లో వ్యూస్, లక్షల లైక్స్ వచ్చాయి.

45
నెటిజన్ల స్పందనలు
Image Credit : Getty

నెటిజన్ల స్పందనలు

ఈ ఘటనపై సోషల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. "బెంగళూరులో 1 కి.మీ ప్రయాణానికి కారులో మూడు గంటలు పడుతుంటే, కాలినడకన 10 నిమిషాలు స‌రిపోతుంది" అని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు, "ఇతర రాష్ట్రం నుంచి రెండు గంటల ఫ్లైట్ ఎక్కి బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కి వచ్చాను. కానీ ఇంటికి వెళ్లడానికి ఐదు గంటలు పట్టింది" అని రాసుకొచ్చారు.

55
మౌలిక సదుపాయాలపై విమర్శలు
Image Credit : ANI

మౌలిక సదుపాయాలపై విమర్శలు

బెంగళూరు విమానాశ్రయం నగరానికి దాదాపు 40 కి.మీ దూరంలో ఉంది. రద్దీ సమయాల్లో ప్రయాణం అత్యంత క్లిష్టంగా మారుతోంది. దేశీయ లేదా తక్కువ దూరంలో ఉన్న అంతర్జాతీయ విమానాల సమయంతో పోలిస్తే, ఇంటికి చేరే సమయం ఎక్కువగా పడుతోందని చాలా మంది చెబుతున్నారు. నగర వృద్ధి వేగం, వాహనాల పెరుగుదలకి తగినట్టుగా మౌలిక సదుపాయాల అభివృద్ధి జరగలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Delhi Protest : సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి మార్చ్.. రాహుల్, ప్రియాంకను అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత
Recommended image2
Rahul Gandhi: సీఈసీకి మోదీ రక్షణ.. ఢిల్లీని జైలుగా మార్చేశారు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Recommended image3
INDIA Bloc Protest: సీజేఐ నో చెప్పినా ఆగని ఇండియా కూటమి నిరసనలు.. ఢిల్లీలో ఏం జరుగుతోంది?
Related Stories
Recommended image1
Amazon: ఎల‌క్ట్రాన్ వ‌స్తువుల‌పై 70 శాతం డిస్కౌంట్‌, రూ. 1.3 ల‌క్ష‌లు గెలుచుకునే అవ‌కాశం.. అమెజాన్ సేల్ ఆహా అనే ఆఫ‌ర్లు
Recommended image2
Telangana schemes: మీరు తెలంగాణలో ఉంటారా.? అయితే మీ ఖాతాలో రూ. 6 ల‌క్ష‌లు ఉన్న‌ట్లే, ఎంత డ్రా చేశారు.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved