తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి.

11:59 PM (IST) Jul 10
Lords Test: లండన్ లోని లార్డ్స్ వేదికగా భారత్ - ఇంగ్లాండ్ జట్లు మూడో టెస్టులో తలపడుతున్నాయి. మొదటి రోజు ఇంగ్లాండ్ స్లోగా బ్యాటింగ్ చేసింది. అయితే, లార్డ్స్ టెస్టు రికార్డులు గమనిస్తే.. ఇక్కడ ఒక జట్టు కేవలం 38 పరుగులకే ఆలౌట్ అయింది.
11:19 PM (IST) Jul 10
Duke’s Ball: భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో డ్యూక్స్ బంతులు హాట్ టాపిక్ గా మారాయి. ఇంగ్లాండ్ కు చాలా కాలంగా బలమైన ఆయుధంగా ఉన్న ఈ డ్యూక్స్ ఇప్పుడు త్వరగా రూపు మారుతూ మృదువవుతోందన్న విమర్శలపై తీవ్ర చర్చ జరుగుతోంది. అసలు ఏంటి ఈ డ్యూక్స్?
10:30 PM (IST) Jul 10
Rishabh Pant: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషభ్ పంత్ గాయపడ్డారు.అతనుగ్రౌండ్ వీడటంతో ధ్రువ్ జురేల్ కీపింగ్ చేస్తున్నారు.
09:36 PM (IST) Jul 10
ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 170 అసిస్టెంట్ కమాండెంట్ (జనరల్, టెక్నికల్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్హతలు, సాలరీతో పాటు ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకొండి.
08:53 PM (IST) Jul 10
వర్షాకాలంలో ప్రకృతి మరింత అందాన్ని సంతరించుకుంటుంది. కానీ ఈ వర్షాల్లో ప్రయాణం ఇబ్బందికరమే కాదు ప్రమాదకరం కూడా. కాబట్టి ఈ సీజన్ లో మీ టూర్ ఆహ్లాదకరంగా ఉండాలంటే పాటించాల్సిన 5 ముఖ్యమైన చిట్కాలివే..
08:02 PM (IST) Jul 10
Heinrich Klaasen Special interview : హెన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే IPL, SA20, హండ్రెడ్ లీగ్‌లలో ఆడతానని చెప్పారు.
07:04 PM (IST) Jul 10
భారత్ లో శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ ధరలు తగ్గనున్నాయా? అంటే ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకిలా ధరలు తగ్గే అవకాశాలున్నాయంటే…
06:16 PM (IST) Jul 10
IND vs ENG: లార్డ్స్‌లో జరుగుతున్న మూడవ టెస్టులో ఇంగ్లాండ్‌కు బిగ్ షాక్ ఇచ్చాడు తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి. తొలి సెషన్ లోనే భారత్ కు రెండు కీలక వికెట్లు అందించాడు.
06:11 PM (IST) Jul 10
సంపాదించిన డబ్బును సురక్షితంగా దాచుకోవడం ఎంత ముఖ్యమో దానికి రాబడి రావడం కూడా అంతే ముఖ్యమని తెలిసిందే. అందుకే చాలా మంది డబ్బులను వివిధ పథకాల్లో పెట్టుబడిగా పెడుతుంటారు. అలాంటి బెస్ట్ స్కీమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
05:29 PM (IST) Jul 10
టాలీవుడ్ ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి. అటువంటి దర్శకుడితో సినిమా అంటే ఎంత పెద్ద స్టార్స్ అయినా క్యూలో నిల్చోవాల్సిందే. అయితే ఓ స్టార్ హీరో రాజమౌళిని తన కొడుకుతో సినిమా చేయమని ఎంతగానో రిక్వెస్ చేశాడట.
05:26 PM (IST) Jul 10
్యాపారం మొదలు పెట్టాలని చాలా మంది కోరుకుంటారు. అయితే వీరిలో కొందరు మాత్రమే విజయాన్ని సాధిస్తారు. వ్యాపారంలో రాణించాలంటే కొత్తగా ఆలోచించాలి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం.
04:47 PM (IST) Jul 10
హైదరాబాద్ శివారులో రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్‌తో భవిష్యత్ కోకాపేట్లుగా మారబోయే గ్రామాలు ఇవే. తక్కువ ధరలో భూములు కొనడానికి ఇదే సరైన సమయం. ఆ గ్రామాలేవో తెలుసా?
04:44 PM (IST) Jul 10
India vs England 3rd Test: ఇంగ్లాండ్, భారత జట్ల మధ్య గురువారం ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో మూడో టెస్ట్ ప్రారంభమైంది. ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్ లు ప్లేయింగ్ ఎలెవన్ లో చోటుదక్కించుకున్నారు.
04:20 PM (IST) Jul 10
గత కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న ట్రంప్ మరోసారి విరుచుకుపడుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి టారిఫ్‌ల పేరుతో ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
03:42 PM (IST) Jul 10
ఇండియన్ ఆర్మీ బలోపేతమవుతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత అధునాతన ఆయుధాలను సమకూర్చుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఇండియన్ నేవీ సరికొత్త రాకెట్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ రాకెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
02:37 PM (IST) Jul 10
ప్రతీ ఉద్యోగంలో పదవి విరమణ అనేది ఉంటుంది ఒక్క రాజకీయంలో తప్ప. అయితే 75 ఏళ్ల తర్వాత రిటైర్ కావాలన్న నిబంధన ఒకటి బీజేపీ అమలు చేస్తోందని వార్తలు వచ్చాయి. తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారి తీశాయి.
01:30 PM (IST) Jul 10
జులైలో తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలకే కాదు ఉద్యోగులకు కూడా వరుస సెలవులు వస్తున్నాయి. ఈ శని, ఆదివారం రెండ్రోజుల సెలవులు ఫిక్స్.. మరి సోమవారం కూడా అక్కడి విద్యార్థులకు సెలవుంటుందా?
12:39 PM (IST) Jul 10
Altered toddy: కూకట్‌పల్లిలో జరిగిన కల్తీ కల్లు వ్యవహారం కలవరపెడుతోంది. రసాయనాలతో తయారుచేసిన కృత్రిమ కల్లు సేవించడంతో ఐదుగురు మృతి చెందగా, మరో 31 మంది తీవ్ర అస్వస్థతకు గురికావడం అందరినీ షాక్‌కి గురి చేసింది.
11:44 AM (IST) Jul 10
ఓ యువకుడు చదువుపై మక్కువతో సాధారణ సైకిల్ ను కాస్త ఎలక్ట్రిక్ సైకిల్ గా మార్చేశాడు. అతడి ప్రతిభకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఫిదా అయ్యారు. ఇలా ఆ యువకుడి ఆదర్శవంతమైన స్టోరీ ఏమిటో ఇక్కడ తెలుసుకొండి.
11:29 AM (IST) Jul 10
అంతరిక్ష పరిశోధనలో భాగంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన రైతుగా మారి పరిశోధనలు చేపడుతున్నారు.
08:57 AM (IST) Jul 10
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు లేకపోయినా గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం పెరిగింది. దీంతో పరివాహక ప్రాంతాల ప్రజలకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.