Savings Schemes: బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ ఇచ్చే పథకాలు.. అస్సలు రిస్క్ ఉండదు.
సంపాదించిన డబ్బును సురక్షితంగా దాచుకోవడం ఎంత ముఖ్యమో దానికి రాబడి రావడం కూడా అంతే ముఖ్యమని తెలిసిందే. అందుకే చాలా మంది డబ్బులను వివిధ పథకాల్లో పెట్టుబడిగా పెడుతుంటారు. అలాంటి బెస్ట్ స్కీమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బ్యాంకుల కంటే మెరుగైన పథకాలు
స్థిర ఆదాయాన్ని కోరుకునే వారు మొదట బ్యాంక్ ఫిక్డ్స్ డిపాజిట్లకు మొగ్గు చూపుతారు. అయితే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే కేంద్ర ప్రభుత్వ స్మాల్ సేవింగ్ స్కీములు (Small Savings Schemes) మంచి ప్రత్యామ్నాయం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇవి అధిక వడ్డీ, ప్రభుత్వ భరోసా, భద్రత కలిగి ఉన్నాయి.
అధిక వడ్డీ అందిస్తోన్న కొన్ని ప్రభుత్వ పథకాలు
* పబ్లిక్ ప్రవిడెంట్ ఫండ్ (PPF) – 7.1% వడ్డీ
* నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ (NSC) – 7.7% వడ్డీ
* సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీం (SCSS) – 8.2% వడ్డీ
* పోస్టాఫీస్ టైం డిపాజిట్లు (5 సం.) – 7.5% వడ్డీ
ఈ పథకాల్లో వడ్డీ రేట్లు బ్యాంకులతో పోలిస్తే చాలా అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా SCSS వయోజనులకు అత్యంత ప్రయోజకరంగా ఉంటుంది.
బ్యాంక్ FD వడ్డీ రేట్లతో పోలిస్తే తేడా ఎంత?
ప్రస్తుతం ప్రముఖ బ్యాంకుల వడ్డీ రేట్లు (5 సంవత్సరాల FDలకు) ఇలా ఉన్నాయి.
* SBI: సాధారణ ఖాతాదారులకు – 6.3%, వృద్ధులకు – 6.8%
* HDFC: సాధారణ ప్రజలకు – 6.4%, వృద్ధులకు – 6.9%
* ICICI: సాధారణ ఖాతాదారులకు – 6.6%, వృద్ధులకు – 7.1%
* PNB: సాధారణ ఖాతాదారులకు – 6.5%, వృద్ధులకు – 7.0%గా ఉంది.
రెపో రేటు తగ్గడంతో తగ్గిన బ్యాంక్ ఎఫ్డీ వడ్డీలు
2025 ఫిబ్రవరిలో RBI రెపో రేటును 100 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో, చాలా బ్యాంకులు వారి FD వడ్డీ రేట్లను తగ్గించాయి. కానీ అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తన స్కీముల్లో వడ్డీ రేట్లను మార్చకుండా అలాగే స్థిరంగా కొనసాగించింది. దీంతో సేవింగ్ స్కీమ్స్ వైపు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.
భద్రతతో పాటు ఆదాయం
బ్యాంకు డిపాజిట్లు కూడా భద్రత కలిగినవే అయినా, వాటికి DICGC (Deposit Insurance and Credit Guarantee Corporation) కింద రూ. 5 లక్షల వరకే ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే, ఆ పైనే డిపాజిట్‌కు పూర్తి భద్రత ఉండదు. కానీ దీనికి భిన్నంగా, PPF, NSC, SCSS వంటివి కేంద్ర ప్రభుత్వ హామీతో నడిచే పథకాలు. అందుకే పూర్తి భద్రతతో పాటు వడ్డీ రాబడి హామీ ఉంటుంది.
ఎవరికి ఏ పథకం ఉపయోగపడుతుంది.?
* వృద్ధులకు సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీం అత్యుత్తమ ఎంపికగా చెప్పొచ్చు. వార్షిక ఆదాయానికి 8.2% వడ్డీ లభిస్తుంది. ఇందులో గరిష్టంగా రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు.
* స్థిర ఆదాయం కోరుకునే వారికి నెలవారీ ఆదాయ పథకాలు (POMIS) వంటి స్కీములు కూడా ఉన్నాయి.
* ఇక పన్ను మినహాయింపు కావాలనుకునే వారికి PPF, NSC పథకాలపై ఆయ్.టి. సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.