- Home
- International
- Shubhanshu Shukla: శుభాంశు శుక్లా అంతరిక్షంలో ఏం చేస్తున్నారు? భూమిపైకి తిరిగొచ్చేప్పుడు ఏం తీసుకొస్తారు?
Shubhanshu Shukla: శుభాంశు శుక్లా అంతరిక్షంలో ఏం చేస్తున్నారు? భూమిపైకి తిరిగొచ్చేప్పుడు ఏం తీసుకొస్తారు?
అంతరిక్ష పరిశోధనలో భాగంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన రైతుగా మారి పరిశోధనలు చేపడుతున్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us

అంతరిక్షంలో మెంతులు
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా, అంతరిక్షంలో ఆసక్తికర ప్రయోగం చేశారు. ధార్వాడ్ శాస్త్రవేత్తల సూచనలతో, మెంతులు, నామ్ విత్తనాలు మొలకెత్తే ప్రక్రియను అంతరిక్షంలో పరిశీలించారు. ఈ ప్రయోగం ద్వారా గురుత్వాకర్షణ లేని వాతావరణంలో విత్తనాలు ఎలా మొలకెత్తుతాయి? అనే అంశంపై విశ్లేషణ జరిగింది.
ఈ ప్రయోగాన్ని ధార్వాడ్ వ్యవసాయ యూనివర్సిటీకి చెందిన రవికుమార్ హోసమణి, IIT ధార్వాడ్‌కు చెందిన సుధీర్ సిద్ధాపూర్ రెడ్డి ఆధ్వర్యంలో చేశారు. ప్రయోగం తర్వాత మొలకెత్తిన విత్తనాలను భూమికి తీసుకొచ్చి, పునరుద్ధరణ జరిపే ఆలోచన చేస్తున్నారు.
అల్గీ (మైక్రో ఆర్గానిజంలు)పై ప్రత్యేక అధ్యయనం
శుక్లా అంతరిక్షంలో మైక్రో ఆల్గే అనే సూక్ష్మ జీవులపై కూడా ప్రయోగాలు చేశారు. ఇవి ఎలాంటి వాతావరణంలో అయినా ఎదగగలవు. దీని వల్ల భవిష్యత్తులో వ్యోమగాములకు ఆహార, ఆక్సిజన్ అవసరాలను తీర్చే అవకాశముంది.
తిరుగు ప్రయాణం ఎప్పుడు.?
శుభాంశు శుక్లా సహా నలుగురు వ్యోమగాములు రెండు వారాల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో శాస్త్రీయ ప్రయోగాలు చేస్తారు. అనంతరం వారు జులై 10వ తేదీన భూమిపైకి తిరిగి రావాల్సి ఉంది. కానీ వాతావరణం, సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమయ్యే అవకాశం ఉంది. నాసా లేదా ఆక్సియన్ స్పేస్ ఇంకా ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
భూమికి వచ్చే ప్రక్రియ ఎలా ఉంటుంది?
ముందుగా వ్యోమగాములు తమ ప్రయోగాలకు సంబంధించిన లగేజీని ప్యాక్ చేసుకుంటారు. అనంతరం స్పేస్‌ఎక్స్ డ్రాగన్ నౌకలో ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఈ నౌక 17 గంటల ప్రయాణంలో భూమికి చేరుతుంది.
మధ్యలో వేగం నియంత్రణ, భూమి వాతావరణంలోకి ప్రవేశం జరుగుతుంది. చివరగా 4 పెద్ద పారాచూట్లు సహాయంతో నౌక పసిఫిక్ మహాసముద్రంలో దిగుతుంది.
భూమికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది?
నౌక దిగిన తర్వాత, స్పేస్‌ఎక్స్ టీం వ్యోమగాములను వెంటనే బయటకు తీస్తారు. చాలా రోజుల పాటు గురుత్వాకర్షణ లేకుండా జీవించడం వల్ల, వారి శరీర కండరాలు బలహీనంగా మారుతాయి. అందుకే వారిని స్ట్రెచర్‌లో తీసుకెళ్లి, ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేస్తారు. తర్వాత వారు పునరుద్ధరణ కేంద్రానికి వెళ్లి, శరీరాన్ని మళ్లీ సాధారణ స్థితికి తేర్చుకుంటారు.