MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • కల్తీ కల్లుకు బలవుతోన్న ప్రాణాలు.. అసలు కల్తీ కల్లును ఎలా తయారు చేస్తారు? దీనిని ఎలా గుర్తించాలి.?

కల్తీ కల్లుకు బలవుతోన్న ప్రాణాలు.. అసలు కల్తీ కల్లును ఎలా తయారు చేస్తారు? దీనిని ఎలా గుర్తించాలి.?

Altered toddy: కూక‌ట్‌ప‌ల్లిలో జ‌రిగిన క‌ల్తీ క‌ల్లు వ్య‌వ‌హారం క‌ల‌వ‌ర‌పెడుతోంది. రసాయనాలతో తయారుచేసిన కృత్రిమ కల్లు సేవించడంతో ఐదుగురు మృతి చెందగా, మరో 31 మంది తీవ్ర అస్వస్థతకు గురికావ‌డం అంద‌రినీ షాక్‌కి గురి చేసింది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 10 2025, 12:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కల్తీ కల్లు తాగి ఐదుగురు మృతి
Image Credit : our own

కల్తీ కల్లు తాగి ఐదుగురు మృతి

సోమవారం రాత్రి కూకట్‌పల్లి, కెపీహెచ్‌బీ ప్రాంతాల్లోని కల్లు కాంపౌండ్లలో కల్తీ కల్లు తాగిన ఘటనలో మొత్తం ఐదుగురు మ‌ర‌ణించారు. మరో 31 మంది నిమ్స్, గాంధీ, రాందేవ్‌రావు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొంతమందికి డయాలసిస్‌ అవసరమవగా, మరికొందరిని వెంటిలేటర్‌పై ఉంచారు. 

ఈ కల్లు సేవించిన వారికి వాంతులు, గుండెలోదడ, వికారం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. ఈ నేప‌థ్యంలో అస‌లు క‌ల్తీ క‌ల్లును ఎలా త‌యారు చేస్తారు.? దీంతో న‌ష్టాలు ఏంటి.? క‌ల్తీ క‌ల్లును ఎలా గుర్తించాలి.? లాంటి వివ‌రాల‌ను తెలుసుకుందాం.

25
త‌క్ష‌ణ‌మే స్పందించిన ప్ర‌భుత్వం
Image Credit : our own

త‌క్ష‌ణ‌మే స్పందించిన ప్ర‌భుత్వం

ఈ ఘటన తర్వాత ఎక్సైజ్ శాఖ, పోలీసులు కల్తీ కల్లు కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఇప్పటివరకు 5 కేసులు బాలానగర్ అబ్కారీ ఠాణాలో, 2 కేసులు కెపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో నమోదయ్యాయి. చింతకింది నగేష్ గౌడ్, బట్టి శ్రీనివాస్ గౌడ్, టి. శ్రీనివాస్ గౌడ్, కె. కుమార్ గౌడ్, తీగల రమేష్ సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు. కల్తీ కల్లు తయారీ కేంద్రాలను సీజ్ చేసి, 674 లీటర్ల మృత్యు మద్యం ధ్వంసం చేశారు.

మరోవైపు, ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ బాధితులను పరామర్శించారు. కల్తీ కల్లు సరఫరాకు సంబంధించి మద్యం డిపోలపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు.

Related Articles

Related image1
Zodiac sign: ఈ రాశి వారు మాట్లాడే ముందు జాగ్ర‌త్త‌గా ఉండాలి.. అన‌వ‌స‌ర గొడ‌వ‌లు త‌ప్ప‌వు
Related image2
Hyderabad: రాసిపెట్టుకోండి.. 10 ఏళ్ల‌లో ఈ గ్రామం మ‌రో జూబ్లీహిల్స్ కానుంది.. ఇప్పుడు కొంటే లాభాల పంట ఖాయం
35
కల్తీ కల్లును ఎలా త‌యారు చేస్తారు.?
Image Credit : our own

కల్తీ కల్లును ఎలా త‌యారు చేస్తారు.?

కల్తీ కల్లు అంటే సహజంగా తాటిచెట్టు నుంచి తీసే కల్లు కాదు. ఇది పూర్తిగా రసాయనాల మిశ్రమంతో తయారు చేసే కల్లు. అక్రమార్కులు ఆల్ఫ్రాజోలం, డైజోఫాం, క్లోరోహైడ్రేట్, యాంటీ సైకోటిక్, నిమ్మ ఉప్పు, శాక్రీన్, కుంకుడు కాయల రసం, సిల్వర్ వైట్, యూరియా, సోడా యాష్, అమ్మోనియా, డ్రై ఈస్ట్ లాంటి పదార్థాలను మిశ్రమంగా కలిపి కల్లు రూపంలో తయారు చేస్తున్నారు.

డిమాండ్ తగినంత తాటి, ఈత చెట్లు లేక‌పోవ‌డంతో పూర్తిగా క‌ల్తీ మ‌ద్యాన్ని త‌యారు చేస్తున్నారు. నిజామాబాద్‌లో ఒక్క రోజులోనే 3 ల‌క్ష‌ల‌కు పైగా క‌ల్తీ క‌ల్లు ఉత్ప‌త్తి అవుతోంది. అయితే ఆశ్చర్యకరమైన విష‌యం ఏంటంటే.. అక్కడ ఒక్క తాటిచెట్టు కూడా లేదు. 2,400 సీసాల కల్లు తయారీకి కేవలం రూ.7,800 మాత్రమే ఖ‌ర్చ‌వుతుండ‌డంతో అక్ర‌మార్కులు క‌ల్తీ క‌ల్లు త‌యారీకి ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తున్నారు.

45
క‌ల్తీ క‌ల్లు తాగితే ఏమ‌వుతుంది.?
Image Credit : stockPhoto

క‌ల్తీ క‌ల్లు తాగితే ఏమ‌వుతుంది.?

కృత్రిమ కల్లులో ఉండే రసాయనాలు మానవ శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఆల్ఫ్రాజోలం, ఇతర మత్తు ఔషధాల మోతాదు అధికమైతే, కిడ్నీలు, లివర్, నరాల వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. కల్తీ కల్లు తాగిన తర్వాత కనిపించే లక్షణాలు:

* వాంతులు

* వికారం

* తలనొప్పి

* శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

* స్పృహ కోలపోవడం

* కిడ్నీ ఫెయిల్యూర్‌తో పాటు తీవ్రమైన పరిస్థితుల్లో మరణం కూడా సంభవించవచ్చు

55
అసలు కల్తీ కల్లును ఎలా గుర్తించాలి?
Image Credit : our own

అసలు కల్తీ కల్లును ఎలా గుర్తించాలి?

క‌ల్తీ క‌ల్లును కొన్ని ల‌క్ష‌ణాల ద్వారా గుర్తించ‌వ‌చ్చు. వాటిలో కొన్ని ముఖ్య‌మైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వాసన: సహజ కల్లు పుల్లగా వాసన వస్తుంది. అయితే కల్తీ కల్లులో అలాంటి వాస‌న ఉండ‌దు. లేదా రసాయనాల వాసన ఎక్కువగా ఉంటుంది.

రంగు: సహజ కల్లు కొంచెం మసకబారిన తెలుపు రంగులో ఉంటుంది. కానీ కల్తీ కల్లు ఎక్కువగా తెల్లగా మెరుస్తూ ఉంటుంది.

నురగ: కల్తీ కల్లులో కృత్రిమంగా నురగ వచ్చేలా తయారు చేస్తారు. నుర‌గ ఎక్కువ‌గా ఉంటే అందులో కుంకుడు కాయ ర‌సం క‌లిపిన‌ట్లు అర్థం చేసుకోవాలి.

రుచి: క‌ల్తీ క‌ల్లు రుచి బాగా తియ్యంగా ఉంటుంది. దీనికి కార‌ణం అందులో క‌లిపే శాక్రిన్‌. దీనివ‌ల్ల క‌ల్లు తీపిగా మారుతుంది.

వికారం: తాగిన కొద్దిసేపటికే వికారం, వాంతులు వస్తే ఇది కల్తీ కల్లు అని భావించాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
RTC: ఆర్టీసీ బ‌స్సుల నెంబ‌ర్ ప్లేట్ల‌పై “Z” మాత్ర‌మే ఎందుకు ఉంటుందో తెలుసా.?
Recommended image2
Telangana: ఇప్పుడే కొనేయండి.. తెలంగాణ‌లో కొత్త ఎయిర్ పోర్ట్ వ‌చ్చేస్తోంది. ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం
Recommended image3
IMD Rain Alert : హైదరాబాద్ లో ఆరెంజ్ అలర్ట్... ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Related Stories
Recommended image1
Zodiac sign: ఈ రాశి వారు మాట్లాడే ముందు జాగ్ర‌త్త‌గా ఉండాలి.. అన‌వ‌స‌ర గొడ‌వ‌లు త‌ప్ప‌వు
Recommended image2
Hyderabad: రాసిపెట్టుకోండి.. 10 ఏళ్ల‌లో ఈ గ్రామం మ‌రో జూబ్లీహిల్స్ కానుంది.. ఇప్పుడు కొంటే లాభాల పంట ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved