MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నా కొడుకుతో సినిమా ఎప్పుడు చేస్తావ్, రాజమౌళిని రిక్వెస్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

నా కొడుకుతో సినిమా ఎప్పుడు చేస్తావ్, రాజమౌళిని రిక్వెస్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

టాలీవుడ్ ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి. అటువంటి దర్శకుడితో సినిమా అంటే ఎంత పెద్ద స్టార్స్ అయినా క్యూలో నిల్చోవాల్సిందే.  అయితే ఓ స్టార్ హీరో రాజమౌళిని తన కొడుకుతో సినిమా చేయమని ఎంతగానో రిక్వెస్ చేశాడట. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 10 2025, 05:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Asianet News

రాజమౌళి తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచస్థాయిలో నిలబెట్టిన దర్శకుడు. బాలీవుడ్ ఆధిపత్యాన్ని పక్కకు నెట్టి ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ అనే రేంజ్ కు మన ఇండస్ట్రీని తీసుకువెళ్లాడు. ఇక రాజమౌళితో తో సినిమా చేయాలని ప్రతీ ఒక్క నటుడికి ఉంటుంది. ఆయన సినిమాలో ఒక్క సారి కనిపిస్తే చాలు అని పెద్ద పెద్ద స్టార్లు కూడా అనుకుంటారు. ఈక్రమంలో టాలీవుడ్ సీనియర్ నటుడు ఒకరు.. ఇండస్ట్రీలో హిట్లు కొట్టలేకపోతున్న తన కొడుకుతో సినిమా చేయమని రిక్వెస్ట్ చేశాడట.

25
Image Credit : Mohan Babu, Rajamouli

ఇంతకీ ఆ సీనియర్ స్టార్ ఎవరో కాదు. మోహన్ బాబు. అవును మోహన్ బాబు తన తనయుడు విష్ణుతో సినిమా చేయాలని రాజమౌళిని చాలా సార్లు అడిగారని తెలుస్తోంది. రాజమౌళి డైరెక్ట్ చేసిన యమదొంగ సినిమాలో మోహన్ బాబు అతి ముఖ్యమైన యముడి పాత్రలో నటించారు. ఈ సినిమా షూటింగ్ టైమ్ లో మోహన్ బాబు చాలాసార్లు రాజమౌళిని ఈ విషయం గురించి అడిగేవారట.

Related Articles

Related image1
అరుదైన వ్యాధితో బాధపడుతున్న టాలీవుడ్ యంగ్ హీరో, ఎంత ఇబ్బంది పడుతున్నాడో తెలుసా?
Related image2
20 కోట్లు ఇచ్చినా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టను, స్టార్ నటుడి సంచలన కామెంట్స్ ఎవరతను?
35
Image Credit : Yamadonga

విష్ణుతో సినిమా ఎప్పుడు చేస్తున్నావ్ రాజమౌళి చెప్పు అని అడిగేవారట. ఇక రాజమౌళి ఆ టైమ్ లో చేస్తాను సర్ అని చెప్పినా.. కరెక్ట్ డేట్ చెప్పు అంటూ జక్కన్నను ఇరకాటంలో పడేసేవారట. ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని.. సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అయ్యింది. ఇలా విష్ణు హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో భారీ బడ్జెట్ సినిమా చేయించాలని మోహన్ బాబు ప్రయత్నం చేశారట.

45
Image Credit : Asianet News

ఇక రీసెంట్ గా మోహన్ బాబు తన కొడుకు విష్ణుతో కన్నప్ప సినిమాను నిర్మించారు. ఈసినిమా కోసం దాదాపు 200 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు చేశారు. విష్ణు కన్నప్ప గా నటించిన ఈ సినిమాలో ప్రభాస్ తో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, లాంటి స్టార్స్ నటించి మెప్పించారు. ఈమూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ సాధించింది.

55
Image Credit : Asianet News

ఇక రాజమౌళి మహేష్ బాబు సినిమాతో ఫుల్ బిజీ అయిపోయాడు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో పాన్ వరల్డ్ సినిమాను రూపొందిస్తున్నాడు రాజమౌళి. అందుకు తగ్గట్టుగా చాలా జాగ్రత్తగా షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మూడు షెడ్యుల్స్ కంప్లీట్ అయ్యింది. అమెజాన్ అడవులకు సంబంధించిన అడ్వెంచర్ మూవీగా ఇది తెరకెక్కబోతోంది. మహేష్ బాబు జోడీగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది. 2027 లో ఈసినిమాను రిలీజ్ చేయాలన్న టార్గెట్ తో పనిచేస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఎస్.ఎస్. రాజమౌళి
మంచు మోహన్ బాబు
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Kantara Secret: కాంతారకి మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా? గూస్‌ బంమ్స్ తెప్పించే విషయం చెప్పిన రిషబ్ శెట్టి
Recommended image2
Vijay Rashmika: దేశ వ్యాప్తంగా అన్నదానం, స్వీట్ల పంపిణి.. అభిమానులకు విజయ్‌ దేవరకొండ, రష్మిక సర్‌ప్రైజ్‌
Recommended image3
Renu Desai: రాత్రికి రేటెంతా అని అడుగుతున్నారు, ట్రోలర్స్ పై విరుచుకుపడ్డ రేణు దేశాయ్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్‌
Related Stories
Recommended image1
అరుదైన వ్యాధితో బాధపడుతున్న టాలీవుడ్ యంగ్ హీరో, ఎంత ఇబ్బంది పడుతున్నాడో తెలుసా?
Recommended image2
20 కోట్లు ఇచ్చినా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టను, స్టార్ నటుడి సంచలన కామెంట్స్ ఎవరతను?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved