ప్రతీకార సుంకాలతో ప్రపంచాన్ని భయపెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అనేక దేశాలపై అమలు కావాల్సిన సుంకాలను 90 రోజులపాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులకు మాత్రం ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాడు. అమెరికాలో మూడేళ్లపాటు ఉండి ఉద్యోగాలను వెతుక్కునేందుకు, పని చేసుకునేందుకు ఇచ్చే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) అనుమతిని రద్దు చేసేందుకు బిల్లు తేవాలని యోచిస్తున్నారు. ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. వీటితో పాటు ఇతర జాతీయ, అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం..

12:08 AM (IST) Apr 11
Chanakya Niti : ఆచార్య చాణక్యుడు భారతదేశపు గొప్ప విద్వాంసులలో ఒకరు. జీవితంలో పాటించాల్సిన అనేక విషయాలు ఆయన తన చాణక్య నీతితో వివరించారు. అలాగే, భర్త తన భార్యకు తప్పకుండా ఇవ్వాల్సిన 5 సుఖాలు ఏవో చెప్పారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి11:58 PM (IST) Apr 10
అమెరికా సుంకాలు పెంచుతుండటంతో, వాణిజ్య ఒత్తిడిని ఎదుర్కొనేందుకు EU, ASEANలతో చైనా పొత్తులు పెట్టుకుంటోంది. బహుళ వాణిజ్యాన్ని సమర్థించడం, అమెరికా రక్షణ చర్యల ప్రభావాన్ని పరిష్కరించడంపై చర్చలు జరుగుతున్నాయి.
పూర్తి కథనం చదవండి11:36 PM (IST) Apr 10
RCB vs DC: ఐపీఎల్ 2025లో తన సొంత గ్రౌండ్ లో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు కేఎల్ రాహుల్. అతని 93 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ లలో ఢిల్లీ టీమ్ గెలుపులతో ముందుకు సాగింది.
11:35 PM (IST) Apr 10
తెలుగు రాష్ట్రాలకు భూకంప ప్రమాదం పొంచివుందా? తెలంగాణలో భూప్రకంపనలు మొదలై ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్రకు పాకనున్నాయా? హైదరాబాద్ లో కూడా భూమి కంపిస్తుందా? అంటే అవుననే అంటోంది Epic సంస్థ. భూకంపం కేంద్రం ఎక్కడ ఉండనుంది? ఏఏ ప్రాంతాల్లో భూమి కంపిస్తుంది? అనేది ప్రకటించింది ఈ ఎపిక్.
పూర్తి కథనం చదవండి11:01 PM (IST) Apr 10
PM Mudra Yojana: ప్రధాన్ మంత్రి ముద్రా యోజన పథకం 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీని ప్రయోజనాలు అందుకున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే, ముద్రా లోన్ ఎవరికి ఎంత వస్తుంది? మీకు ఎంత వస్తుంది? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి10:54 PM (IST) Apr 10
సదానంద్ దాతే... నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (NIA) డైరెక్టర్ జనరల్. అమెరికా నుండి ఇండియాకు తీసుకువచ్చిన 26/11 ముంబై ఉగ్రదాడిలో కీలక సూత్రధారి తహవ్వుర్ రాణాను విచారించేది ఈయనే. గతంలో ఈ ముంబై దాడులను కూడా ధైర్యంగా ఎదుర్కొన్న పోలీస్ అధికారి ఈయన. ఆయనే ఇప్పుడు ఎన్ఐఏ చీఫ్ హోదాలో ముంబై దాడుల ఉగ్రవాదిని విచారించడం ఆసక్తికరం.
పూర్తి కథనం చదవండి10:12 PM (IST) Apr 10
IPL 2025 CSK: రుతురాజ్ గైక్వాడ్ మోచేయి గాయం కారణంగా ఐపీఎల్ 2025కి దూరం కావడంతో చెన్నై సూపర్ కింగ్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గైక్వాడ్ లేకపోవడంతో ఎంఎస్ ధోని మళ్లీ సీఎస్కే కెప్టెన్ గా తిరిగివచ్చాడు. ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ 2010, 2011, 2018, 2021, 2023లో ఐపీఎల్ టైటిళ్లను సాధించింది. ధోని కెప్టెన్సీలో మరోసారి అదే జోరును కొనసాగించాలని సీఎస్కే భావిస్తోంది.
09:53 PM (IST) Apr 10
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలకు అండగా నిలిచే పథకాలను అమలు చేస్తున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు రైతులకు ప్రతిఏటా పెట్టుబడి సాయం చేస్తున్నాయి... మోదీ సర్కార్ కూడా చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సాయం చేస్తోంది. అయితే మీకు అన్ని అర్హతలు ఉండి పిఎం కిసాన్ డబ్బులు రావట్లేదా? అయితే కారణమేంటో తెలుసుకోవడం, పరిష్కరించుకోవడం ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి08:43 PM (IST) Apr 10
Uttarakhand Flash Flood : భారతదేశంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఓవైపు మండుటెండలు కాస్తుంటే మరోవైపు వర్షాలు, వరదలు సంభవిస్తున్నాయి. ఇలా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ తో పాటు వివిధ రాష్ట్రాల్లో ఎండా వాన పరిస్థితులు ఉన్నాయి. ఉత్తరాఖండ్ లో అయితే ఏకంగా వరదలే సంభవించి ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రస్తుత చమోలి జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో తెలుసా?
పూర్తి కథనం చదవండి08:15 PM (IST) Apr 10
Kareena Kapoor’s Dance at Karachi Party: పాకిస్తాన్‌లో జరిగిన రేవ్ పార్టీలో కరీనా కపూర్ కనిపించారు. ఎవరో ఈ బాలీవుడ్ బ్యూటీని పాక్ పార్టీకి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అది వారు ఊహించినంత గ్లామ్‌గా జరగలేదు. కరాచీ పార్టీ నుండి ఇప్పుడు వైరల్ అవుతున్న క్లిప్‌లో కరీనా పెద్ద స్క్రీన్‌పై బిగ్గరగా వస్తున్న మ్యూజిక్ కు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అయితే, ఇది రియల్ గా కాదు.. ఆమెకు సరిపోలని పేలవమైన యానిమేషన్ అవతార్. ఇప్పుడు ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి.
08:15 PM (IST) Apr 10
Kareena Kapoor’s Dance at Karachi Party: పాకిస్తాన్‌లో జరిగిన రేవ్ పార్టీలో కరీనా కపూర్ కనిపించారు. ఎవరో ఈ బాలీవుడ్ బ్యూటీని పాక్ పార్టీకి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అది వారు ఊహించినంత గ్లామ్‌గా జరగలేదు. కరాచీ పార్టీ నుండి ఇప్పుడు వైరల్ అవుతున్న క్లిప్‌లో కరీనా పెద్ద స్క్రీన్‌పై బిగ్గరగా వస్తున్న మ్యూజిక్ కు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అయితే, ఇది రియల్ గా కాదు.. ఆమెకు సరిపోలని పేలవమైన యానిమేషన్ అవతార్. ఇప్పుడు ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి.
07:43 PM (IST) Apr 10
పామును చూస్తేనే చాలామంది భయంతో వణికిపోతారు. అలాంటిది అత్యంత విషపూరిత పాములతో పోరాడి ప్రాణాలు దక్కించుకునే జంతువులు కొన్ని ఉన్నాయి. వీటిలో ముంగీస గురించి చాలామందికి తెలుసు. మరి మిగతా జంతువులేవో తెలుసా? ఇలా పామువిషం పనిచేయని జంతువుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి07:10 PM (IST) Apr 10
India’s First Private Railway Station: దేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ రైల్వే స్టేషన్ అయిన రాణి కమలాపతి స్టేషన్ లో పెద్ద కవర్డ్ పార్కింగ్ విభాగం, 24X7 పవర్ బ్యాకప్, తాగునీరు, ఎయిర్ కండిషన్డ్ లాబీ, కార్యాలయాలు, దుకాణాలు, హై స్పీడ్ ఎస్కలేటర్, లిఫ్ట్, యాంకర్ స్టోర్లు, ఆటోమొబైల్ షోరూమ్‌లు, కన్వెన్షన్ సెంటర్, హోటళ్ళు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి.
06:58 PM (IST) Apr 10
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలుచుకునే బెంగళూరు పట్టణంలో మరో ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి రానుంది. పెరుగుతోన్న అవసరాలకు అనుగుణంగా నగరంలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం రావాలని చాలా రోజుల నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎట్టకేలకు ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు నగరంలో పలు స్థలాలను పరిశీలించారు. ఈ వివరాలను పరిశ్రమల శాఖ మంత్రి ఎంబి పాటిల్ గురువారం మీడియాకు తెలిపారు.
06:50 PM (IST) Apr 10
AR Rahman Made Bharathiraja a Singer: సంగీత సంచలనం ఏ.ఆర్.రెహమాన్ సంగీతంలో చాలా మంది సింగర్లు పరిచయం అయ్యారు. రెహమాన్ నటులు, దర్శకులను కూడా సింగర్స్ గా మార్చాడు. ఆ లిస్టులో భారతీరాజా కూడా ఉన్నారు. ఆయన పాడిన పాట ఏదో తెలుసా?
పూర్తి కథనం చదవండి06:32 PM (IST) Apr 10
Chandrababu Naidu: ఏపీ రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు సొంతిళ్లు నిర్మించుకోబోతున్నారు. దీనికి సంబంధించి బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో వెలగపూడి సచివాలయంలో సమీపంలోని ఆయన స్థలంలో భూమిపూజ చేశారు. చంద్రబాబు గత కొన్నేళ్లుగా రాజధాని ప్రాంతం కృష్ణా నది పక్కనే ఉండవల్లి వద్ద ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్, ఆ పార్టీ నాయకులు గత కొంత కాలంగా అనేక విమర్మలు చేస్తున్నారు. చంద్రబాబుకు కనీసం రాజధాని ప్రాంతంలో ఇళ్లు కూడా లేదని, ఈ ప్రాంతంపై ఆయనకు అభిమానం లేదని పదేపదే విమర్శిస్తున్నారు. దీంతో ఎట్టకేలకు ఇల్లు కట్టుకోవాలని చంద్రబాబు, లోకేష్ భావించారు. ఆ ఇంటి ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.
05:01 PM (IST) Apr 10
దాంపత్య జీవితంలో శృంగారం ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కొన్ని సందర్భాల్లో దంపతులు సంభోగంలో పాల్గొన్న సమయంలో గర్భం దాల్చకూడదని భావిస్తుంటారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో కండోమ్స్ ఉపయోగిస్తారు. లేదంటే గర్భనిరోధక మాత్రలను వాడుతారు. అయితే గర్భనిరోధక మాత్రలు కేవలం మహిళలకు మాత్రమే పరిమితమనే విషయం తెలిసిందే. కానీ త్వరలోనే పురుషుల కోసం కూడా గర్భనిరోధక మాత్రం అందుబాటలో రానున్నాయని మీకు తెలుసా.?
04:46 PM (IST) Apr 10
Dark Chocolate: పిల్లలు చాక్లెట్లు తింటానంటే ఏ తల్లిదండ్రలు ససేమిరా ఒప్పుకోరు. అయితే.. ఈ వార్తను అలాంటి తల్లిదండ్రులందరూ చదవాల్సిందే. చాక్లెట్ల వల్ల కలిగే నష్టాల గురించి ఇప్పటి వరకు పేరెంట్స్ తెలుసుకుని ఉంటారు. కానీ చాక్లెట్ల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారండీ. ఈ వార్త చదివి అవేంటీ మీతోపాటు.. మీ పేరెంట్స్‌కి కూడా చెప్పండి మరీ..
పూర్తి కథనం చదవండి
03:43 PM (IST) Apr 10
వేసవి సెలవులపై తెెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఎప్పట్లా కాకుండా ఈసారి కాస్త ముందుగానే సమ్మర్ హాలిడేస్ ఇచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారికంగా వేసవి సెలవులపై ప్రకటన చేసింది. ఇంతకూ ఎప్పటినుండి సెలవులు ఇస్తున్నారో తెలుసా?
పూర్తి కథనం చదవండి03:13 PM (IST) Apr 10
విజయ్ టీవీలో ప్రసారమైన లోల్లు సభ కార్యక్రమం ద్వారా పేరుగాంచిన లోల్లు సభ ఆంటోనీ అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన సంఘటన దిగ్భ్రాంతిని కలిగించింది.
పూర్తి కథనం చదవండి02:54 PM (IST) Apr 10
Aagadu Flop: మహేష్ బాబుతో దూకుడు సినిమాతో రికార్డులు కొల్లగొట్టిన డైరెక్టర్ శ్రీనువైట్ల. తనదైన కామెడీ టైమింగ్‌తో సినిమాలను తీసి ఆడియన్స్ నుంచి ఒకప్పుడు చప్పట్లు కొట్టించుకున్నారు. కామెడీకి కేరాఫ్ అడ్రస్, బ్రాండ్ అంబాసిడర్‌గా ఓ వెలుగువెలిగారు శ్రీనువైట్ల. అయితే.. ఆగడు సినిమా డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ శ్రీనువైట్ల సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. అయితే... ఆ సినిమా ప్లాప్ కావడానికి ఓ కారణం తానేనని తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ ఆ విషయంలో గిల్టీగా ఫీలవుతున్నట్లు వెల్లడించారు. అసలు ఎవరా డైరెక్టర్, ఏంటా కథ తెలుసుకుందామా?
02:42 PM (IST) Apr 10
యూపీఐ సేవల రాకతో ఆర్థిక లావాదేవీల తీరు పూర్తిగా మారిన విషయం తెలిసిందే. ఒకప్పుడు వేరే వారికి డబ్బులు పంపాలంటే బ్యాంకుకు వెళ్లి, లైన్‌లో నిలబడి ఇలా పెద్ద తతంగం ఉండేది. అయితే ప్రస్తుతం ఒక చిన్న క్లిక్‌తో ఒకరి ఖాతాలో నుంచి మరొకరి ఖాతాల్లోకి డబ్బులు వెళ్లిపోతున్నాయి. గూగుల్‌పే, ఫోన్‌పే వంటి వాటికి ఆదరణ పెరిగిపోయింది. అయితే ఇలాంటి యాప్స్‌లో మనకు తెలియని కొన్ని బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక మంచి ఫీచర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
02:14 PM (IST) Apr 10
పాన్ మసాలా యాడ్స్‌లో నటించేందుకు కోట్లు ఇస్తామన్నా వద్దన్న టాప్ 5 ఇండియన్ యాక్టర్స్ గురించి ఈ కథనంలో తెలుసుకోండి.
పూర్తి కథనం చదవండి01:51 PM (IST) Apr 10
భారతదేశంలో చాలా దేవాలయాలు ఎత్తైన కొండలు, పర్వతప్రాంతాల్లో ఉన్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో భారీ పర్వతాలమధ్య దేవాలయాలను చూస్తుంటాం. అంతెందుకు తెలుగు రాష్ట్రాల్లోనే తిరుమలలో ఏడుకొండలు, యాదగిరిగట్టపై దేవాలయాలున్నాయి. ఇలా దేవుళ్లు కొండలపైనే వెలియడానికి కారణమేంటో తెలుసా?
పూర్తి కథనం చదవండి01:26 PM (IST) Apr 10
తాజాగా భారత భారతీయ స్టాక్ మార్కెట్‌లో ఒక కంపెనీ గురించి చాలా చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఈ కంపెనీలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు రావడం ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఏంటా కంపెనీ.? స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీ గేమ్ ఛేంజర్‌గా ఎలా మారనుంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
12:57 PM (IST) Apr 10
TDP Suspends Chebrolu Kiran: రాజకీయాల్లో లేని మహిళలు, రాజకీయ నాయకుల ఇంట్లోని మహిళల పట్ల దిగజారి మాట్లాడటం సామాజిక మాధ్యమాల్లో గత కొంతకాలంగా పెచ్చుమీరుతోంది. రానురాను మహిళలను కించపరిచేలా శృతిమించి వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారుతోంది. ఈక్రమంలో ఐ-టీడీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్త చేబ్రోల్ కిరణ్.. ఏపీ మాజీ సీఎం జగన్ సతీమణి భారతిపై ఇటీవల పలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. వెంటనే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అసలు ఈ కిరణ్ ఎవరు, ఇతనిపై పార్టీ ఎందుకు చర్యలు తీసుకుంది అన్న విషయం చూద్దాం.
12:27 PM (IST) Apr 10
రైడ్ 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అజయ్ దేవగన్, వాణి కపూర్ మెరిశారు. రాబోయే రైడ్ 2 సినిమాను సెలెబ్రేట్ చేసుకున్నారు.
పూర్తి కథనం చదవండి12:12 PM (IST) Apr 10
మారుతోన్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ సైతం మారుతోంది. ముఖ్యంగా ఇంటర్నెట్ వేగం రోజురోజుకీ పెరిగిపోతోంది. 5జీ సేవలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. అయితే సమద్ర గర్భంలో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుంది. దీనిని సాకారం చేశారు. అండమాన్ నికోబార్ దీవుల్లో నీటి అడుగున 4G సిగ్నల్ రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది ఎలా సాధ్యమైంది.? దీని వల్ల ఉపయోగాలు ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి11:33 AM (IST) Apr 10
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఎప్పుడు ఏదో ఒక అలజడి. 'అమెరికా ఫస్ట్' అనే నినాదంతో గద్దెనెక్కిన ట్రంప్ చర్యలు ప్రపంచాన్నే కాకుండా ఆ దేశ ప్రజలను కూడా విస్మయానికి గురి చేస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశానికి అధ్యక్షుడిలా ట్రంప్ వ్యవహారశైలి లేదంటూ విమర్శలు వస్తున్నాయి. మొన్నటి వరకు సుంకాలతో ప్రపంచాన్ని భయపెట్టిన ట్రంప్ తాజాగా మరో వివాదాస్పదమైన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులను టార్గెట్ చేశారు. ఇంతకీ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఏంటంటే..
11:22 AM (IST) Apr 10
Mohan Babu: ప్రముఖ నటుడు మోహన్‌బాబుకు హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ కోర్డు షాకిచ్చింది. గతంలో ఆయన వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుతో అతని చిన్న కుమారుడు మంచు మనోజ్‌కు ఊరట లభించింది. ఇక నిన్నంతా జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటి ఎదుట మనోజ్ బైటాయించి ధర్నా చేసిన సంగతి తెలిసిందే. మోహన్‌బాబు రీసెంట్‌గా మనోజ్ తన ఇంటికి రావడానికి వీలులేదని కోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో మనోజ్‌ని బుధవారం ఆయన ఇంటికి వెళ్లేందుకు అక్కడి సెక్యూరిటీ అనుమతించలేదు. దీంతో అతను ఏం చేశాడంటే..
10:13 AM (IST) Apr 10
పొడవాటి జుట్టు ఉన్న అమ్మాయిలకు ఓపిక ఎక్కువ అంటుంటారు. ఓపికే కాదు.. ఆడవాళ్లలో జుట్టు పొడుగ్గా పెరిగితే అందం కూడా రెట్టింపు అవుతుంది. మరి ఆ జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగాలంటే ఏం చేయాలి? బయోటిన్ అధికంగా ఉంటే ఆహారం తీసుకోవాలి. అది ఎందులో పుష్కలంగా ఉంటుందో మీకు తెలుసా?
పూర్తి కథనం చదవండి10:12 AM (IST) Apr 10
మీకు కారు లేదా బైక్ ఉందా.? అయితే మీ కోసమే ఈ వార్త. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ రవాణా వాఖ బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 30వ తేదీలోపు కార్లు, బైకులకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ లేకపోతే కేసులు నమోదు కావడం ఖాయమని అధికారులు తెలిపారు. ఇంతకీ ఏంటీ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్.? దీనిని ఎందుకు తీసుకొచ్చారు.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
09:42 AM (IST) Apr 10
అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ఇవాళ రిలీజ్ అయింది. సినిమా చూసేందుకు వచ్చిన అభిమానులకు హాల్స్ మిఠాయి పంచుతున్నారు.
పూర్తి కథనం చదవండి09:20 AM (IST) Apr 10
మెగాస్టార్ చిరంజీవికి డ్యాన్స్ అంటే ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. తన కెరీర్ లో చిరంజీవి డ్యాన్స్ విషయంలో వెనక్కి తగ్గిన సందర్భాలు లేవు. ఎంతటి కష్టమైన డ్యాన్స్ మూమెంట్ అయినా చిరు అలవోకగా చేస్తారు. అలాంటి చిరంజీవి కూడా ఒక సందర్భంలో డ్యాన్స్ చేయలేక సొమ్మసిల్లి పడిపోయారట.
పూర్తి కథనం చదవండి09:04 AM (IST) Apr 10
అమ్మాయి అందం చూడగానే అబ్బాయి టపీమని పడిపోతాడు. గుణగణాలూ నచ్చితే తన సొంతం చేసుకోవాలని తపిస్తాడు. మరి ఆడవాళ్లు మగవాళ్లలో ఏం కోరుకుంటారో తెలుసా? ఆచార్య చాణక్యుడు ఇదే విషయంపై వివరంగా చెప్పారు. ఆయన విశ్లేషణ ప్రకారం అమ్మాయిలు అబ్బాయిలో ఏం చూసి ఆకర్షితులవుతారో తెలుుసుకుందాం..
పూర్తి కథనం చదవండి08:40 AM (IST) Apr 10
ప్రతీకార సుంకాలతో ప్రపంచంపై ఒక్కసారిగా దాడి చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇతర దేశాలపై అమలు చేయనున్నట్లు ప్రకటించిన సుంకాలను 90 రోజులపాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే చైనా విషయంలో మాత్రం తగ్గేదేలా అని తేల్చి చెప్పారు. ఇంతకీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు.? అసలు తెర వెనకాల ఏం జరిగింది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తి కథనం చదవండి