MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Andhra Pradesh
  • TDP Suspends Chebrolu Kiran: సొంత పార్టీ కార్యకర్తపై టీడీపీ వేటు.. కారణం తెలిస్తే మీరూ ఇతన్ని తంతారు!

TDP Suspends Chebrolu Kiran: సొంత పార్టీ కార్యకర్తపై టీడీపీ వేటు.. కారణం తెలిస్తే మీరూ ఇతన్ని తంతారు!

TDP Suspends Chebrolu Kiran: రాజకీయాల్లో లేని మహిళలు, రాజకీయ నాయకుల ఇంట్లోని మహిళల పట్ల దిగజారి మాట్లాడటం సామాజిక మాధ్యమాల్లో గత కొంతకాలంగా పెచ్చుమీరుతోంది. రానురాను మహిళలను కించపరిచేలా శృతిమించి వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారుతోంది. ఈక్రమంలో ఐ-టీడీపీకి చెందిన సోషల్‌ మీడియా కార్యకర్త చేబ్రోల్ కిరణ్‌.. ఏపీ మాజీ సీఎం జగన్ సతీమణి భారతిపై ఇటీవల పలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీడీపీ అధిష్టానం సీరియస్‌ అయ్యింది. వెంటనే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అసలు ఈ కిరణ్‌ ఎవరు, ఇతనిపై పార్టీ ఎందుకు చర్యలు తీసుకుంది అన్న విషయం చూద్దాం.   

Bala Raju Telika | Updated : Apr 10 2025, 02:17 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
TDP has suspended social media activist Chebrolu Kiran

TDP has suspended social media activist Chebrolu Kiran

చేబ్రోల్ కిరణ్‌ అనే వ్యక్తి ఓ యూట్యూబ్‌ ఛానల్‌ నడుపుతూ.. కొన్నేళ్లుగా టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. వైసీపీని విమర్శించే విశ్లేషకులు, సీమరాజ వంటి వారితో ఇంటర్వ్యూలు చేస్తుంటాడు. ఎన్నికల సమయంలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ సోషల్‌ మీడియాలో అనేక వీడియోలు పెట్టాడు. ఈ మధ్యకాలంలో ఇతనికి ఏమైందో ఏమో కానీ.. మాజీ సీఎం జగన్‌ సతీమణి.. వైఎస్‌ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమెను కించపరిచే విధంగా మాట్లాడటం, ఆరోపణలు చేయడంతో ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

25
cbn met with party mps

cbn met with party mps

వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసి తర్వాత కిరణ్‌ ఓ వీడియో చేసి అందులో క్షమాపణలు కూడా చెప్పాడు. అయినా కూడా టీడీపీ అధిష్టానం అతని తప్పుని క్షమించలేదు. ఇక టీడీపీ తీసుకున్న ఈ నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. మహిళలను అవమానించేలా మాట్లాడే ప్రతి ఒక్కరినీ పార్టీ, కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని పార్టీలు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 

35
nara lokesh with bala krishna

nara lokesh with bala krishna

కిరణ్‌ వ్యాఖ్యలపై టీడీపీ సీరియస్‌ అయ్యింది. మహిళలను కించపరిచేలా మట్లాడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పింది. పార్టీ నుంచి కిరణ్‌ను సస్పెండ్‌ చేసింది. అంతటితో ఆగకుండా అతనిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు పలువురు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గుంటూరు పోలీసులు కిరణ్‌పై కేసు కూడా పెట్టారు. 

 

 

45
cbn with bhuvaneswari

cbn with bhuvaneswari

ఇలాంటి వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్తకాదు. వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ .. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సతీమణి భవనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అందరికీ తెలిసిందే. ఇవి గత ఎన్నికల్లో తీవ్ర దుమారం రేపాయి. ఇటీవల వంశీని పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలో కూడా టీడీపీ నాయకులు అతనిపై తీవ్రంగా విమర్శలు చేశారు.

 

55
TDP suspended social media activist Kiran

TDP suspended social media activist Kiran

రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు, కుటుంబంలోని  మహిళలను కించపరిచే విధంగా ఎవరు చేసినా అది ఆ పార్టీలకు చెడ్డ పేరు తీసుకొస్తాయని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. సొంత పార్టీ కార్యకర్తపై వేటు వేస్తూ.. టీడీపీ తీసుకున్న కఠిన వైఖరిని ఇతర పార్టీ నేతలు కూడా అమలు చేస్తే.. కొంత వరకైనా వ్యక్తిగత దూషణలు ఆగే పరిస్థితి ఉంటుంది. ఆ దిశగా నాయకులు అడుగులు వేస్తారో లేదో చూద్దాం. 

Bala Raju Telika
About the Author
Bala Raju Telika
తెలిక బాలరాజు ఈనాడు పత్రికలో 8 సంవత్సరాలు సబ్ ఎడిటర్ రిపోర్టర్‌గా పని చేశారు. అనంతరం News X తదిర వెబ్ సైట్లలో నూ ఫీచర్, న్యూస్, స్పోర్ట్స్ కంటెంట్ క్రియేటర్ గా పని చేశారు. మొత్తం 10 సంవత్సరాల జర్నలిజం అనుభం ఉంది. ఫీచర్స్, స్పోర్ట్స్, రాజకీయాలు, ఎంటర్‌‌టైన్మెంట్ ఇలా ఏ రంగానికి సంబంధించిన వార్తలైనా, ఫీచర్లైనా రాయడం బాలరాజు ప్రత్యేకత. Read More...
ఆంధ్ర ప్రదేశ్
నారా చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
వైఎస్ జగన్మోహన్ రెడ్డి
జనసేన
పవన్ కళ్యాణ్
వై. ఎస్. షర్మిల
 
Recommended Stories
Top Stories