Birth control: ఇక కండోమ్‌లతో పనిలేదు.. మగవారికి కూడా అవి అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.
దాంపత్య జీవితంలో శృంగారం ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కొన్ని సందర్భాల్లో దంపతులు సంభోగంలో పాల్గొన్న సమయంలో గర్భం దాల్చకూడదని భావిస్తుంటారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో కండోమ్స్ ఉపయోగిస్తారు. లేదంటే గర్భనిరోధక మాత్రలను వాడుతారు. అయితే గర్భనిరోధక మాత్రలు కేవలం మహిళలకు మాత్రమే పరిమితమనే విషయం తెలిసిందే. కానీ త్వరలోనే పురుషుల కోసం కూడా గర్భనిరోధక మాత్రం అందుబాటలో రానున్నాయని మీకు తెలుసా.?
- FB
- TW
- Linkdin
Follow Us
)
Couple with Condom
గర్భం దాల్చకుండా ఉండాలంటే మెజారిటీ సమయాల్లో మహిళలు గర్భనిరోధక మాత్రలు ఉపయోగిస్తుంటారు. శారీరకంగా కలిసి దాదాపు మూడు రోజుల తర్వాత కూడా ఈ మాత్రలు పనిచేస్తాయి. అయితే ప్రస్తుతం ఇలాంటి పిల్స్ కేవలం మహిళలకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ త్వరలోనే ఇలాంటి ట్యాబ్లెట్స్ పురుషులకు కూడా అందుబాటులోకి రానున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ దిశగా ఇప్పటికే ప్రయోగాలు సైతం జరుగుతున్నాయి.
అమెరికాలోని శాస్త్రవేత్తలు YCT-529 అనే హార్మోన్ రహిత గర్భనిరోధక మాత్రను పురుషులపై పరీక్షించడం ప్రారంభించారు. ఇది వృషణాలకు విటమిన్ ఎ యాక్సెస్‌ను నిరోధించడం ద్వారా పనిచేస్తుంది. అలాగే స్పెర్మ్ ఉత్పత్తి కాకుండా నిరోధిస్తుంది, కానీ ఇది టెస్టోస్టెరాన్ స్థాయిలను ప్రభావితం చేయదు, అంటే ఇది లిబిడోపై ఎటువంటి ప్రభావం చూపదన్నమాట. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం YCT-529ని ఎలుకలపై పరీక్షించారు. ఈ మెడిసిన్‌తో 99 శాతం గర్భాన్ని నివారిస్తుంది గుర్తించారు. ఇది స్త్రీ గర్భనిరోధక ఔషధానికి సమానంగా పనిచేస్తుంది. మరో ఐదేళ్లలో ఈ ట్యాబ్లెట్ అందుబాటులోకి వస్తుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎలుకల తర్వాత, దీనిని మనుషులపై కూడా పరీక్షించేందుకు సన్నద్ధమవుతున్నారు. మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్రవేత్త, ఫార్మసిస్ట్ గుండా జార్జ్ మాట్లాడుతూ.. ఈ ట్యాబ్లెట్ పురుషులకు సురక్షితమైన, ప్రభావవంతమైన పరిష్కారం అని, ఇది జంటలకు కుటుంబ నియంత్రణ కోసం ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం పురుషులు తమ భాగస్వామికి గర్భం దాల్చకుండా ఉండేందుకు రెండు విధానాలు మాత్రమే ఉన్నాయి. వీటిలో ఒకటి కండోమ్ కాగా మరొకటి స్టెరిలైజేషన్. దీనిని స్నిప్ అని కూడా పిలుస్తారు. గర్భనిరోధకాలను ఉపయోగించే స్త్రీలలో దాదాపు నాలుగింట ఒక వంతు మంది గర్భనిరోధక మాత్రలను ఉపయోగిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు పురుషులకు అలాంటి అవకాశం లేదు. అందుకే ఈ దిశగా అడుగులు పడ్డాయి.
మగ ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో ఈ ఔషధం మగ ఎలుకలో వంధ్యత్వానికి కారణమవుతుందని గుర్తించారు. అయితే ఆ తర్వాత ఇది సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపదని పరిశోధకులు గ్యారెంటీ ఇస్తున్నారు. కేవలం రెండు వారాలు స్పెర్మ్ కౌంట్‌ను తగ్గించి మళ్లీ ఔషధాన్ని మానేయగానే ఎలుకల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పెరిగినట్లు కనుగొన్నారు. మరి ఈ మాత్రలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో చూడాలి.