MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Telangana
  • Telangana: మీకు కారు లేదా బైక్‌ ఉందా? సెప్టెంబర్‌ 30లోపు ఈ పని చేయకపోతే.. కేసు నమోదవ్వడం ఖాయం.

Telangana: మీకు కారు లేదా బైక్‌ ఉందా? సెప్టెంబర్‌ 30లోపు ఈ పని చేయకపోతే.. కేసు నమోదవ్వడం ఖాయం.

మీకు కారు లేదా బైక్‌ ఉందా.? అయితే మీ కోసమే ఈ వార్త. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ రవాణా వాఖ బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్‌ 30వ తేదీలోపు కార్లు, బైకులకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌ లేకపోతే కేసులు నమోదు కావడం ఖాయమని అధికారులు తెలిపారు. ఇంతకీ ఏంటీ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌.? దీనిని ఎందుకు తీసుకొచ్చారు.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.  

2 Min read
Author : Narender Vaitla
Published : Apr 10 2025, 10:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఇప్పటి వరకు వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌ (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) లేకున్నా అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. 2019 ఏప్రిల్‌ ఒకటో తేదీ తర్వాత తయారైన వాహనాలకు మాత్రమే ఈ నిబంధన అమల్లో ఉండేది అయితా తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 2019 ఏప్రిల్‌ ఒకటికి ముందు తయారైన వాహనాలకు కూడా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

టూ వీలర్‌, ఫోర్‌ వీలర్‌, త్రీ వీలర్‌ ఇలా అన్ని వాహనాలకు ఇకపై హెచ్‌ఎస్‌ఆర్‌పీ ఉండాల్సిందేనన్నమాట. నిజానికి ఇది వరకే సుప్రీం కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. మరీ ముఖ్యంగా 2019కి ముందు వాహనాలకు ఈ నంబర్‌ ప్లేట్లు లేకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన సర్వోన్నత న్యాయస్థానం కీలక సూచనలు చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 

35

చివరి తేదీ ఎప్పుడంటే.? 

అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్లు అమర్చుకోవడానికి 2025 సెప్టెంబర్‌ 30వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. ఆ తర్వాత హెచ్‌ఎస్‌ఆర్‌పీ ప్లేట్స్‌ లేకుండా రోడ్డెక్కే వాహనాలపై కేసు నమోదు చేస్తారు. అలాగే హెచ్‌ఎస్‌ఆర్‌పీ లేని వాహనాలకు పొల్యుషన్‌, ఇన్సూరెన్స్‌, ఫిట్‌నెస్‌ వంటి సేవలను అందించరు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? 

పాత వాహనదారులు ఈ నెంబర్‌ ప్లేట్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం www.siam.in వెబ్‌సైట్ సందర్శించాలని రవాణాశాఖ తెలిపింది. వాహనాన్ని బట్టి ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. 
 

45

హైస్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్ల ఏర్పాటుకు చార్జీలు ఇలా ఉంటాయి.? 

* ద్విచక్రవాహనం రూ. 320 - రూ. 380 

* ఇంపోర్ట్‌ చేసుకున్న ద్విచక్రవాహనం రూ. 400 - రూ. 500

* ఫోర్‌ వీలర్‌కు రూ. 590 - రూ. 700

* ఇంపోర్ట్‌ చేసుకున్న ఫోర్‌ వీలర్‌ వెహికిల్‌కు రూ. 700 - రూ. 860.

* మూడు చక్రాల వాహనం రూ. 350 - రూ. 450 

* కమర్షియల్ వెహికిల్స్‌కు రూ. 600 - రూ. 800 
 

55
tollgate atrocity

tollgate atrocity

అసలీ నెంబర్‌ ప్లేట్ల ఉద్దేశం ఏంటి.? 

హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్లను అమలు చేయడానికి పెద్ద కారణమే ఉంది. ఈ నెంబర్లను ఉపయోగించడం ద్వారా నకిలీ నంబర్‌ ప్లేట్లకు అడ్డుకట్ట వేయొచ్చు. దొంగతనాలను అరికట్టవచ్చు. అలాగే వాహనాలకు రహదారి భద్రత లభిస్తుంది. ఇలాంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు ఈ నిబంధనను తీసుకొచ్చింది. 2019 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి తయారైన వాహనాలకు హెచ్‌ఎస్‌ఆర్‌పీ నిబంధనల ఇప్పటికే అమల్లో ఉంది. అయితే తాజాగా పాత వాహనాలకు కూడా దీనిని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 
 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఓవ‌ర్ టూ ఢిల్లీ.. హ‌స్తినాలో హీటెక్కుతోన్న తెలంగాణ రాజ‌కీయం. అస‌లేం జ‌రుగుతోంది.?
Recommended image2
తెలంగాణ‌లో మ‌ళ్లీ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌..? కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన హైకోర్టు
Recommended image3
హైద‌రాబాద్‌కి 70 కి.మీల దూరంలో.. ఇప్పుడు పెట్టుబ‌డి పెడితే డ‌బుల్‌ కావ‌డం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved