MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • International
  • USA: అమెరికాలో భయంభయంగా తెలుగు విద్యార్థులు.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసినా వీసా రద్దు.

USA: అమెరికాలో భయంభయంగా తెలుగు విద్యార్థులు.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసినా వీసా రద్దు.

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఎప్పుడు ఏదో ఒక అలజడి. 'అమెరికా ఫస్ట్‌' అనే నినాదంతో గద్దెనెక్కిన ట్రంప్‌ చర్యలు ప్రపంచాన్నే కాకుండా ఆ దేశ ప్రజలను కూడా విస్మయానికి గురి చేస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశానికి అధ్యక్షుడిలా ట్రంప్‌ వ్యవహారశైలి లేదంటూ విమర్శలు వస్తున్నాయి. మొన్నటి వరకు సుంకాలతో ప్రపంచాన్ని భయపెట్టిన ట్రంప్‌ తాజాగా మరో వివాదాస్పదమైన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులను టార్గెట్‌ చేశారు. ఇంతకీ ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయం ఏంటంటే.. 
 

Narender Vaitla | Published : Apr 10 2025, 11:33 AM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
USA Green Card

USA Green Card

అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతానని ప్రకటించిన ట్రంప్‌ అందుకు అనుగుణంగానే వేలాది మంది విదేశీయులను తమ దేశాలకు పంపిచేశాడు. కాళ్లకు బేడీలు వేసి మరీ ప్రత్యేక యుద్ధ విమానాల్లో తరలించారు. ఇక ఆ తర్వాత సుంకాల పేరుతో ప్రపంచాన్ని భయపెట్టారు. ప్రపంచదేశాలపై ఇష్టా రాజ్యంగా సుంకాలను విధించారు. అయితే ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన ట్రంప్‌ తాజాగా మరో బాంబ్‌ పేల్చారు. ఈసారి అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థుల వంతు వచ్చింది. 

అమెరికాలో చదువు పూర్తయిన వారు మూడేళ్లపాటు ఉండి ఉద్యోగం వెతుక్కునేందుకు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్‌ (ఓపీటీ) అనే అవకాశాన్ని కల్పిస్తుంది అమెరికా ప్రభుత్వం. ఈ మూడేళ్లలో ఉద్యోగం వస్తే సదరు కంపెనీ తరఫున హెచ్‌1బీ వీసా వస్తుంది. ఒకవేళ ఉద్యోగం రాకపోతే అమెరికా వీడిపోవాల్సిందే. అయితే ట్రంప్‌ ఓపీటీ అనుమతిని పూర్తి రద్దు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఏకంగా బిల్లు తేవాలని ఆలోచిస్తున్నారు.
 

24
Asianet Image

ట్రంప్‌ నిర్ణయంతో లక్షలాది మంది విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ బిల్లు ద్వారా దాదాపు 3 లక్షల మంది భారతీయ విద్యార్థులు కష్టాలను ఎదుర్కోనున్నారు. ఆ బిల్లును సభలో పెట్టి ఆమోదిస్తే.. వారంతా భారత్‌కు తిరిగి రావాల్సి ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్‌ రంగాల్లో (స్టెమ్‌) చదువుకునే అంతర్జాతీయ విద్యార్థులు.. ఓపీటీ అనుమతి పొందడానికి అవకాశముంటుంది. వీరిలో తెలుగు విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఉంటారు.

ఒకవేళ ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే పరిస్థితి ఏంటని అటు విద్యార్థులతో పాటు ఇటు ఇండియాలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం పొందలేని వారు అమెరికాను వీడాల్సి వస్తుంది.  దీనివల్ల విద్యార్థుల కెరీర్‌ దెబ్బతింటుంది. అమెరికాలో ఉద్యోగం చేయాలన్న డాలర్‌ డ్రీమ్‌ చెదిరిపోతుంది. 
 

34
h1b visa

h1b visa

హెచ్‌1బీ ఉన్నా భయం తప్పేలా లేదు:

హెచ్‌1బీ వీసా ఉంది బిందాస్‌గా ఉండొచ్చన్న నమ్మకం కూడా లేదు. ఒక్కసారి అమెరికా బయటకు వెళ్తే మళ్లీ దేశంలోకి రావడం అంత సులభమైన విషయం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విదేశాలకు వెళ్లి తిరిగి అమెరికా వస్తున్న హెచ్‌1బీ వీసా దారులను అధికారులు ప్రశ్నిస్తున్న తీరు దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఇప్పటికే సిలికాన్‌ వ్యాలీలోని ప్రముఖ కంపెనీలన్నీ తమ ఉద్యోగులు దేశం విడిచి వెళ్లొద్దని సూచిస్తున్నాయి. దీంతో హెచ్‌1బీ వీసాలున్న భారతీయులు భారత్‌కు వచ్చి వెళ్లాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. 

చివరికి గ్రీన్‌ కార్డులున్నా ఇబ్బందులు:

గ్రీన్‌ కార్డు ఉంటే అమెరికా పౌరసత్వం ఉన్నట్లే ఇక ఎలాంటి టెన్షన్‌ ఉండదు అనుకుంటాం. అయితే ట్రంప్‌ వీరిని కూడా భయపెడుతున్నారు. గ్రీన్‌ కార్డుల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తోంది ట్రంప్‌ సర్కారు. గ్రీన్‌కార్డుదారులు ఇతర దేశాలకు వెళ్లి తిరిగి అమెరికా వచ్చిన సమయంలో విమానాశ్రయాల్లో ప్రశ్నలతో అధికారులు వేధిస్తున్నారు. ఫామ్‌ ఐ-485ను అప్‌డేట్‌ చేశారు. పెళ్లి చేసుకున్నాక గ్రీన్‌ కార్డుకు దరఖాస్తు చేసుకున్నవారు ఆర్థిక వనరుల వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. వ్యక్తిగత ఇంటర్వ్యూకూ హాజరుకావాలి. అంతేనా ఆర్థిక సమర్థతను నిరూపించుకోగలగాలి. ఇలా గ్రీన్‌ కార్డు ఉన్న వారికి కూడా ఎన్నో చిక్కుముడులు ఉండనున్నాయి. 
 

44
Donald Trump

Donald Trump

సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చేసిన వీసా నిరాకరణ: 

అమెరికాలోకి వచ్చే వారి విషయంలో అమెరికా మరింత కఠిన నిబంధనలు అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. సోషల్‌ మీడియాలో యూదు వ్యతిరేక పోస్టులు చేసే వారికి వీసాలు, గ్రీన్‌ కార్డులు మంజూరు చేయమని తేల్చి చెప్పింది. ఈ నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. స్టూడెంట్‌ వీసా, గ్రీన్‌కార్డు దరఖాస్తుదారుల సోషల్‌ మీడియా అకౌంట్స్‌పై నిఘా ఉంటుందని యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ తెలిపింది. 

అలాగే హమాస్‌, పాలస్తీనియన్‌ ఇస్లామిక్‌ జిహాద్‌, లెబనాన్‌ హెజ్‌బొల్లా, యెమెన్‌ హూతీల వంటి గ్రూప్‌లకు మద్ధతుగా ఎలాంటి పోస్టులు చేసినా పోస్టులు పెట్టినా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఉగ్రవాద సానుభూతిపరులకు అమెరికాలో స్థానం లేదని, అలాంటివారిని తమ దేశంలోకి రానివ్వాల్సిన, ఇక్కడ ఉంచుకోవాల్సిన అవసరం తమకు లేదని డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ హోంల్యాండ్‌ కార్యదర్శి ట్రికియా మెక్‌లాఫ్లిన్‌ వెల్లడించారు.

Narender Vaitla
About the Author
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు. Read More...
ప్రపంచం
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
డొనాల్డ్ ట్రంప్
భారత దేశం
 
Recommended Stories
Top Stories