MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Business
  • Google Pay: గూగుల్‌ పేలో ట్రాన్సాక్షన్స్ ఎలా డిలీట్‌ చేయాలో తెలుసా.?

Google Pay: గూగుల్‌ పేలో ట్రాన్సాక్షన్స్ ఎలా డిలీట్‌ చేయాలో తెలుసా.?

యూపీఐ సేవల రాకతో ఆర్థిక లావాదేవీల తీరు పూర్తిగా మారిన విషయం తెలిసిందే. ఒకప్పుడు వేరే వారికి డబ్బులు పంపాలంటే బ్యాంకుకు వెళ్లి, లైన్‌లో నిలబడి ఇలా పెద్ద తతంగం ఉండేది. అయితే ప్రస్తుతం ఒక చిన్న క్లిక్‌తో ఒకరి ఖాతాలో నుంచి మరొకరి ఖాతాల్లోకి డబ్బులు వెళ్లిపోతున్నాయి. గూగుల్‌పే, ఫోన్‌పే వంటి వాటికి ఆదరణ పెరిగిపోయింది. అయితే ఇలాంటి యాప్స్‌లో మనకు తెలియని కొన్ని బెస్ట్‌ ఫీచర్లు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక మంచి ఫీచర్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..   

Narender Vaitla | Published : Apr 10 2025, 02:42 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
13
Asianet Image

మనం యూపీఐ యాప్‌ ద్వారా ఎవరెవరికి డబ్బులు పంపించాము. ఎక్కడెక్కడ స్కాన్‌ చేసి పేమెంట్ చేశానమే వివరాలన్నీ ట్రాన్సాక్షన్‌ హిస్టరీలో భద్రంగా ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే కొన్ని సందర్భాల్లో మనం చేసిన లావాదేవీలు ఇతరులకు తెలియకూడదని భావిస్తుంటాం. కానీ హిస్టరీలో ఉన్న మనం చేసిన ట్రాన్సాక్షన్‌ తాలుకూ వివరాలను డిలీట్‌ చేయడం సాధ్యంకాదు. అయితే గూగుల్‌ పేలో హిస్టరీని డిలీట్‌ చేసే అవకాశం ఉందని మీకు తెలుసా.? అదెలాగో స్టెప్‌ బై స్టెప్‌ ప్రాసెస్‌ ఇప్పుడు తెలుసుకుందాం. 
 

23
Asianet Image

* ఇందుకోసం ముందుగా మీ ఫోన్‌లో గూగుల్‌ పే యాప్‌ను ఓపెన్‌ చేయాలి. 

* ఆ తర్వాత ప్రొఫైల్‌లోకి వెళ్లి సెట్టింగ్‌ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. 

* అనంతరం ప్రైవసీ అండ్‌ సెక్యూరిటీ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. 

* అందులో కనిపించే మొదటి ఆప్షన్‌ 'డేటా అండ్‌ పర్సనలైజేషన్‌' ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. 
 

33
Asianet Image

* అనంతరం ఫస్ట్‌ లైన్‌లో కనిపించే గూగుల్‌ అకౌంట్‌పై క్లిక్‌ చేయాలి. 

* ఆ తర్వాత మీ మెయిల్ ఐడీ వివరాలతో గూగుల్‌ అకౌంట్‌లోకి లాగిన్‌ కావాలి. 

* ఇలా లాగిన్‌ అయిన వెంటనే మీరు ఏ రోజు ఎక్కడడెక్కడ పేమెంట్స్‌ చేశారో వివరాలు వస్తాయి. పక్కనే కనిపించే 'X' మార్క్‌ని క్లిక్‌ చేస్తే సరిపోతుంది. మీ ట్రాన్సాక్షన్‌ హిస్టరీలో ఉన్న వివరాలు డిలీట్‌ అవుతాయి. 

నోట్‌: ఈ ఆప్షన్‌ కేవలం గూగుల్‌ పేలో మాత్రమే అందుబాటులో ఉంది. ఫోన్‌పే ఇలా ట్రానాక్షన్‌ వివరాలను డిలీట్‌ చేసే అవకాశం లేదు. కాబట్టి ఎమైనా వ్యక్తిగత లావాదేవీలు ఉంటే గూగుల్‌ పేలో చేసుకొని ఇలా డిలీట్‌ చేసుకోవచ్చన్నమాట. 
 

Narender Vaitla
About the Author
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు. Read More...
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
సాంకేతిక వార్తలు చిట్కాలు
 
Recommended Stories
personal loan: గూగుల్ పే బంపర్ ఆఫర్: రూ.12 లక్షల వరకు పర్సనల్ లోన్.. అంతా ఆన్‌లైన్‌లోనే ప్రాసెస్
personal loan: గూగుల్ పే బంపర్ ఆఫర్: రూ.12 లక్షల వరకు పర్సనల్ లోన్.. అంతా ఆన్‌లైన్‌లోనే ప్రాసెస్
SBI flags Reliance: రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఫ్రాడ్ లోన్.. అంబానీకి ఎస్‌బీఐ, RBI షాక్.. ఏం జరిగింది?
SBI flags Reliance: రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఫ్రాడ్ లోన్.. అంబానీకి ఎస్‌బీఐ, RBI షాక్.. ఏం జరిగింది?
Gold Rate : బంగారం ధర అప్పట్లోగా మరింత తగ్గే ఛాన్స్... ఎప్పుడు కొంటే లాభమో తెలుసా?
Gold Rate : బంగారం ధర అప్పట్లోగా మరింత తగ్గే ఛాన్స్... ఎప్పుడు కొంటే లాభమో తెలుసా?
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved