- Home
- Entertainment
- చిరంజీవి డ్యాన్స్ చేయలేక పడిపోయారు అంటే నమ్మగలరా.. అంత కష్టపడ్డాడు కాబట్టే ఆ మూవీ ఇండస్ట్రీ హిట్
చిరంజీవి డ్యాన్స్ చేయలేక పడిపోయారు అంటే నమ్మగలరా.. అంత కష్టపడ్డాడు కాబట్టే ఆ మూవీ ఇండస్ట్రీ హిట్
మెగాస్టార్ చిరంజీవికి డ్యాన్స్ అంటే ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. తన కెరీర్ లో చిరంజీవి డ్యాన్స్ విషయంలో వెనక్కి తగ్గిన సందర్భాలు లేవు. ఎంతటి కష్టమైన డ్యాన్స్ మూమెంట్ అయినా చిరు అలవోకగా చేస్తారు. అలాంటి చిరంజీవి కూడా ఒక సందర్భంలో డ్యాన్స్ చేయలేక సొమ్మసిల్లి పడిపోయారట.

Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవికి డ్యాన్స్ అంటే ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. తన కెరీర్ లో చిరంజీవి డ్యాన్స్ విషయంలో వెనక్కి తగ్గిన సందర్భాలు లేవు. ఎంతటి కష్టమైన డ్యాన్స్ మూమెంట్ అయినా చిరు అలవోకగా చేస్తారు. డ్యాన్స్ లో మెగాస్టార్ కి ఉన్న గ్రేస్ ఇంకెవరికీ లేదు అని సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తుంటారు. అలాంటి చిరంజీవి కూడా ఒక సందర్భంలో డ్యాన్స్ చేయలేక సొమ్మసిల్లి పడిపోయారట. ఆ సంఘటన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Chiranjeevi
చిరంజీవి డ్యాన్స్ చేయలేక పడిపోయారు అంటే తప్పకుండా బలమైన కారణం ఉండే ఉంటుంది. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్ర షూటింగ్ సమయంలో చిరంజీవి తీవ్రమైన మలేరియా జ్వరంతో భాధపడ్డారట. చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. నిర్మాత రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు. అనుకున్న టైం కి షూటింగ్ పూర్తి చేయకపోతే మూవీ రిలీజ్ వాయిదా పడుతుంది. అందుకే చిత్ర యూనిట్ చాలా కష్టపడ్డారట. షూటింగ్ చివర్లో 'దినక్కు తా' అనే సాంగ్ షూటింగ్ ప్రారంభించారు. అప్పుడే మెగాస్టార్ కి అగ్ని పరీక్ష మొదలైంది.
అదే సమయంలో చిరంజీవి మలేరియాకి గురయ్యారు. 103 డిగ్రీల జ్వరం. కనీసం లేచి నిలబడే శక్తి కూడా లేదు. కానీ షూటింగ్ పోస్ట్ పోన్ చేయలేని పరిస్థితి. దీనితో పక్కనే డాక్టర్ ని పెట్టుకుని పడుతూ లేస్తూ శ్రీదేవితో చిరంజీవి డ్యాన్స్ చేశారట. షూటింగ్ పూర్తయిన వెంటనే చిరంజీవి సొమ్మసిల్ల కింద పడిపోయారు. దీనితో చిత్ర యూనిట్ విజయవాహిని స్టూడియో పక్కనే ఉన్న విజయ హాస్పిటల్ లో చిరంజీవిని అడ్మిట్ చేశారు. 15 రోజుల తర్వాత చిరంజీవి కోలుకున్నారు.
నిర్మాతలకు నష్టం కలుగకూడదు అంటే కొన్నిసార్లు అలాంటి కష్టాలు తప్పవు అని చిరంజీవి అన్నారు. అంతలా కష్టపడిన చిరంజీవికి ప్రతిఫలం దక్కింది. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం విడుదలై సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా రికార్డు సృష్టించింది. అప్పట్లో ఏపీలో తీవ్రమైన తుఫానులో కూడా ఈ చిత్ర వసూళ్లు ఆగలేదు.