MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Sadanand Date : ఒక్కప్పటి ఈ పేపర్ భాయే తహవ్వుర్ రాణాను విచారించేది... ఎవరి సదానంద్ దాతే?

Sadanand Date : ఒక్కప్పటి ఈ పేపర్ భాయే తహవ్వుర్ రాణాను విచారించేది... ఎవరి సదానంద్ దాతే?

సదానంద్ దాతే... నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (NIA) డైరెక్టర్ జనరల్.  అమెరికా నుండి ఇండియాకు తీసుకువచ్చిన 26/11 ముంబై ఉగ్రదాడిలో కీలక సూత్రధారి తహవ్వుర్ రాణాను విచారించేది ఈయనే. గతంలో ఈ ముంబై దాడులను కూడా ధైర్యంగా ఎదుర్కొన్న పోలీస్ అధికారి ఈయన. ఆయనే ఇప్పుడు ఎన్ఐఏ చీఫ్ హోదాలో ముంబై దాడుల ఉగ్రవాదిని విచారించడం ఆసక్తికరం. 

Arun Kumar P | Updated : Apr 10 2025, 11:00 PM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
Sadanand Date

Sadanand Date

Sadanand Date : భారత ఆర్థిక రాజధాని ముంబై ఉగ్రవాద దాడి కేసులో ప్రధాన నిందితుడు తహవ్వుర్ రాణాను ఎట్టకేలకు భారత్ కు తీసుకువచ్చారు. అమెరికా కస్టడీలో అతడిని అనేక అడ్డంకులను దాటుకుని ఇక్కడికి తీసుకురావడంలో నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజన్సీ (NIA)కీలకంగా వ్యవహరించింది. ఇప్పుడు కూడా 26/11 ముంబై దాడిలో ప్రధాన నిందితుడిని లాస్ ఎంజెల్స్  నుండి డిల్లీకి తీసుకువచ్చింది కూడా ఎన్ఐఏ అధికారులే. అతడి ఇకపై విచారించేది కూడా ఈ ఏజన్సీనే. 

ఈ క్రమంలో ఎన్ఐఏ చీఫ్ సదానంద్ దాతే పేరు తెరపైకి వచ్చింది. ఈ 26/11 ముంబై దాడులను ప్రత్యక్షంగా ఎదుర్కొన్న పోలీస్ అధికారుల్లో ఈయన ఒకరు. ఇప్పుడు ఆయనే ముంబై దాడుల ప్రధాన సూత్రదారి తహవ్వూర్ రాణాను  విచారించే బృందానికి నాయకత్వం వహించనున్నారు. 

ఓ పేపర్ భాయ్ స్థాయి నుండి ఇప్పుడు ఎన్ఐఏ చీఫ్ గా ఎదిగారు సదానంద్ దాతే. ఆయన ప్రొఫెషనల్ లైఫే కాదు వ్యక్తిగత జీవితం కూడా నేటి యువతరానికి ఆదర్శం. కాబట్టి ఆయనగురించి, ముంబై దాడుల్లో ఆయన చూపించిన ధైర్యం గురించి తెలుసుకుందాం. 

24
Sadanand Date

Sadanand Date

26/11 ఉగ్రదాడి వేళ దతే ధైర్యం :

2008 నవంబర్ 26 రాత్రి ముంబై ఉగ్రవాద దాడులతో అతలాకుతలమైనప్పుడు ముంబై అదనపు పోలీసు కమిషనర్ (సెంట్రల్ జోన్) సదానంద్ దాతే ఉన్నారు. ఆయన తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉగ్రవాదులను ఎదుర్కొన్నాడు. మలబార్ హిల్‌లోని తన ఇంటి నుండి బయలుదేరిన ఆయన నేరుగా చత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వే స్టేషన్‌కు వెళ్ళాడు. దారిలోని ఒక పోలీస్ స్టేషన్ నుండి   6 పోలీసుల బృందాన్ని వెంటపెట్టుకుని కామా ఆసుపత్రికి బయలుదేరాడు. 

దాతే టీమ్ చేరుకునేటప్పటికే కామా ఆసుపత్రిలో ఉగ్రవాదులు ఉన్నారు. దీంతో ఉగ్రవాదులను నిలువరించేందుకు ముందుకు కదిలిన దాతేకు కేవలం 3 అడుగుల దూరంలో ఒక గ్రెనేడ్ పేలింది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అతని శరీరంలోకి చిన్న ముక్కలు దూసుకెళ్లాయి.... అయినా వెనకడుగు వేయకుండా ముందుకు కదిలారు. ఈ క్రమంలోనే అతని సహచరులలో ఒకరైన ఎస్సై ప్రకాష్ మోర్ అమరుడయ్యాడు

26/11 దాడులను ధైర్యంగా ఎదుర్కొన్న సదానంద్ దాతే పేరు ధైర్యసాహసాలకు చిహ్నంగా నమోదు చేయబడింది. ఆ సమయంలో ఆయన ముంబై పోలీస్‌లో అదనపు కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్ జోన్) పదవిలో ఉన్నారు. దాడి జరిగినప్పుడు, అతను ఆలస్యం చేయకుండా తన కర్తవ్యాన్ని అర్థం చేసుకుని యుద్ధభూమిలోకి దూకాడు.
 

34
Sadanand Date

Sadanand Date

ఎన్ఐఏ చీఫ్ గా తహవ్వూర్ రాణా దర్యాప్తు :

2023లో ఎన్ఐఏ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు సదానంద్ దాతే. ఈ హోదాలో ఇప్పటికే అనేక హైప్రొఫైల్ కేసులను పర్యవేక్షించారు. ఇప్పుడు పాకిస్తాన్ లష్కరే తోయిబా నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న తహవ్వూర్ రానాను ఇప్పుడు భారతదేశంలో ప్రశ్నించనున్నారు.

రాణాను అప్పగించడానికి ఎన్ఐఏ అమెరికాలో ఒక బలమైన కేసును సిద్ధం చేసింది, దీనికి దతే స్వయంగా నాయకత్వం వహించాడు. ఇప్పుడు, రాణా భారతదేశానికి చేరుకున్న తర్వాత అదే బృందం అతన్ని క్షుణ్ణంగా విచారిస్తుంది.
 

44
Sadanand Date

Sadanand Date

ఎవరీ సదానంద్ దాతే :

 సదానంద్ దాతే మహారాష్ట్ర కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్ ఐపిఎస్ అధికారి. ఆయన బాల్యంలో వపేపర్ భాయ్ గా పనిచేసారు. అతని తల్లి ఇళ్ళలో పనిమనిషిగా చేసారు. ఇలా కడు పేద కుటుంబంలో పుట్టిన సదానంద్ ఎంతో కష్టపడి చదివి సివిల్స్ సాధించారు.   

ముంబై కేడర్ పోలీస్ అధికారిగా దాతే కెరీర్ ప్రారంభించారు. సిబిఐలో కూడా పనిచేసారు. అలాగే యాంటీ టెర్రర్ స్క్వాడ్ వంటి ముఖ్యమైన విభాగాలలో పనిచేశారు. 2023లో ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు. ఇలా అనేక హోదాల్లో పనిచేసిన సదానంద్ దాతే అనేక ప్రశంసనీయమైన పనులు చేశారు. 

26/11 దాడుల్లో ఆయన చూపిన ధైర్యసాహసాలకు రాష్ట్రపతి చేతుల మీదుగా శౌర్య పతకం అందుకున్నారు దాతే. నేడు ఆయన కేవలం ఒక అధికారి మాత్రమే కాదు, దేశానికి సేవ చేయాలని కలలు కనే యువతకు ఒక ప్రేరణ.

Arun Kumar P
About the Author
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు. Read More...
భారత దేశం
పోలీసు భద్రత
 
Recommended Stories
Top Stories