Published : Apr 05, 2025, 08:33 AM ISTUpdated : Apr 05, 2025, 11:53 PM IST

Telugu news live updates: PBKS vs RR: జైస్వాల్, ఆర్చర్ విధ్వంసం.. పంజాబ్‌పై 50 ర‌న్స్ తేడాతో రాజ‌స్థాన్ గెలుపు

సారాంశం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌తో చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతీకార సుంకాలను విధిస్తూ నిర్ణయం తీసుకున్నట ట్రంప్‌ దీనిపై భారత్‌తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక పిల్లలకు బండి ఇస్తే ఆర్సీ రద్దు చేస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. చాలా రోజుల తర్వాత బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వక్ఫ్‌ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్, ఎంఐఎం పిటిషన్లు దాఖలు చేశారు. వీటితో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం.. 
 

Telugu news live updates: PBKS vs RR: జైస్వాల్, ఆర్చర్ విధ్వంసం.. పంజాబ్‌పై 50 ర‌న్స్ తేడాతో రాజ‌స్థాన్ గెలుపు

11:53 PM (IST) Apr 05

PBKS vs RR: జైస్వాల్, ఆర్చర్ విధ్వంసం.. పంజాబ్‌పై 50 ర‌న్స్ తేడాతో రాజ‌స్థాన్ గెలుపు

PBKS vs RR IPL 2025: ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ ను రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 50 ప‌రుగులు తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ లో ఆర్ఆర్ ప్లేయ‌ర్లు య‌శ‌స్వి జైస్వాల్, రియాన్ ప‌రాగ్, జోఫ్రా ఆర్చ‌ర్ లు అద్భుతంగా రాణించారు. 
 

పూర్తి కథనం చదవండి

10:38 PM (IST) Apr 05

PBKS vs RR: ఆర్చర్ టార్చ‌ర్ పెట్టాడు భ‌య్య‌.. తొలి ఓవ‌ర్ లోనే విధ్వంసం

Jofra Archer wreaks havoc in the first over: ఐపీఎల్ 2025 18వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌల‌ర్ జోఫ్రా ఆర్చర్ అద్భుత‌మైన బౌలింగ్ తో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ను టార్చ‌ర్ పెట్టాడు. 

పూర్తి కథనం చదవండి

08:59 PM (IST) Apr 05

CSK vs DC:ధోని, విజ‌య్ శంక‌ర్ జిడ్డు బ్యాటింగ్.. సీఎస్కే ఓట‌మికి టాప్-5 కార‌ణాలు ఇవే

CSK vs DC IPL 2025: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 17వ మ్యాచ్ లో తమ సొంత గ్రౌండ్ లో అద్భుతమైన ఆటతో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ను ఢిల్లీ క్యాపిట‌ల్స్  (డీసీ) ఓడించింది. ఈ మ్యాచ్ లో సీఎస్కే ఓటమికి గల టాప్-5 కార‌ణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

పూర్తి కథనం చదవండి

07:47 PM (IST) Apr 05

CSK vs DC IPL 2025: కేఎల్ రాహుల్ సూప‌ర్ ఇన్నింగ్స్.. ఢిల్లీ హ్యాట్రిక్ గెలుపు.. చెన్నై చేసిన మిస్టేక్ ఏంటి?

 CSK vs DC IPL 2025: విజయ్ శంకర్, ఎంఎస్ ధోనీలు చివ‌రి వ‌ర‌కు క్రీజులో ఉన్నన్ప‌టికీ చెన్నై సూప‌ర్ కింగ్స్ కు విజ‌యాన్ని అందించలేక‌పోయారు. కేఎల్ రాహుల్ కు తోడుగా అద్భుత‌మైన బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఢిల్లీ టీమ్ ఐపీఎల్ 2025లో హ్యాట్రిక్ విజ‌యాన్ని అందుకుంది.
 

పూర్తి కథనం చదవండి

07:05 PM (IST) Apr 05

ashu reddy: అషురెడ్డికి ఆ హీరో అంటే పిచ్చి క్రష్‌.. అతను చేయిస్తే ఏం చేసిందో తెలిస్తే షాక్‌కి గురవుతారు!

అమ్మాయిలు సినిమాల్లో రాణించాలంటే అందంతోపాటు అభినయం, స్పాంటెనిటీ ఉండాలి. అలాంటి లక్షణాలు అన్నీ పుష్కలంగా ఉన్న బుల్లితెర నటి అషురెడ్డి. ఒకవైపు షోలు, ఈవెంట్లు చేస్తూనే.. అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ తన గ్లామర్‌తో యాత్‌ని కట్టిపడేస్తోంది. తాజాగా అషురెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా ఇండస్ట్రీలో ఓ ప్రముఖ హీరో అంటే తనకు పిచ్చి, క్రష్‌ ఉందని చెప్పింది.. అతనికి పెళ్లైంది, నీకు సిగ్గుందా అని కొందరు తిడుతున్నారని, అయినా పర్వాలేదు అతనంటే పిచ్చి ప్రేమ అని అంటోంది. తన డ్రీం బాయ్‌ అదేనండి హీరోని రీసెంట్‌గా కలిసినప్పుడు ఏం చేసిందో తెలిస్తే మీరూ షాక్‌కి గురవుతారు మరి... 
 

పూర్తి కథనం చదవండి

06:52 PM (IST) Apr 05

Viral Video: గ్రామంలోకి వచ్చిన 5 చిరుత పులులు.. యువకుడు చేసిన పని చూస్తే షాక్‌ అవ్వాల్సిందే

షియోపూర్ లోని కూనో నేషనల్ పార్క్ నుంచి ఐదు చిరుతలు గ్రామంలోకి ప్రవేశించాయి. ఒక్క చిరుత వచ్చిందంటే గ్రామస్తులంతా భయంతో వణికిపోతుంటారు. అలాంటిది 5 చిరుతలు వస్తే ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా.? అయితే పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. 
 

పూర్తి కథనం చదవండి

06:51 PM (IST) Apr 05

RCB: సీఎస్కేను బీట్ చేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ టీమ్ మరో ఘనత

RCB: ఐపీఎల్ లో అప్పటివరకు టైటిల్ గెలవకపోయిప్పటికీ విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కు బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉంది. ఇప్పుడు మరో రికార్డును సాధించింది.

పూర్తి కథనం చదవండి

06:36 PM (IST) Apr 05

పిల్లలతో రాధికా పండిట్ సమ్మర్ వెకేషన్.. యష్ మిస్సింగ్!

చందనవన సిండ్రెల్లా రాధికా పండిట్, తన తల్లి ఇంకా పిల్లలతో బీచ్‌లో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. యష్ మాత్రం మిస్సయ్యారు. 
 

పూర్తి కథనం చదవండి

06:31 PM (IST) Apr 05

రాబర్ట్ డౌనీ జూనియర్ వయసు 60 ఏళ్ళు : ఐరన్ మాన్ నటుడి టాప్ 10 బెస్ట్ మూవీస్ ఇవే 

రాబర్ట్ డౌనీ జూనియర్ ఏప్రిల్ 4, 2025న 60వ పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకున్నారు. ఐరన్ మ్యాన్‌గా బాగా పేరు తెచ్చుకున్న ఈ హాలీవుడ్ నటుడు చాలా విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. ఈ సందర్భంగా, రాటెన్ టొమాటోస్ ప్రకారం అతని టాప్-రేటెడ్ సినిమాలు చూద్దాం.

పూర్తి కథనం చదవండి

06:18 PM (IST) Apr 05

రణ్‌బీర్‌, దీపికా 'లవ్ అండ్ వార్'లో కలిసే ఛాన్సుందా?

సంజయ్ లీలా భన్సాలీ 'లవ్ అండ్ వార్  ' మూవీలో రణ్‌బీర్, అలియా, విక్కీ నటిస్తుండటంతో హైప్ క్రియేట్ అయింది. దీపికా గెస్ట్ రోల్ ఉంటుందనే టాక్ నడుస్తోంది. 2026లో రిలీజ్ కానున్న ఈ సినిమా, యష్ 'టాక్సిక్' మూవీతో పోటీ పడొచ్చు.

పూర్తి కథనం చదవండి

05:49 PM (IST) Apr 05

Viral News: ఆసుపత్రిలో పచ్చళ్ల అమ్మాయి.. క్షమించమని అడుగుతోన్న అన్వేష్‌

అలేఖ్య చిట్టి పచ్చళ్ల వ్యవహారం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది. సోషల్‌ మీడియా ఓపెన్‌ చేస్తే చాలు వీరి గురించే చర్చ జరుగుతోంది. అయితే తాజాగా ఈ అంశంపై ప్రముఖ యూట్యూబర్‌ ప్రపంచయాత్రికుడు అన్వేష్‌ స్పందించారు. ఈ వ్యవహారినికి సంబంధించి ఓ వీడియో పోస్ట్‌ చేశాడు.. 
 

పూర్తి కథనం చదవండి

05:33 PM (IST) Apr 05

Digvesh Rathi: నోట్‌బుక్ సెలబ్రేషన్స్.. ఇలా చేస్తే సస్పెన్షన్ పడుతుంది గురూ !

IPL 2025 Digvesh Rathi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేష్ రతి నోట్‌బుక్ సెలబ్రేషన్స్ తో హాట్ టాపిక్ గా మారాడు. ఈ సీజన్ లో రెండో సారి అతనికి జరిమానా విధించారు. 
 

పూర్తి కథనం చదవండి

05:24 PM (IST) Apr 05

Best Gold ETFs మార్కెట్ ఎంత పడ్డా.. ఈ ఈటీఎఫ్ లు అప్ అప్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల దెబ్బతో ప్రపంచ మార్కెట్లన్నీ కుదేలవుతున్నాయి. దాంతో జనం బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగానే బంగారం ధర చుక్కల్ని తాకుతోంది. అయితే గత రెండు రోజుల్లో బంగారం ధర కొంచెం దిద్దుబాటుకి గురైంది. ఈ నేపథ్యంలో ప్రత్యక్షంగా బంగారంలో కాకుండా గోల్డ్ ఈటీఎఫ్ లలో పెట్టుబడి పెట్టడం మంచి నిర్ణయం అవుతుందని స్టాక్ మార్కెట్ నిపుణులు సలహా ఇస్తున్నారు. మరి గోల్డ్ ETF పెట్టుబడి సురక్షితమేనా? అందులో ఉత్తమ ETFలు ఏంటి? ఆ వివరాలన్నీ తెలుసుకుందాం..

పూర్తి కథనం చదవండి

04:56 PM (IST) Apr 05

వ్యూహాత్మక సాంకేతికతలు ... విభజిస్తాయా లేక ఏకంచేస్తాయా?

మొదటిసారి ట్రంప్ అధ్యక్షతన సాగిన పరిపాలన, తర్వాత జో బిడెన్ పరిపాలనలో చైనాతో పోటీకి అమెరికా వ్యూహాత్మక సాంకేతికతలను ఉపయోగించారు. ఈ సాంకేతిక సహకారం అమెరికాను యూరప్ మరియు భారతదేశం వంటి మిత్రదేశాలకు దగ్గర చేసింది. ఇక ట్రంప్ రెండవసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక చైనా పట్ల చాలా కఠినంగా వ్యవహరించడం ప్రారంభించారు. ఇలా ట్రంప్ వ్యవహారతీరు, తీసుకునే నిర్ణయాలకు మిత్రదేశాల సహకారం ఉంటుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.   

పూర్తి కథనం చదవండి

04:39 PM (IST) Apr 05

రష్మిక మందన్న పుట్టినరోజు వేడుకలు: ఓమన్ లో శ్రీవల్లి రచ్చ చూశారా, గ్లామరస్ పిక్స్ వైరల్

సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించిన సికందర్ విజయం తర్వాత, రష్మిక మందన్న తన 29వ పుట్టినరోజును ఒమన్‌లో జరుపుకున్నారు. 

పూర్తి కథనం చదవండి

04:39 PM (IST) Apr 05

WhatsApp: వాట్సాప్‌లో డిలీట్ చేసిన ఈ మెసేజ్‌లను ఎలా చూడాలో తెలుసా.? సింపుల్‌ ట్రిక్‌..

ప్రతీ ఒక్క స్మార్ట్‌ ఫోన్‌లో కచ్చితంగా ఉండే యాప్స్‌లో వాట్సాప్‌ ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొచ్చే వాట్సాప్‌లో మనకు తెలియని ఎన్నో హిడెన్‌ ఫీచర్లు ఉంటాయి. అలాంటి వాటిలో ఒక ఫీచర్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

04:19 PM (IST) Apr 05

Cheque Book New Rules చెక్ బుక్ పై ఛార్జీల మోత.. ఇదేం బాదుడు మావా..?

ఆన్లైన్ లావాదేవీలు, యూపీఐ జోరుతో మనం చెక్ బుక్ వాడకం గణనీయంగా తగ్గించాం. అయినా ఇప్పటికీ చెక్ బుక్ ప్రాధాన్యం గణనీయంగానే ఉంది. దీనికి సంబంధించి కొత్త నిబంధనలు తాజాగా అమల్లోకి వచ్చాయి. బ్యాంకు వినియోగదారుడికి ఎన్ని చెక్కులు ఉచితంగా ఇస్తారు? దరఖాస్తు చేసుకునే విధానం ఏంటి? తర్వాత చెక్ బుక్ కి ఎంత ఛార్జ్ వసూలు చేస్తారు? ఈ వివరాలన్నీ మీకోసం అందిస్తున్నాం... 

పూర్తి కథనం చదవండి

03:50 PM (IST) Apr 05

బీఎస్ఎన్ఎల్ కి పోటెత్తుతున్న కస్టమర్లు! 7 నెలల్లో ఎంత మంది చేరారంటే..

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కి మంచి రోజులు వచ్చినట్టే కనిపిస్తున్నాయి. ఇతర ప్రైవేటు టెలికాం సంస్థలు ఇష్టారీతిన రీఛార్జ్ టారిఫ్ లు పెంచేస్తుండటంతో వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు.  గత 7 నెలల్లో బీఎస్ఎన్ఎల్ వైపు ఆకర్షితులైన కస్టమర్ల గురించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూడండి.

పూర్తి కథనం చదవండి

02:29 PM (IST) Apr 05

Astrology: ఈ తేదీల్లో పుట్టిన వారు ఒకటి కంటే ఎక్కువ రిలేషన్స్‌లో ఉంటారు.. వీరితో జీవితం నరకం

సాంకేతికంగా ఇంత అభివృద్ధి చెందిన ప్రస్తుత రోజుల్లో కూడా జ్యోతిష్య శాస్త్రాన్ని విశ్వసించే వారు చాలా మంది ఉన్నారు. మనం పుట్టిన తేదీ, సమయం వంటి అంశాలు జీవితంలో జరిగే మార్పులపై ప్రభావం చూపుతుందని విశ్వసిస్తుంటారు. కొన్ని తేదీల్లో జన్మించిన వారి భవిష్యత్తు ఆశించిన స్థాయిలో బాగుండదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ తేదీలు ఏంటి.? ఎలాంటి ప్రభావం ఉంటుంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

02:22 PM (IST) Apr 05

kolikipudi srinivas: టీడీపీ ఎమ్మెల్యేని పట్టించుకోని సీఎం చంద్రబాబు.. సొంతపార్టీ ఎమ్మెల్యే అంత కోపమా?

తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్‌ తన విశ్లేషణలు, పంచ్‌ డైలాగులతో ఫేమస్‌ అయ్యారు. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నిత్యం వివాదాల్లో ఉంటూ టీడీపీ పార్టీకి తలనొప్పిగా మారారు. తాజాగా సీఎం చంద్రబాబును కలిసేందుకు వెళ్లిన కొలికిపూడిని కనీసం ఆయన పట్టించుకోలేదు, పలకరించనూ లేదు. దీంతో కొలికిపూడి చుట్టూ కత్తివేలాడుతోందని స్పష్టంగా తెలుస్తోంది. అసలు కొలికిపూడి ఈ పరిస్థితికి రావాడనికి కారణం ఏంటి? దళిత బాంధవుడు జగజ్జీవన్‌రామ్‌ జయంతి రోజే ఎమ్మెల్యే గౌరవం కోల్పోవడం వెనుక వాస్తవాలు ఇలా.. 
 

పూర్తి కథనం చదవండి

02:18 PM (IST) Apr 05

Srirama Navami : మీ ఇంటికే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు... ఇందుకోసం మీరు ఏం చేయాలంటే....

Rama Navami : శ్రీరామ నవమి పర్వదినాన పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలంను సందర్శించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అంగరంగవైభవంగా జరిగా సీతారాముల కల్యాణాన్ని కనులారా వీక్షించి తలంబ్రాలను పొందాలని అనుకుంటారు. అయితే భద్రాచలం వెళ్లలేకపోయినవారికి కూడా ప్రభుత్వం అద్భుత అవకాశం ఇస్తోంది. మీ ఇంటికే ఆ దేవతామూర్తుల పెళ్లిలో ఉపయోగించిన తలంబ్రాలను పంపించే ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం మీరు చేయాల్సింది ఏంటంటే....  

పూర్తి కథనం చదవండి

12:53 PM (IST) Apr 05

PM Modi: ప్రధాని మోదీకి శ్రీలంక ప్రభుత్వం 'మిత్ర విభూషణ' అవార్డు.. దీని ప్రత్యేకత ఏంటంటే

ప్రధాని నరేంద్ర మోదీకి శ్రీలంక ప్రభుత్వం అత్యున్నత గౌరవమైన ‘మిత్ర విభూషణ’ మెడల్‌ను ప్రదానం చేసింది. ఈ అవార్డు భారతదేశం- శ్రీలంక మధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాలను బలపరచడంలో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఇచ్చారు. ఇంతకీ మెడల్‌లో ఉన్న చిహ్నాల అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

పూర్తి కథనం చదవండి

12:44 PM (IST) Apr 05

రిలయన్స్ డిజిటల్స్ బంపర్ ఆఫర్.. ఎలక్ట్రానిక్స్ పై రూ. 25,000 వరకు డిస్కౌంట్.. ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే..

Reliance Digital Discount Days: రిలయన్స్ డిజిటల్ తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘డిజిటల్ డిస్కౌంట్ డేస్’ పేరుతో ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్స్ ఇస్తోంది. వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులపై మాక్సిమం రూ.25 వేల వరకు తగ్గింపు ప్రకటించింది. ఏ వస్తువులపై ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకుందాం రండి. 
 

పూర్తి కథనం చదవండి

12:36 PM (IST) Apr 05

సమంత నుంచి తమన్నా వరకు: లిమిట్స్ దాటి నటించిన టాప్ 4 నటీమణులు

సమంత రూత్ ప్రభుతో సహా చాలా మంది నటీమణులు అన్ని హద్దులు దాటి తమ బోల్డ్ నటనతో వెబ్ సిరీస్‌లలో ప్రయోగాలు చేశారు. ఇలా హద్దులు మీరి బోల్డ్‌గా నటించిన టాప్ 4 నటీమణులు మరియు వారి వెబ్ సిరీస్‌లు ఏమిటి?  

పూర్తి కథనం చదవండి

12:01 PM (IST) Apr 05

Alekhya chitti: దెబ్బకు దిగొచ్చారుగా.. బూతు ఆడియో వెనకాల అసలు కథ ఇది.. క్లారిటీ ఇచ్చిన అలేఖ్య సిస్టర్‌.

గత మూడు రోజులుగా సోషల్‌ మీడియా ఓపెన్‌ చేస్తే చాలు అలేఖ్య చిట్టి పికిల్స్‌ వ్యవహారమే కనిపిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ ఇలా ఇక్కడ చూసిన ఈ పచ్చళ్ల వ్యవహారమే ట్రెండ్‌ అవుతోంది. ఎన్నో రోజులు కష్టపడి సంపాదించుకున్న పేరు ఒక్క ఆడియో కారణంగా పడిపోయింది. దెబ్బకు వాట్సాప్‌ అకౌంట్‌ క్లోజ్‌ అయ్యింది. వెబ్‌సైట్‌ మూత పడింది. అయితే ఈ విషయమై తాజాగా అలేఖ్య సిస్టర్స్‌లో ఒకరు స్పందించారు. 
 

పూర్తి కథనం చదవండి

12:00 PM (IST) Apr 05

Dosa : తెలుగోళ్ల దోసెలు మస్తు మాస్ గురూ... వీటికి తమిళ, కర్ణాటక స్టైల్ దోసెలకు తేడా ఏంటి?

దోసె... ఇది దక్షిణాది ప్రజల జీవితంలో భాగమైన వంటకం. దీని టిఫిన్ గానే కాదు లంచ్ గా, డిన్నర్ గా తినడానికి కూడా తినడానికి ఇష్టపడతారు. ఇలా దక్షిణ భారతదేశంలో బాగా ఫేమస్ అయిన వీటిలో తెలుగోళ్ల స్టైల్ దోసెలు ఎలా ఉంటాయి? తమిళులు, కన్నడిగుల స్టైల్ దోసెలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

11:32 AM (IST) Apr 05

anil ravipudi: డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడికి ఫ్లైట్‌ ఫోభియా.. చచ్చిపోతాననే భయం.. ఎలా ఓవర్‌కమ్‌ చేశారో తెలుసా?

anil ravipudi: తనదైన కామెడీ టైమింగ్‌తో సినిమాలను తీస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న డైరెక్టర్‌ అనిల్ రావిపూడి. రీసెంట్‌గా సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రాన్ని విడుదల చేసి బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ను అందుకోవడమే కాదు..  రికార్డుస్థాయిలో భారీ కలెక్టన్లను అందుకున్నారు. ఏ కష్టంలేకుండా చాలా చలాకీగా కనిపించే డైరెక్టర్‌ అనిల్‌కు కూడా కొన్ని భయాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? నిజమేనండి అనిల్‌కి ఫ్లైట్‌ ఫోబియా ఉందట.. విమానం ఎక్కగానే క్రాష్‌ అవుతుందని అనుకునేవాడట. మరి ఆయనకు ఎవరు ధైర్యం చెప్పారో తెలుసా?

పూర్తి కథనం చదవండి

10:51 AM (IST) Apr 05

Hyderabad: పిల్లలకు బండి ఇస్తున్నారా.? పేరెంట్స్‌ జైలుకు వెళ్లడం ఖాయం..

మెజారిటీ రోడ్డు ప్రమాదాలకు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోవడమే కారణం అని అధికారులు చెబుతుంటారు. రోడ్డు ప్రమాదాలను కట్టడి చేసే ఉద్దేశంతో అధికారులు నిబంధనలు కఠినతరం చేస్తుంటారు. ఇందులో భాగంగానే తాజాగా హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు దిద్దుబాటు చర్యలకు సిద్ధమయ్యారు. పిల్లలకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. 
 

పూర్తి కథనం చదవండి

10:21 AM (IST) Apr 05

రిజర్వేషన్ లేకున్నా స్లీపర్ కోచ్‌లో ప్రయాణం.. ఈ ట్రిక్ పాటించండి!

కాస్త దూరప్రయాణం చేయాలనుకున్నా భారతీయులు ఎక్కువగా రైల్వేలను ఎంచుకుంటుంటారు. అయితే అన్నిసార్లూ మనకు సీట్లు దొరకవు. అనుకున్నట్టుగా రిజర్వేషన్ పొందలేం. అలాంటప్పుడే ఈ ట్రిక్ పాటించండి. మీకు రిజర్వేషన్ లేకున్నా.. రిజర్వేషన్ బోగీల్లో ఎంచక్కా ప్రయాణించవచ్చు. ఇదేం నేరం కాదు.. నిబంధనలూ అనుమతిస్తాయి. ఆ వివరాలేంటో.. ఈ పోస్టులో తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి

09:50 AM (IST) Apr 05

Gold Price: భారీగా తగ్గిన బంగారం ధర.. ఇంకా పతనం కానుందా.? అసలు కారణం ఏంటి..

బంగారం పేరు వింటేనే సామాన్యుల గుండెల్లో అలజడి పెరుగుతోంది. అసలు అటువైపు కూడా చూడడం లేదు. కారణం గోల్డ్‌ ధరలు ఆకాశమే హద్దుగా పెరగడమే. తులం బంగారం ఏకంగా రూ. 95 వేలకు చేరువై అందరినీ షాక్‌కి గురి చేసింది. కానీ తాజాగా అనూహ్యంగా బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 
 

పూర్తి కథనం చదవండి

More Trending News