Cheque Book New Rules చెక్ బుక్ పై ఛార్జీల మోత.. ఇదేం బాదుడు మావా..?
ఆన్లైన్ లావాదేవీలు, యూపీఐ జోరుతో మనం చెక్ బుక్ వాడకం గణనీయంగా తగ్గించాం. అయినా ఇప్పటికీ చెక్ బుక్ ప్రాధాన్యం గణనీయంగానే ఉంది. దీనికి సంబంధించి కొత్త నిబంధనలు తాజాగా అమల్లోకి వచ్చాయి. బ్యాంకు వినియోగదారుడికి ఎన్ని చెక్కులు ఉచితంగా ఇస్తారు? దరఖాస్తు చేసుకునే విధానం ఏంటి? తర్వాత చెక్ బుక్ కి ఎంత ఛార్జ్ వసూలు చేస్తారు? ఈ వివరాలన్నీ మీకోసం అందిస్తున్నాం...
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఉచితం కాదు..
మనం ఎంత డిజిటల్ పేమెంట్ల వైపు మొగ్గు చూపిస్తున్నా.. ఇప్పటికీ చాలా ఆర్థిక లావాదేవీల్లో చెక్కు బుక్ అవసరం ఉంటుంది. ముఖ్యంగా అద్దె, లీగల్ విషయాలు, బిజినెస్ పేమెంట్లకు చెక్కులు ఇంకా వాడుతున్నారు. కానీ, బ్యాంకులు 2025లో రూల్స్ మార్చాయి. ఇకపై కస్టమర్లకు వచ్చే ఫ్రీ చెక్కులు అయిపోయాక ఛార్జీలు కట్టాలి. ఈ ఛార్జీలు బ్యాంక్, అకౌంట్ ప్రకారం మారుతుంటాయి.
కొత్త ఛార్జీలు
భారత్‌లో చాలా బ్యాంకులు ప్రతి సంవత్సరం కొన్ని చెక్కులు ఫ్రీగా ఇస్తాయి. ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్ ఉన్నవాళ్లకు ఏడాదికి 10 చెక్కులు ఫ్రీ. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు 25 వరకు ఇస్తాయి. ఆ తర్వాత ఒక్కో చెక్కుకు ₹2 నుంచి ₹4 వరకు ఛార్జ్ చేస్తారు. కొన్ని బ్యాంకులు సీనియర్ సిటిజన్స్, ప్రీమియం అకౌంట్ లేదా శాలరీ అకౌంట్ ఉన్నవాళ్లకు ఈ ఛార్జీలు తీసుకోవు. కరెంట్ అకౌంట్ వాళ్లకు ఎక్కువ లావాదేవీలు ఉండడం వల్ల ఛార్జీ లేకుండా ఎక్కువ చెక్కులు ఇస్తారు.
అప్లై చేసే విధానం
చెక్కు బుక్ కోసం అప్లై చేయడం ఇప్పుడు చాలా సులువు. బ్యాంకులు మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం లేదా బ్రాంచ్‌కు వెళ్లి అప్లై చేసే అవకాశం ఇస్తున్నాయి. అప్లై చేసేటప్పుడు కస్టమర్లు ఎన్ని చెక్కులు కావాలో (10, 25 లేదా 50) ఎంచుకోవచ్చు. చాలా బ్యాంకులు 3 నుంచి 7 రోజుల్లో రిజిస్టర్డ్ అడ్రస్‌కు చెక్కు బుక్ పంపిస్తాయి. వేరే ఊర్లకు పంపడానికి కొరియర్ లేదా స్పీడ్ పోస్ట్ ఛార్జీలు ఉండొచ్చు.
చెక్ బుక్కు ప్రాధాన్యం
యూపీఐ, ఆర్టీజీఎస్ లాంటి డిజిటల్ టూల్స్ ఉన్నా, చెక్కులు ఇంకా ఉపయోగపడుతున్నాయి. చెక్కు ఇచ్చిన తేది నుంచి మూడు నెలల వరకు చెల్లుబాటు అవుతుంది. అకౌంట్‌లో డబ్బులు లేకపోతే చెక్కు బౌన్స్ అయితే, బ్యాంక్ ₹150 నుంచి ₹750 వరకు ఫైన్ వేయొచ్చు. పోగొట్టుకుంటే లేదా మోసం జరిగితే కస్టమర్లు ఆన్‌లైన్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చెక్కును ఆపడానికి రిక్వెస్ట్ పెట్టొచ్చు. బిజినెస్ వాళ్లు 100 లేదా అంతకంటే ఎక్కువ చెక్కులున్న బల్క్ చెక్కు బుక్ కోసం కూడా అప్లై చేయొచ్చు.
కొత్త బ్యాంక్ మార్పులు
2025లో చాలా బ్యాంకులు చెక్కు బుక్ లాంటి పేపర్ వాడకాన్ని తగ్గించి గ్రీన్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో ఫ్రీ చెక్కులు తగ్గించడం, కస్టమర్లను డిజిటల్ పద్ధతులు వాడమని చెప్పడం ఉంటుంది. అయినా, చెక్కులు ఇంకా అవసరమే. ఛార్జీలు, వాడే రూల్స్, అప్లై చేసే విధానం గురించి తెలుసుకుంటే కస్టమర్లు లేట్ ఫీజులు, ఛార్జీల నుంచి తప్పించుకోవచ్చు.