- Home
- Entertainment
- anil ravipudi: డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఫ్లైట్ ఫోభియా.. చచ్చిపోతాననే భయం.. ఎలా ఓవర్‌కమ్ చేశారో తెలుసా?
anil ravipudi: డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఫ్లైట్ ఫోభియా.. చచ్చిపోతాననే భయం.. ఎలా ఓవర్‌కమ్ చేశారో తెలుసా?
anil ravipudi: తనదైన కామెడీ టైమింగ్‌తో సినిమాలను తీస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. రీసెంట్‌గా సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రాన్ని విడుదల చేసి బ్లాక్‌బాస్టర్ హిట్‌ను అందుకోవడమే కాదు.. రికార్డుస్థాయిలో భారీ కలెక్టన్లను అందుకున్నారు. ఏ కష్టంలేకుండా చాలా చలాకీగా కనిపించే డైరెక్టర్ అనిల్‌కు కూడా కొన్ని భయాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? నిజమేనండి అనిల్‌కి ఫ్లైట్ ఫోబియా ఉందట.. విమానం ఎక్కగానే క్రాష్ అవుతుందని అనుకునేవాడట. మరి ఆయనకు ఎవరు ధైర్యం చెప్పారో తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
Anil Ravipudi
సినిమాలు తీయడంలోనే కాకుండా.. వాటిని ప్రమోట్ చేయడంలో కూడా తానే నంబర్ వన్ అని సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రమోషన్స్ చేశారు మన డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఒకప్పుడు ఈవీవీ సత్యనారాయణ మాత్రమే కామెడీ చిత్రాలను తీసేవారు. శ్రీనువైట్ల కూడా కొన్ని చిత్రాలను తీసినా నేటి ట్రెండ్‌ని పట్టుకోవడంలో ఆయన వెనుకంజలో ఉన్నారు. కానీ దర్శకుడు అనిల్ మాత్రం అప్టేడేట్ వర్షన్‌లా వినోదాత్మక చిత్రాలను తీస్తూ కడుపుబ్బా నవ్విస్తున్నాడు.
Anil Ravipudi
దర్శకుడు అనిల్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. తనకు ఫ్లైట్ ఫోబియా ఉందని చెప్పుకొచ్చారు. విమానం ఎక్కితే అది కూలిపోయి చచ్చిపోతాననే భయం తీవ్రస్థాయిలో ఉండేదని అన్నారు. విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత ఆకాశంలో ఉండే గాలి వేగానికి విమానం సముద్రాల్లో కూలిపోతుందని, గాల్లోనే క్రాష్ అవుతుందనే భయం వల్ల తాను ఫ్లైట్ ఎక్కాలంటే భయపడేవాడినిని అనిల్ తెలిపారు.
Anil Ravipudi
అనిల్ తొలిసారిగా 2009లో ఫ్లైట్‌లో ఆస్ట్రేలియా వెళ్లానని ఆ తర్వాత చాలా ఏళ్లు అసలు విమానం ఎక్కలేదని చెప్పారు. బస్సు, కారు, రైళ్లలో ప్రయాణించినట్లు ఆయన తెలిపారు. ఈ ఫ్లైట్ ఫోబియాతో అనేక ఇబ్బందులు పడ్డానని చివరికి తనకు తానే ఆ భయాన్ని ఓవర్‌కమ్ చేసినట్లు చెప్పారు.
Anil Ravipudi
ఫ్లైట్ ఫోబియా పోగొట్టుకోవడానికి విపరీతంగా పుస్తకాలు చదవడం, గూగుల్‌లో వెతికి అసలు విమానం కూలిపోయేందుకు ఎంత శాతం అవకాశం ఉందని వెతకగా.. కేవలం .9 శాతం మాత్రమే ఉందని తెలుసుకున్నానని. దీంతోపాటు ఫ్లైట్ సేఫ్టీ గురించి తెలుసుకున్నానన్నారు. టర్బులైన్స్ వల్ల విమానానికి ఏదైనా ప్రమాదం జరిగితే అది క్రాష్ కాదని తెలుసుకున్నానని, ఇలాంటివి తెలుసుకున్నాక ధైర్యం వచ్చిందని చెప్పుకొచ్చారు.
Anil Ravipudi
గత కొన్నేళ్లుగా గూగుల్, పుస్తకాలు చదువుతూ.. ఫ్లైట్ ఫోబియా అధిగమించి విమానాల్లో ప్రయాణిస్తున్నట్లు అనిల్ పేర్కొన్నారు. ఇంకా ఆ భయాన్ని పోగొట్టుకునేందుకు రెగ్యులర్‌గా ఫ్లైట్‌లలో ప్రయాణించినట్లు చెప్పుకొచ్చారు. కొన్నిరోజులైతే ఉదయం ఒక విమానం, సాయంత్రం ఒక విమానంలో ట్రావెల్ చేసినట్లు తెలిపారు. అలా నెమ్మదిగా ఆ ఫోబియాని అధిగమించి ఇప్పుడు హ్యాపీగా విమానం ఎక్కుతున్నట్లు దర్శకుడు అనిల్ చెప్పారు.