RCB: సీఎస్కేను బీట్ చేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ టీమ్ మరో ఘనత
RCB: ఐపీఎల్ లో అప్పటివరకు టైటిల్ గెలవకపోయిప్పటికీ విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కు బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉంది. ఇప్పుడు మరో రికార్డును సాధించింది.

Virat Kohli's team RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీలో విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటిరవకు టైటిల్ ను గెలువలేకపోయింది. కానీ, ఏ జట్టుకూ లేనంత మంది అభిమానులు ఆర్సీబీకి ఉన్నారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా అభిమానులు ఆర్సీబీకి మద్దతు ఇస్తుంటారు.
ప్రస్తుతం జరుగుతున్నది ఐపీఎల్ 18వ ఎడిషన్. ఐపీఎల్ టోర్నమెంట్‌లో ఆర్సీబీ 18వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. మరో ప్రత్యేకత ఏమిటంటే విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీ ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 18 మిలియన్ల మంది ఫాలోవర్లకు చేరుకుంది. ఇంతకుముందు వరకు ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల పరంగా ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) టాప్ లో ఉన్నది. అయితే, ఇప్పుడు ఆర్సీబీ చెన్నై టీమ్ ను బీట్ చేసి నెంబర్ 1 స్థానంలోకి చేరింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ప్రారంభమైనప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో ఆర్సీబీ ఫాలోవర్ల సంఖ్య 17 మిలియన్లుగా ఉంది. ఇదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ కు ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 17.7 మిలియన్లు ఉంది. అయితే, సీఎస్కేను ఓడించిన వెంటనే కేవలం 10 రోజుల్లోనే ఆర్సీబీ ఫాలోవర్ల సంఖ్య 18 మిలియన్లకు పెరిగింది.
ఐపీఎల్ టాప్ టీమ్స్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు
ఆర్సీబీ: 18.2 మిలియన్లు
సీఎస్‌కే: 17.9 మిలియన్లు
ముంబై ఇండియన్స్ : 16.4 మిలియన్లు
మిగతా జట్లు 10 మిలియన్లు దాటలేదు. కేకేఆర్ 7.1 మిలియన్లు, ఢిల్లీ క్యాపిటల్స్ 4.3 మిలియన్లుతో తర్వాతి స్థానంలో ఉన్నాయి.
మ్యాచ్ గెలిచినా, ఓడినా, ఆర్సీబీ అభిమానులు జట్టుపై ఆశలు వదులుకోలేదు. విజయం సాధించినప్పుడు పొండిపోాయారు.. ఆనందించారు. ఓడినప్పుడు ఆగ్రహంతో విసిగిపోయారు. ఓటమితో కుంగిపోయారు. పేలవమైన ఆటతీరుతో బాధపడ్డారు కానీ, ఎప్పుడు కూడా ఆర్సీబీని వీడలేదు.
ఆర్సీబీ ప్రతి పోస్టుకు అభిమానులు లైక్స్, కామెంట్లు చేస్తారు. ఆర్సీబీ ఎన్నిసార్లు ఓడినా అభిమానులు ఆర్సీబీ అభిమాని అని గర్వంగా చెప్పుకుంటారు.