MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • CSK vs DC IPL 2025: కేఎల్ రాహుల్ సూప‌ర్ ఇన్నింగ్స్.. ఢిల్లీ హ్యాట్రిక్ గెలుపు.. చెన్నై చేసిన మిస్టేక్ ఏంటి?

CSK vs DC IPL 2025: కేఎల్ రాహుల్ సూప‌ర్ ఇన్నింగ్స్.. ఢిల్లీ హ్యాట్రిక్ గెలుపు.. చెన్నై చేసిన మిస్టేక్ ఏంటి?

 CSK vs DC IPL 2025: విజయ్ శంకర్, ఎంఎస్ ధోనీలు చివ‌రి వ‌ర‌కు క్రీజులో ఉన్నన్ప‌టికీ చెన్నై సూప‌ర్ కింగ్స్ కు విజ‌యాన్ని అందించలేక‌పోయారు. కేఎల్ రాహుల్ కు తోడుగా అద్భుత‌మైన బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఢిల్లీ టీమ్ ఐపీఎల్ 2025లో హ్యాట్రిక్ విజ‌యాన్ని అందుకుంది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 05 2025, 07:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

CSK vs DC IPL 2025: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ (డీసీ) జైత్రయాత్ర కొన‌సాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత‌మైన ఆట‌తో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది. త‌మ సొంత గ్రౌండ్ లోనే ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ ను 25 ప‌రుగుల తేడాతో ఓడించింది. 

ఐపీఎల్ 2025 17వ మ్యాచ్ చెన్నైలోని చేపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ ముందు 184 పరుగుల టార్గెట్ ను ఉంచింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఢిల్లీ తరఫున వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ అద్భుత‌మైన ఆట‌తో సూప‌ర్ నాక్ ఆడాడు. ఓపెన‌ర్ గా వ‌చ్చిన రాహుల్  77 పరుగుల త‌న ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 3 సిక్స‌ర్లు బాదాడు. అత‌నికి తోడుగా అభిషేక్ పోరెల్ 33 పరుగులు, అక్షర్ పటేల్ 21 పరుగులు, సమీర్ రిజ్వీ 20 పరుగులు, ట్రిస్టన్ స్టబ్స్ 24 పరుగుల ఇన్నింగ్స్ తో 20 ఓవ‌ర్ల‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ 6 వికెట్లు కోల్పోయి 183 ప‌రుగులు చేసింది. 

చెన్నై బౌలింగ్ లో ఖలీల్ అహ్మద్ మ‌రోసారి సూప‌ర్ బౌలింగ్ తో 2 వికెట్లు ప‌డ‌గొట్టాడు. దీంతో అత‌ను ఐపీఎల్ 2025లో అత్య‌ధిక వికెట్లు తీసుకున్న బౌల‌ర్ గా టాప్ లో ఉన్నాడు. జడేజా, నూర్ అహ్మద్, పతిరానా తలా ఒక వికెట్ పడగొట్టారు. 

35

184 ప‌రుగులు టార్గెట్ తో బ‌రిలోకి దిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్ కు మంచి ఆరంభం ల‌భించ‌లేదు. ఎక్క‌డా కూడా మ్యాచ్ ను గెలుచుకునే విధ‌మైన మూమెంట్ రాలేదు. చెన్నై సొంత గ్రౌండ్ లో జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో ఆ టీమ్ బ్యాట‌ర్లు రాణించ‌క‌పోవ‌డంతో ఓట‌మి నుంచి త‌ప్పించుకోలేక‌పోయింది. 

లక్ష్యాన్ని ఛేదించే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయింది. రచిన్ రవీంద్ర 3 పరుగులు, కెప్టెన్ రితురాజ్ గైక్వాడ్ 5 పరుగులు, డెవాన్ కాన్వే 13 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 

45

ఆ త‌ర్వాత‌ చెన్నై 10, 11వ ఓవర్లలో మరో రెండు  బిగ్ వికెట్ల‌ను కోల్పోయింది. శివం దూబే 18 పరుగులు, రవీంద్ర జడేజా కేవలం 2 పరుగులు చేసి అవుట్ అయ్యారు. దీంతో 74 ప‌రుగుల‌కే చెన్నై టీమ్ స‌గం వికెట్ల‌ను కోల్పోయింది. క‌ష్ట స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన ఎంఎస్ ధోని, విజయ్ శంకర్ లు ఇన్నింగ్స్‌ను ముందుకు న‌డిపించారు.

కానీ, ఢిల్లీ క్యాపిట‌ల్స్ అద్భుత‌మైన బౌలింగ్ తో ప‌రుగులు రాకుండా అడ్డుకుంది. చెన్నై ఇన్నింగ్స్ స్లో కావ‌డంతో కావాల్సిన ర‌న్ రేట్ పెరిగిపోయింది. ఇద్దరి మధ్య అద్భుతమైన భాగస్వామ్యం ఉన్నప్పటికీ చెన్నై విజ‌యాన్ని అందుకోవ‌డంలో స‌క్సెస్ కాలేక‌పోయింది.

55
DC vs CSK

DC vs CSK

చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసి 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ధోని 30 పరుగులు, విజయ్ శంకర్ 69 పరుగులతో అజేయంగా నిలిచారు. 

గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన తర్వాత సీఎస్కే పాయింట్ల పట్టికలో దిగజారింది. ఈ మ్యాచ్ లో కూడా ఓడిపోవ‌డంతో ఐపీఎల్ 2025 పాయింట్ల ప‌ట్టిక‌లో ధోని టీమ్ చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆడిన 4 మ్యాచ్ ల‌లో ఒకటి గెలిచి 2 పాయింట్ల‌తో 8వ స్థానంలోకి ప‌డిపోయింది. వ‌రుస‌గా హ్యాట్రిక్ విజ‌యాలు అందుకున్న ఢిల్లీ టీమ్ 6 పాయింట్ల‌తో టాప్ లో ఉంది. రెండు, మూడు స్థానాల్లో పంజాబ్, బెంగ‌ళూరు టీమ్ లు ఉన్నాయి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రీడలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Recommended image2
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
Recommended image3
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved