Digvesh Rathi: నోట్‌బుక్ సెలబ్రేషన్స్.. ఇలా చేస్తే సస్పెన్షన్ పడుతుంది గురూ !
IPL 2025 Digvesh Rathi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేష్ రతి నోట్‌బుక్ సెలబ్రేషన్స్ తో హాట్ టాపిక్ గా మారాడు. ఈ సీజన్ లో రెండో సారి అతనికి జరిమానా విధించారు.

Digvesh Singh Rathi
IPL 2025 Digvesh Rathi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 రసవత్తరంగా కొనసాగుతోంది. సీనియర్ స్టార్ ప్లేయర్లతో పోటీ పడుతూ యంగ్ ప్లేయర్లు అదరిపోయే ఇన్నింగ్స్ లను ఆడుతున్నారు. అలాంటి వారిలో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) స్పిన్నర్ దిగ్వేష్ రతి కూడా ఉన్నాడు. మంచి బౌలింగ్ తో ఐపీఎల్ 2025ని ప్రారంభించిన అతను.. వికెట్లు తీసుకున్న తర్వాత జరుపుకునే నోట్ బుక్ సెలబ్రేషన్స్ తో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు.
ఇప్పటికే హెచ్చరికలతో పాటు జరిమానా విధించినా అతను తీరును మార్చుకోలేదు. దీంతో మరోసారి అతనికి జరిమానా విధించారు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ లో వికెట్ తీసుకున్న తర్వాత నోట్‌బుక్ లో రాసుకున్నట్టుగా సెలబ్రేట్ చేసుకున్నాడు. దీంతో అతనికి ఐపీఎల్ 2025 సీజన్‌లో వరుసగా రెండవసారి జరిమానా విధించారు.
Digvesh Singh Rathi
తన ఢిల్లీ టీమ్ మెట్ అయిన పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంష్ ఆర్యను అవుట్ చేసిన తర్వాత దిగ్వేష్ రతి నోట్ బుక్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీంతో అతను ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు మ్యాచ్ ఫీజులో 50% జరిమానా విధించారు. ఈ సీజన్‌లో రెండవ లెవల్ 1 ఉల్లంఘన కావడంతో మ్యాచ్ ఫీజులో 50% జరిమానాతో పాటు రెండు డీమెరిట్ పాయింట్లను ఇచ్చారు.
ఇదిలా ఉండగా, శుక్రవారం లక్నోలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9వ ఓవర్ మొదటి బంతికే ముంబై బ్యాటర్ నమన్ ధీర్‌ను అవుట్ చేసిన తర్వాత దిగ్వేష్ తన వివాదాస్పద నోట్‌బుక్ సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. అతను 24 బంతుల్లో 46 పరుగులు అవుట్ అయ్యాడు. ఇప్పటికే దిగ్వేష్ ను హెచ్చరించిన ఐపీఎల్ మరోసారి అదే పని చేయడంలో మరో డీమెరిట్ పాయింట్, జరిమానాను విధించారు.
Digvesh Singh Rathi
ముంబై పై లక్నో 12 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించడంలో దిగ్వేష్ నమన్ ధీర్‌ను అవుట్ చేయడం కీలక పాత్ర పోషించింది. అందుకే అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. అద్భుతమైన బౌలింగ్ వేస్తున్నప్పటికీ క్రమశిక్షణా సమస్యలు ఇప్పుడు దిగ్వేష్ ను సస్పెన్షన్ ప్రమాదానికి దగ్గరగా చేస్తున్నాయి.
అలాగే, కెప్టెన్ రిషబ్ పంత్ తన జట్టు పేలవమైన ఓవర్ రేట్ కారణంగా అతనికి కూడా జరిమానా విధించారు. ఈ సీజన్‌లో తన జట్టు చేసిన తొలి నేరానికి పంత్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించారు.