- Home
- National
- Viral Video: గ్రామంలోకి వచ్చిన 5 చిరుత పులులు.. యువకుడు చేసిన పని చూస్తే షాక్ అవ్వాల్సిందే
Viral Video: గ్రామంలోకి వచ్చిన 5 చిరుత పులులు.. యువకుడు చేసిన పని చూస్తే షాక్ అవ్వాల్సిందే
షియోపూర్ లోని కూనో నేషనల్ పార్క్ నుంచి ఐదు చిరుతలు గ్రామంలోకి ప్రవేశించాయి. ఒక్క చిరుత వచ్చిందంటే గ్రామస్తులంతా భయంతో వణికిపోతుంటారు. అలాంటిది 5 చిరుతలు వస్తే ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా.? అయితే పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

Representative image
కూనో నేషనల్ పార్క్‌లోని జ్వాలా అనే ఆడ చిరుత తన పిల్లలతో గ్రామంలోకి ప్రవేశించాయి. అనంతరం అక్కడ ఉన్న మేకను వేటాడి, అక్కడే ప్రజల మధ్య విశ్రాంతి తీసుకుంది. అయితే ఇక్కడ జరిగిన ఓ ఆసక్తికర సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఉమ్రికలాన్ గ్రామంలో ఈ చిరుతలు ఒక రైతు మేకలను వేటాడి అక్కడే విశ్రాంతి తీసుకున్నాయి. గ్రామానికి చెందిన ఒక యువకుడు చిరుతలకు నీళ్లు తాగించాడు. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
kuno national park cheetah
ఉమ్రికలాన్ గ్రామంలో ఒక్కసారిగా కలకలం
వాస్తవానికి, ఉమ్రికలాన్ గ్రామంలోని ప్రజలు పొలాల దగ్గర ఐదు చిరుతలు తిరుగుతూ ఉండటం చూసి ఒక్కసారిగా కలకలం రేగింది. జ్వాలా దాని పిల్లలు ఒక రైతు మేకలను లక్ష్యంగా చేసుకున్నాయి. అక్కడే చెట్టు నీడలో విశ్రాంతి తీసుకున్నాయి. ఈ మొత్తం సంఘటనను గ్రామంలోని కొంతమంది యువకులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు.
వైరల్ అవుతోన్న వీడియో
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో సినిమా సన్నివేశానికి ఏమాత్రం తీసిపోదు. వీడియోలో జ్వాలా దాని నాలుగు పిల్లలు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ కనిపిస్తున్నాయి. అప్పుడు ఒక యువకుడు వచ్చి వాటి ముందు ఒక గిన్నెలో నీళ్లు పెట్టాడు. కాసేపటి తర్వాత చిరుతలు లేచి ఎలాంటి భయం లేకుండా నీళ్లు తాగేశాయి. వైరల్ వీడియో చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
కూనో నేషనల్ పార్క్ ట్రాకింగ్ బృందం ఘటన వివరాలు సేకరించింది
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న కూనో నేషనల్ పార్క్ ట్రాకింగ్ బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. వారు పొలాలను పరిశీలించడమే కాకుండా, గ్రామస్తులతో మాట్లాడి పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. ట్రాకింగ్ బృందంలోని సభ్యులు ఇప్పుడు ఈ చిరుతల కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతున్నారు. చిరుతలు తిరిగి అడవిలోకి వెళ్లి మనుషులకు దూరంగా ఉండాలన్నదే బృందం లక్ష్యంగా ఉంది.