MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • Home
  • Sports
  • Cricket
  • CSK vs DC:ధోని, విజ‌య్ శంక‌ర్ జిడ్డు బ్యాటింగ్.. సీఎస్కే ఓట‌మికి టాప్-5 కార‌ణాలు ఇవే

CSK vs DC:ధోని, విజ‌య్ శంక‌ర్ జిడ్డు బ్యాటింగ్.. సీఎస్కే ఓట‌మికి టాప్-5 కార‌ణాలు ఇవే

CSK vs DC IPL 2025: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 17వ మ్యాచ్ లో తమ సొంత గ్రౌండ్ లో అద్భుతమైన ఆటతో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ను ఢిల్లీ క్యాపిట‌ల్స్  (డీసీ) ఓడించింది. ఈ మ్యాచ్ లో సీఎస్కే ఓటమికి గల టాప్-5 కార‌ణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

Mahesh Rajamoni | Published : Apr 05 2025, 08:59 PM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
DC vs CSK

DC vs CSK

Top 5 reasons for CSK's defeat against DC: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 17వ మ్యాచ్ చెన్నైలోని చేపాక్ స్టేడియంలో జ‌రిగింది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ త‌ల‌ప‌డ్డాయి. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ ముందు 184 పరుగుల టార్గెట్ ను ఉంచింది. అయితే, సీఎస్కే 20 ఓవ‌ర్ల‌లో 158/5 ప‌రుగులు చేసి 25 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఓడిపోవ‌డానికి గ‌ల టాప్-5 కార‌ణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

26
Asianet Image

1. బౌలింగ్ , బ్యాటింగ్ లో ఫెయిల్ అయిన చెన్నై 

ఈ మ్యాచ్ లో తొలి ఓవ‌ర్ లోనే ఢిల్లీ వికెట్ ను పడగొట్టినప్పటికీ ఆ త‌ర్వాత చెన్నై బౌల‌ర్లు ప్ర‌భావం చూపించ‌లేక‌పోయారు. దీంతో ఢిల్లీ చెన్నై ముందు భారీ టార్గెట్ ను ఉంచింది. బౌలింగ్ లో విఫ‌మైన త‌ర్వాత ధోని టీమ్ సీఎస్కే బ్యాటింగ్ లో కూడా రాణించ‌లేక‌పోయింది. 184 పరుగుల టార్గెట్ ను అందుకునే క్ర‌మంలో చెన్నై టీమ్ కు మంచి ఆరంభం ల‌భించ‌లేదు. 

ప‌వ‌ర్ ప్లే పూర్తి కాక‌ముందే చెన్నై త‌మ టాప్-3 బ్యాట‌ర్ల‌ను కోల్పోయింది. రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వేల నుంచి బిగ్ ఇన్నింగ్స్ రాలేదు. దీంతో సీఎస్కే మిడిల్ ఆర్డర్‌పై ఒత్తిడి ప‌డింది. అలాగే, ఢిల్లీ బౌల‌ర్లు మ‌రోసారి అద‌ర‌గొట్టారు. అన్ని వికెట్లు తీసుకోక‌పోయినా.. ప‌రుగులు చేయ‌కుండా అడ్డుకున్నారు. మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్ ప్రారంభంలో మంచి బౌలింగ్ వేశారు.

36
Asianet Image

2. చెన్నై టీమ్ లో బిగ్ ఇన్నింగ్స్ లేవు

184 ప‌రుగుల టార్గెట్ ముందు ఎవ‌రైనా ప్లేయ‌ర్ నుంచి చెన్నై సూప‌ర్ కింగ్స్ ధ‌నాధ‌న్ బిగ్ ఇన్నింగ్స్ కావాలి. కానీ, ఏ ప్లేయ‌ర్ నుంచి అలాంటి నాక్ రాలేదు. ధోని, విజ‌య్ శంక‌ర్ లు మిన‌హా మిగతావారి నుంచి మెరుగైన‌ భాగస్వామ్యాలు రాలేదు. ర‌న్ రేటు పెరుగుతుంటే బ్యాట్స్ మెన్ పై ఒత్తిడి ప‌డింది. 

46
Dhoni and Vijay Shankar sink Chennai!

Dhoni and Vijay Shankar sink Chennai!

3. ధోని, విజ‌య్ శంక‌ర్ లు చెన్నైని ముంచేశారు ! 

 మిడిల్ ఓవర్లలో చెన్నై బ్యాటింగ్ చాలా నెమ్మదిగా సాగింది. కావాల్సిన ర‌న్ రేటు పెరుగుతుంటే బ్యాటింగ్ లో జోరును పెంచ‌లేక‌పోయారు. విజయ్ శంకర్ హాఫ్ సెంచరీ (54 బంతుల్లో 69*) సాధించగా, ఎంఎస్ ధోని 26 బంతుల్లో 30*తో అజేయంగా నిలిచారు. భాగస్వామ్యం 57 బంతుల్లో 84 పరుగులు చేశారు. కావాల్సిన ర‌న్ రేటు పెరుగుతుంటూ త‌మ జిడ్డు బ్యాటింగ్ తో చెన్నై ఓట‌మికి కార‌ణాల్లో మొద‌ట క‌నిపించే వారిలా మార‌రు. చెన్నై బ్యాటింగ్ లో కేవ‌లం 9 ఫోర్లు, 3 సిక్స‌ర్లు మాత్ర‌మే వ‌చ్చాయంటే వారి ఇన్నింగ్స్ ఎంత స్లోగా సాగిందో అర్థం చేసుకోవ‌చ్చు. 

56
Asianet Image

4. ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ బౌలింగ్

ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ విజ‌యంలో బ్యాట‌ర్ల‌తో పాటు బౌల‌ర్లు కీల‌క పాత్ర పోషించారు. త‌మ అద్భుత‌మైన బౌలింగ్ తో చెన్నై సూప‌ర్ కింగ్స్ ను దెబ్బ‌కొట్టారు. ముఖ్యంగా పవర్‌ప్లే, మిడిల్ ఓవర్లలో ప‌రుగులు రాకుండా చెన్నై బ్యాట‌ర్ల‌ను ఇబ్బంది పెట్టారు. మిచెల్ స్టార్క్ తన 4 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అలాగే, విప్రజ్ నిగమ్ తన 4 ఓవర్ల బౌలింగ్ లో 27 పరుగులు ఇచ్చి కీలకమైన డేవాన్ కాన్వే, శివమ్ దూబేల వికెట్లు తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ కూడా అద్భుతంగా బౌలింగ్ వేశాడు. 

66
5. KL Rahul Super Knock

5. KL Rahul Super Knock

5. కేఎల్ రాహుల్ సూపర్ నాక్

ఈ మ్యాచ్ లో ఢిల్లీ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ అద్భుతమైన నాక్ ఆడాడు. 51 బంతుల్లో 77 పరుగుల కీలక ఇన్నింగ్స్ ను ఆడాడు. తన ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. దీంతో చెన్నై ముందు ఢిల్లీ భారీ టార్గెట్ ను ఉంచింది.

మొత్తంగా బ్యాటింగ్, బౌలింగ్ లో విఫలమై ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. ఎంఎస్ ధోని, విజయ్ శంకర్ లు మిడిల్ ఓవర్లలో జిడ్డుగా బ్యాటింగ్ చేయడం, ఢిల్లీ అద్భుతమైన బౌలింగ్, అంతకుముందు కేఎల్ రాహుల్ సూపర్ నాక్ తో చెన్నై ఓడిపోయింది. ఢిల్లీ దాదాపు 15 సంవత్సరాల తర్వాత చెపాక్‌లో తమ తొలి విక్టరీ సాధించింది.

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
 
Recommended Stories
Top Stories