- Home
- Entertainment
- ashu reddy: అషురెడ్డికి ఆ హీరో అంటే పిచ్చి క్రష్.. అతను చేయిస్తే ఏం చేసిందో తెలిస్తే షాక్‌కి గురవుతారు!
ashu reddy: అషురెడ్డికి ఆ హీరో అంటే పిచ్చి క్రష్.. అతను చేయిస్తే ఏం చేసిందో తెలిస్తే షాక్‌కి గురవుతారు!
అమ్మాయిలు సినిమాల్లో రాణించాలంటే అందంతోపాటు అభినయం, స్పాంటెనిటీ ఉండాలి. అలాంటి లక్షణాలు అన్నీ పుష్కలంగా ఉన్న బుల్లితెర నటి అషురెడ్డి. ఒకవైపు షోలు, ఈవెంట్లు చేస్తూనే.. అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ తన గ్లామర్‌తో యాత్‌ని కట్టిపడేస్తోంది. తాజాగా అషురెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా ఇండస్ట్రీలో ఓ ప్రముఖ హీరో అంటే తనకు పిచ్చి, క్రష్ ఉందని చెప్పింది.. అతనికి పెళ్లైంది, నీకు సిగ్గుందా అని కొందరు తిడుతున్నారని, అయినా పర్వాలేదు అతనంటే పిచ్చి ప్రేమ అని అంటోంది. తన డ్రీం బాయ్ అదేనండి హీరోని రీసెంట్‌గా కలిసినప్పుడు ఏం చేసిందో తెలిస్తే మీరూ షాక్‌కి గురవుతారు మరి...

Ashu Reddy
సినిమా ఫీల్డ్ అంటే అషు ఇంట్లో అసలు ఇష్టం లేదు..
అషురెడ్డి సినిమా ఇండస్ట్రీలో స్థిరపడాలని, నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని అమెరికాలో చదువుకుని హైదరాబాద్ వచ్చేసిందట. కానీ తల్లిదండ్రులకు మాత్రం అషు సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్లడం నచ్చలేదట. ఎన్నోసార్లు ఈ విషయంలో ఇంట్లో గొడవలు జరిగాయంట. చివరికి సోదరి ప్రోత్సహంతో అషురెడ్డి తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిందట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రంగంలో రాణించడానికి సోదరి సపోర్టు మాత్రమే ఉందని.. జీవితాంతం తనకు రుణపడి ఉంటానని అషురెడ్డి చెబుతోంది.
Ashu Reddy
బిగ్‌బాస్ టు బుల్లితెర వరకూ..
అషురెడ్డి రెండు సార్లు బిగ్‌బాస్‌లో అడుగుపెట్టింది. కానీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. అయితేనేం తన గ్లామర్‌తో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. గత కొంతకాలంగా అడపాదడపా సినిమాలు, బుల్లితెర టీవీ షోల్లో తళుక్కున మెరుస్తోంది. చూడ్డానికి అచ్చం సమంత లాగే ఉండే ఆమెకు జూనియర్ సామ్ అనే బిరుదు కూడా వచ్చింది. అయితే.. అలా అందరూ గుర్తించడం, పేరు తెచ్చుకోవడం మొదట్లో చాలా ముచ్చటగా ఉండేదని, కానీ ఆ పేరు తనకు ఇష్టం లేదని రీసెంట్‌గా ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది. తనని అషురెడ్డిగానే ప్రేక్షకులు గుర్తించాలని కోరకుంటున్నట్లు తెలిపింది.
Ashu Reddy
చూపించలేని ప్లేస్‌లో టాటూ..
అషురెడ్డికి టాటూలంటే అసలు ఇష్టం లేదట. కానీ మొదటిసారి తనకు ఎంతో ఇష్టమైన హీరో, డ్రీం బాయ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టాటూ వేయించుకోవాలని అనిపించి.. టాటూ వేయించుకుందట. అదే ప్రైవేట్ పార్ట్స్‌కి సమీపంలో.. దీన్ని చూసిన అనేక మంది నీకు పిచ్చి, పవన్ కల్యాణ్‌కి పెళ్లైంది అలా చేయవచ్చా అని కొందరు అడిగితే.. నా దైవం పవన్, అతనికోసం ఏదైనా చేస్తాను అని చెప్పిందట.
Ashu Reddy
హరిహరవీరమల్లు షూటింగ్‌లో తొలి మీట్..
పవన్‌కు వీరభిమాని అయిన అషురెడ్డి అనుకోకుండా హరిహరవీరమల్లు షూటింగ్ సమయంలో పవన్‌ను కలిసే అవకాశం వచ్చిందట. అసలు తనను కలుస్తారా లేదా అన్న టెన్షన్‌తో ఎంతో ఆతృతగా ఎదురుచూసిందట. చివరికి పవన్‌తో మీట్ అయ్యానని ఆ సమయం జీవితంలో మర్చిపోలేదని చెబుతోంది అషురెడ్డి. హరిహరవీరమల్లు షూటింగ్ విరామంలో అషురెడ్డిని చూసిన పవన్... తొలి చూపులోనే ఆ టాటూ వేయించుకుంది మీరేనా అని అడిగేశారంట.. దీంతో ఒక్కసారిగా గుండె ఆగినంత పనైందని అషురెడ్డి చెప్పారు.
Ashu Redd
పవన్ టీ తాగిన గ్లాస్ అడిగిన అషు..
షూటింగ్ గ్యాప్‌లో పవన్‌ను కలిసి అషురెడ్డికి అక్కడి మూవీ టీం టీ ఇచ్చారట. టీ తాగుతూ.. పవన్ టీ తాగుతున్న విధానాన్నీ గమనిస్తూ అలా చూస్తూ ఉండిపోయిందట అషు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారో కూడా వినలేదట. ఖుషి సినిమాలో భూమిక నడుము చూడటం నాకు నచ్చలేదు అని అషు చెప్పడంతో టవల్ అడ్డుపెట్టుకుని పవన్ విరగపడి నవ్వారంట. ఆయన చేతిపై ఉన్న త్రిసూల్ టాటూ పట్టుకుని చేతిని కూడా చాలా సేపు పిసికేసిందట. చివరికి ఇంకా చాలు వెళద్దాం అనే వరకు చేయి వదల్లేదట. చివర్లో పవన్ ఆమెతో ఇలా అన్నాడంట.. మనకు ఇష్టమైన, నచ్చిన వ్యక్తులతో కలిసే అవకాశం వచ్చినప్పుడు ఫోటోలు, వీడియోలు తీసుకోవడం కంటే వారితో గడిపే క్షణాలు, మూమెంట్స్‌ని ఎంజాయ్ చేయాలని అషురెడ్డికి హితబోద చేసి వెళ్లిపోయారంట. ఏదేమైనా తన డ్రీం బాయ్‌ని కలవడం, ఎవరి కోసం పచ్చబొట్టు వేయించుకుందో అతనే టాటూ ద్వారా గుర్తుపట్టడం మర్చిపోలేని అనుభూతులని అషురెడ్డి అంటోంది.